సముద్రపువొడ్డున ఉన్న పల్లె లాంటి పట్నం, పట్నం లాంటి పల్లె. అక్కడక్కడా నీటికొలనులు. వాటినిండా ఎర్ర తామర పువ్వులు. బాలాజీ చెరువు, సంతచెరువు, పిండాలచెరువు, కుళాయి చెరువు, ఇంకా చాలా చెరువులు వాటిపేర్లు కూడా మనకు తెలియకుండా కప్పెట్టేసినవి... ఈ ప్రదేశమంతా జలకళతో, ఎర్ర తామర పువ్వులతో చిత్రకారుడు గీసిన వాటర్ పెయింట్‌లా ఎంత బాగుండేదో! ఒక్కసారి ఊహించుకోండి. ఎర్రతామరపువ్వులని తెలుగులో కోకనందములు అంటారట. అందుకే ఈ ప్రదేశాన్ని కోకనందవాడ అని పిలిచేవారట, క్రమంగా అదే కాకినాడ అయ్యింది. ఈ కథ ప్రకారం కాకినాడ పదహారణాల తెలుగు పట్టణమన్నమాట. ఆగండాగండి....అలాగని ఫిక్సయిపోకండి. ఇంకొక కథ ఉంది. భారతదేశానికి యూరోపియన్లు వస్తున్న క్రమంలో తీరప్రాంతంలో ఉన్నకారణంగా ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్‌నుంచి, కెనడా నుంచి.... వ్యాపార, ఉద్యోగ విషయమై ఇక్కడ చాలామంది సెటిలయ్యరు. వాళ్ళల్లో కెనడా వాళ్ళకి వారిదేశపు పోలికలు ఈ ఊరిలో చాలా కనిపించి, తెగ నాస్టాల్జిక్ గా ఫీలయిపోయి కో-కెనడా అని పిలుచుకొంటూ అదే ఖాయం చేసేశారట. కెనడా వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పడానికి ఒక చారిత్రక ఆధారం కూడా ఉంది. అదే, సరిగ్గా వందసంవత్సరాల క్రితం ఒక కెనడా దేశస్తుడు జాన్ మెక్లారిన్ స్థాపించిన ప్రతిష్టాత్మకమైన మెక్లారిన్ హైస్కూల్. భారతదేశ రాష్ట్రపతిగా చేసిన వరహాగిరి వెంకట గిరి (వి.వి.గిరి), కేంద్రమంత్రిగా పనిచేసిన మంగపతి సంజీవరావుగారు, సినిమాలలో హాస్యపాత్రలు పోషించే గౌతంరాజు, `మనిసన్నాకా కూసoత కలాపోసన ఉండాల`ని డైలాగులతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన రావుగోపాలరావు, నటవిస్వరూపం యస్వీరంగారావులవంటి ఎందరో ఇక్కడే చదువుకొన్నారు. రేపే (23.11.2012) మెక్లారిన్ హైస్కూల్ వాళ్ళు వందసంవత్సరాల పండుగ జరుపుకొంటున్నారు.
స్కులు గురించి చెప్పుకొంటున్నాం కనుక ఇంకొక్క రెండుముక్కలు - ఏంటంటే, పిఠాపురం రాజా (పి.ఆర్) కళాశాల, మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్, రంగరాయా మెడికల్ కాలేజ్, జె.ఎన్.టీ.యూ ఇంజనీరింగ్‌కాలేజ్(ఈ మధ్యనే యూనివర్సిటిగా మార్చారు), ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పోలిటెక్నిక్ కాలేజ్- జీ.పీ.టీ, ఆంద్రా పోలిటెక్నిక్, ఆంద్రా యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్ సెంటర్....లాంటి విద్యాసంస్థలు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్నాయి.
* * *
సముద్రతీర ప్రాంతం కాబట్టి, పడవల తయారీ పరిశ్రమ ఇక్కడ ఉంది. కొంతకాలం క్రితం ద హిందూ న్యూస్ పేపర్లో దీని గురించి రాస్తూ 6000 సంవత్సరాల క్రితంనాటి సాంప్రదాయక పడవల తయారీ విధానం ఇంకా కాకినాడలో కొనసాగుతుందని సోదాహరణంగా చెప్పారు. గుజరాత్లో లోథాల్ అనే ప్రాంతంలో జరిపిన పురావస్తుశాఖ తవ్వకాల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన చాలా అవశేషాల్లు బయటపడ్డాయి. వాటిల్లో 710అడుగుల పొడవు, 120అడుగుల వెడల్పూగల అతిపెద్ద పడవలు ఉన్నాయి. వీటిని తయారుచేసే విధానం గురించి ప్రాచీన గ్రంధాలయిన యుక్తి కల్పతరు, ఋగ్వేదం, సమరాంగణ సూత్రధార, కౌటిల్యుని అర్థశాస్త్రం మొదలైన వాటిల్లో రాసి ఉందట. ఇప్పుడు కాకినాడలో తయారు చేస్తున్న పడవలు అచ్చంగా అలాగే ఉంటున్నాయట. బోటు తయారీ దారులు తమకు ఈ విద్య తమ తాతల తాతలు నుంచి వంశపారంపర్యంగా పస్తుందని చెప్తారు. ఎక్కడోఉన్న గుజరాత్‌ని కాకినాడకి ఏదో రకంగా ముడిపెట్టి ఈ ఊరికి చారిత్రక ప్రాధాన్యం కలిగించడానికి కాదుకానీ ఒక పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్న ఆనవాళ్ళు ఇక్కడ కనిపించడం చూస్తుంటే ఆనందంగా ఉండదూ?
* * *
పడవల గురించి మాట్లాడుతుంటే ఇంకొక విషయం చెప్పాలని ఉంది. కాకినాడ ఊరికి ధక్షిణంవైపు జగన్నాధపురం ఉంది. మధ్యలో బకింగ్‌హం కాలువ ఉంది. ఈ రెండు ప్రాంతాలనీ అనుసంధానం చేయడానికి రెండు వంతెనలు ఉన్నాయి. వాటిపైనుంచి చూస్తుంటే కాలువ మీద వందలకొద్దీ రంగురంగుల లాంచీలు, బార్జీలు, పడవలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
పాత వంతెన మల్లెపూల పరిమళంతో గుభాళిస్తుంది. ఎందుకంటే వంతెన ఫుట్‌పాత్‌ని చేర్చి జగన్నాథపురంవైపు ఎన్నో పూలకోట్లు, `మూర పదిరూపాయలే,` అని అరిచే సైకిళ్ళమీద అమ్మకందార్లూ. పాతవంతెన పేరుని పూల వంతెనగా మార్చేశారు. పూర్వం వంతెనలు లేనప్పుడు ఈ కాలువ మీద డ్రమ్ములమీద కట్టిన తేలే చెక్క వంతెన ఉండేదట. పగలు వాహనాలు వంతెనదాటి వెళితే, రాత్రి సమయంలో దానిని ప్రక్కకి తొలగించి పడవలకీ, లాంచీలకీ దారి వదిలేవారట.
* * *
హంస పాలనీ, నీళ్ళనీ వేరుచేయగలిగి నట్లు, ప్రజలు ముక్తినీ, రక్తినీ వేరుచేశారు. `ఎక్కడా? ఎలా?` అంటారా? ఇక్కడేనండి. మెయిన్ రోడ్డుకి సమాంతరంగా అటొకటీ, ఇటొకటీ రెండు రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డులో ఆచివరినుంచి, ఈ చివరివరకూ అన్నీ ఆలయాలే. ఇంకొక రోడ్డులో అన్నీ సినిమా థియేటర్లు. ఆ వీధుల పేర్లు - దేవాలయం వీధీ , సినిమా వీధీ.
* * *
బందరు పేరుచెపితే లడ్డూలు, కాష్మీరు పేరుచెపితే యాపిళ్ళు ఎలా జ్ఞాపకం వస్తాయో; కాకినాడ పేరు చెపితే కాజాలు అలా వస్తాయి. మడత కాజాలు, గొట్టం కాజాలు - అబ్బా నోరూరడంలేదూ? ఒక్కనిమిషం ఉండండి, ఒక కాజా తినేసి వచ్చి మళ్ళీ కొనసాగిస్తాను....... సుబ్బయ్య హోటల్, మహాలక్ష్మీ పెసరట్లు, అయ్యరు కాఫీ, మీసాలరాజు కోడి పలావు... కాకినాడ వచ్చినప్పుడు టేస్ట్‌చెయ్యండేం?
* * *
`మన కాకినాడలో` పేరుతో ఈ బ్లాగ్ మొదలుపెట్టి అయిదు నెలలు అవుతుంది. గోదావరి జిల్లాల్లో విశేషాల గురించి, చూడదగ్గ ప్రదేశాల గురించి, ఇక్కడ పుట్టి పెరిగిన గొప్పవాళ్ళగురించి రాస్తూనే మిగిలిన నేను రాయగలిగిన విషయాలు రాస్తూ వెళుతున్నాను. పరిది పెంచుకొంటూ ఇంకా చాలా విషయాల గురించి వ్రాయాలని ఉంది. ప్రాధమికంగా నా బ్లాగ్ ఒక ప్రాంతీయ బ్లాగ్‌గా కనిపించినా, నిజానికి కాదు. నాకు బాగా తెలిసున్నవి కొన్ని, తెలుసుకొని వ్రాస్తున్నవి కొన్ని. వూరి మీద అభిమానంతో అలా అలా ముందుకి వెళుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కాకినాడ గురించి తెలుసుకోవాలని అనిపిస్తే నా బ్లాగ్ కొంత ఉపయోగ పడుతుందేమో నని...
బ్లాగ్ మొదలు పెట్టిన తరువాత ఎంతో మంది సహబ్లాగర్ మిత్రులు తమకామెంట్లతో నన్ను ప్రోత్సహితున్నారు, వారందరికీ ధన్యవాదాలు. ఈ టపాలో ఇవి ప్రస్తావించడానికి కారణం - ఇప్పటికి యాభైకి పైగా పోస్టులు వ్రాస్తే, పదివేల మంది వరకూ(9935 మంది) వాటిని చదివారు. `నేను వ్రాసింది అంతమంది చదివారా!` అని ఆశ్చర్య పోతూ ఈ టపా రాస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలతో...మీ క్లిక్కె పదివేలోది అవుతుందేమో!
* * *
ఇంకొక్క విషయం 2012 ఫిబ్రవరిలో `మన కాకినాడ` అనే ఫేస్‌బుక్ గ్రూప్ మొదలు పెట్టడం జరిగింది. దగ్గరగా 6,000 మంది సభ్యులతో అతిపెద్ద కాకినాడ గ్రూపులలో ఒకటిగా ఉంది. మీకు ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి
© Dantuluri Kishore Varma
చాలా బాగుంది. ఇంకా కాకినాడ గురించి మీకు తెలిసిన విశేషాలు తెలియజేస్తూ ఉండండి.
ReplyDeleteఅబినందనలు వర్మ గారు
ReplyDeleteఏదో రాసాంలే అని కాకుండా ప్రతీ టపాలోనూ ఎంతో కొంత సమాచారం ఉండేలా రాస్తున్నారు మీరు . కాకినాడ కు సంబంధించి మీరు చెప్పిన మొదటి కథ నాకు ఇప్పుడే తెలిసింది. కో- కెనడా గురించి ఇదివరకే విన్నాలెండి.
తప్పకుండానండీ గోపాలకృష్ణగారు. ధన్యవాదాలు.
ReplyDeleteలలితగారు, మీపరిశీలనకు ధన్యవాదాలు. వీకీ పీడియాలో ఈ మొదటికథ గురించి ఒక సింగిల్ లైన్ వుంటుందండి.
ReplyDelete>>>>నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కాకినాడ గురించి తెలుసుకోవాలని అనిపిస్తే నా బ్లాగ్ కొంత ఉపయోగ పడుతుందేమో నని...<<<
ReplyDeleteతప్పకుండా ఉపయోగపడుతుందండీ. సందేహం లేదు. మీరు రాసే విధానం, ఎంచుకునే అంశాలు బాగుంటాయి. ప్రతి టపాలోనూ ఏదో ఒక క్రొత్త విషయం తెలుస్తుంది. కోకనందవాడ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కాకినాడని మీతో తిప్పి మరీ చూపించారు. బాగుందండీ టపా.
మీప్రోత్సాహం అమూల్యo శిశిరగారు. ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది కిషోర్ వర్మ గారు. చదువుతూ ఉంటే గర్వంగా అనిపించింది. చాలా మందికి మన కాకినాడ చరిత్ర, ప్రాముఖ్యత తెలియవు. మీ పోస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంది. మీకు వీలుంటే మరిన్ని విషయాలు మాకు తెలియజేయవలసింది గా కోరుతున్నాను.
ReplyDeleteధన్యవాదాలు కృష్ణ చైతన్యగారు. తప్పకుండా రాస్తానండి.
ReplyDelete"మన కాకినాడ వైభవాన్ని అద్భుతంగా వివరణ ఇచ్చినందుకు మీకు వెయ్యి వీరతాళ్ళు వెయ్యాలండి." మీరు ఇంకా యెన్నో మంచి వ్యాసాలు ప్రచురించాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.... :)
ReplyDeleteఅనంతం కృష్ణ చైతన్య గారు -^-
ReplyDeletechala adbhuthamga rasaru varma garu... nenu kooda naku telisina vishayalatho mana kakinada gurinchi rasthanu... manam antha kalisi mana kakinada kyathini prapanchaniki raboye mana kakinada yuva kerataliki telupudham
ReplyDeleteశ్రీకాంత్‌గారు ధన్యవాదాలు. మీబ్లాగ్ లింక్ కూడా ఇస్తే బాగుండేది.
ReplyDeleteChala chala bagundi sir... nenu chaduvkunnadi kakinadalone ah uru ante chala istam naku... ila maku articles pamputhu undadni sir ah patha rojulani nemaru veskuntanu :)
ReplyDeleteనా బ్లాగుకి మీకు స్వాగతం కళ్యాణ్ గారు. మీ కామెంటుని బట్టి మీకు కాకినాడ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఈ టపా మీకు నచ్చినందుకు సంతోషం. ఈ బ్లాగులో కాకినాడ పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి చూడండి.
ReplyDeleteI love it varma garu....
ReplyDeletemee blog regular ga chaduvutu vuntanu....chala baga vrastunnaru....Dr.D.V.Subba Rao
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలు సుబ్బారావు గారు. మీకు నచ్చేలా ఇకముందు కూడా రాయడం కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.
ReplyDeleteమీ బ్లాగ్ చాలా బాగుంది. గోదావరి జిల్లా విశేషాలగురించి,కాకినాడ చరిత్ర, ప్రాముఖ్యతగురించి తెలిపిన విషయాలు బాగున్నాయి
ReplyDeleteNice blog .Godavari jillala gurinchi baaga teliyajesthunnaru.....Lakshmi.
ReplyDeleteధన్యవాదాలు లక్ష్మి గారు. నాబ్లాగుకి మీకు స్వాగతం.
ReplyDeleteChala bagundi ee blog
ReplyDeleteThanks a lot Anonymous garu. If you had commented with your identification, it would have been much more delightful for me.
ReplyDeleteNice one kishoregaru....very happy...Aruna...
ReplyDeleteచాలా థాంక్స్ అరుణగారు. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం.
ReplyDeleteeven though....im not frm godavari districts,I like the environment ,sply,nature beauty and water................god's own place in AP........................venkatesh,hyd
ReplyDeleteగోదావరి అందాల్ని, పరచుకొన్న పచ్చదనాన్ని ఆనందించనివారు వుండరు. మీరన్నది నిజం. ధన్యవాదాలు వెంకటేష్‌గారు.
Deletenice blog sir :) your description was awesome
ReplyDeleteథాంక్యూ Sushmitha గారు :)
DeleteKallaki kattinattu varnisthunnaaru sir... Vamsi gaari godari kadhallaa.. Sankaramanchi gaari Amaraavathi characterslaa....
Deleteమంచి కాంప్లిమెంట్ ఇచ్చారు చౌదరిగారూ :) ధన్యవాదాలు.
DeleteVery interesting Varma garu. Ma native place KKD andi, but memu HYD lo untunamu,Ma father McLauren school lo and Nenu GPT lo chadiva.
ReplyDeleteKaja gurinchi cheppi nenu danini inkosari miss avuthuna felling ekuva chesaru
:(
Thank u so much n keep on posting about our beloved Kakinada.
ధన్యవాదాలు దీప్తిగారు. మనకాకినాడ గురించి, తూర్పుగోదావరి జిల్లా గురించి ఈ బ్లాగ్‌లో ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని కూడా చదివి ఆనందిస్తారని అనుకొంటున్నాను.
Deleteకాకినాడ వదిలి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా నా చిన్నతనం తియ్యని ఙాపకాలు నిరంతరం నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి.కాకినాడ గురించి మీరు తెలిపిన విశేషాలు చదివి చాలా సంతోషించాను. ధన్యవాదాలు
ReplyDeleteThank you Sir :)
Delete