Pages

Tuesday 20 November 2012

ఓరి దేవుడా!

దేవుడి కోసం తపస్సు చేసిన ఓ మనిషికి ఆయన ప్రత్యక్ష మయ్యాడు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ.... సౌకర్యంగా ఉండడానికి మనిషి మాటలని ఎరుపు రంగులో, దేవుడి మాటలని  నీలం రంగులో ఇవ్వడం జరిగింది.  చదవండి : )

నాకు సంపూర్ణ ఆయిష్షు కావాలి.

అంటే ఎన్ని సంవత్సరాలు?

సంపూర్ణ ఆయుష్షు అంటే ఎన్ని సంవత్సరాలో నీకే తెలియదా స్వామీ!?

ఆశ్చర్యపోవద్దు. `ఒక మనిషి` ఇంతకాలం బ్రతకాలీ` అనే ఎక్స్‌పయరీ డేటు  నేనెప్పుడు  ఇవ్వలేదు. ఒక ఆత్మ ప్రయాణించడానికి కావలసిన వాహనంగా శరీరాన్నీ ఇచ్చి, అందులో బుద్దినీ, మనసునీ పెట్టి  ఉత్కృష్టమైన మనిషిని సృజించాను. ఆ వాహనాన్ని సరిగా ఉపయోగించడం రాక ఎందరో అల్పాయుష్కులు అవుతూ ఉన్నారు.

నేను డబ్బుకూడా అడగాలనుకొంటున్నాను. కావలసినంత ఆస్థి, జీవితం ఉన్నప్పుడు ఎలా, ఎందుకు బ్రతకాలీ అన్న ప్రశ్నే రాదు. జల్సాయే జల్సా, నా సామి రంగా.

ఒక బహుమతిలాగ రంగుకాగితం చుట్టి ఏదీ రెడీమేడ్ గా  నీ చేతిలో పెట్టడానికి నేను రాలేదు. ఆరోగ్యవంతమైన (Healthy) శరీరంలో, ఆరోగ్యమైన ఆలోచనలు ఉంటాయి అంటారు. ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకో. యువకుడికి ఉండవలసిన లక్షణాలేవీ నీలో లేవు. మొదటి అవలక్షణం నీ బొజ్జ. ఫాస్ట్ ఫుడ్డ్ తింటున్నావో, మందు కొడుతున్నావో తెలియదుకానీ, కండ ఉండవలసిన చోటా, ఉండకూడని చోటా కూడా కొవ్వే ఉంది. మంచి ఆహారం తిను: యోగా, వ్యాయామం చెయ్యి. మందు, సిగరెట్టు, గుట్కాలాంటివి మానెయ్యి. చక్కటి శరీరాకృతిని పెంపొందించుకో. శరీరంలో ఉన్న మెదడుకి కూడా వ్యాయామం అవసరమే! మంచి పుస్తకాలు చదువు, అభిరుచిగల సినిమాలు చూడు. దీనిని మైండ్ ఫీడింగ్ అనొచ్చు. ఇది పాసివ్ ఆక్టివిటీ మాత్రమే. అంటే ఎవరివో ఆలోచనలని నీ మెదడులోనికి చొప్పించుకోవడం. దేవుడు ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నడేమిటని అనవసరమైన వృధా ఆలోచనలు చెయ్యడం మానేసి చెప్పేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. పాసివ్ ఆక్టివిటీద్వారా పెంచుకొన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకో. ఏదయినా వ్రాయి, బొమ్మలెయ్యి, వక్తగా బోరుకొట్టించని ఉపన్యాసాలు ఇవ్వు, లేదా నువ్వు పనిచేసే చోట ఆ జ్ఞానాన్నివిచక్షణతో  వాడు...జ్ఞానానికి ప్రొడక్టివ్ వేల్యూని ఇవ్వడం అన్నమాట. అప్పుడు నీకు జీవితం యొక్క నిజ విలువ కొంతతెలుస్తుంది. 

అనవసరంగా బోలెడు సమయం వృదా చేసుకొని నీకోసం తపస్సు చేశానేమో అనిపిస్తుంది. వరాలు ఇమ్మంటే ఉపన్యాసాలు ఇస్తావేమిటి స్వామీ? (నీకంటే మా మేనేజరు వెధవే బెటరు. బుర్రమేసేస్తున్నావు స్వామీ)

తుచ్చుడా! నువ్వు మనసులో ఏమి అనుకొంటున్నావో నాకు తెలియదు అనుకోకు. మేనేజరుని, తోటి ఉద్యోగులని, బందువులని, పక్కింటివాళ్ళని, ఆఖరికి నీ కుటుంభసభ్యులని కూడా తిట్టుకొంటావు. నీకు సమాజంతో ఎలా మెలగాలో తెలియదు. నీభాషలో చెప్పాలంటే, ఇంటర్ పెర్సనల్ స్కిల్స్(Interpersonal Skills)  నీకు జీరో. నచ్చే పని అందరికీ దొరకక పోవచ్చు; దొరికినపనినే ఇష్టంగా చేస్తే విజయం సాధించగలవు.  ఇది నీ ఒక్కడికే కాదు. విద్యార్థులు, గృహిణులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు.... అందరికీ వర్తిస్తుంది. నీకు చేసే పని(Occupation) కంటే, పనిలేకుండా ఉండే ఖాళి సమయం(Leisure) మీద ఇష్ఠం ఎక్కువ. ఎనిమిది గంటల పని తరువాత సమయంలో దొరికే తృప్తి, రోజంతా పనిచెయ్యకుండా కూర్చుంటే రాదు.

(బిక్క మొహం పెట్టి) కాస్త టూకీగా చెప్పొచ్చు కదా స్వామీ? 

అయితే విను. నీకు HOLI పండుగ తెలుసు కదా? ఈ పండుగను నువ్వు గుర్తుపెట్టుకొంటే నీ జీవితం రంగులమయం అవుతుంది. HOLI లో నాలుగు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. H అంటే Health, O అంటే Occupation, L అంటే Leisure, I అంటే Interpersonal Skillsఇవి నాలుగూ సరిగా నిర్వహించేవాడే విజేత కాగలడు.

(మానవుడి మొహం వెలిగింది. దేవుడు చెప్పేది కొంత, కొంత అర్ధమౌతున్నట్టే ఉంది. కానీ అంకా చాలా సందేహాలున్నాయి.) బాగుంది స్వామీ. కానీ డబ్బు మాట ఏమిటి? బోలెడు డబ్బు ఉంటే విలాశవంతమైన జీవితం గడపాలని ఉంది. 

డబ్బే ప్రధానమనుకొని, అక్రమ మార్గాల్లో కోట్లకు కోట్లు మింగేసిన రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారుల పరిస్థితి ఏమయ్యిందో చూస్తున్నావు కదా? జీవితానికి శాంతి లేకుండా దొంగల్లాగ జీవించడం ఎందుకు!? కాబట్టి ధనం గురించి మంచి దృక్పదం అలవాటుచేసుకో. నీకు వచ్చినదానికి సరిపోయే జీవనవిధానాన్ని ఏర్పరచుకో. అందనిదానికోసం నిచ్చెనలు వేసి అఖాతంతోకి పడిపోకు. అప్పుడే  సుఖమూ, శాంతీ రెండూ దొరుకుతాయి. 

దీనిని LAMP కాన్సెప్ట్ అని పిలవవచ్చు. అంటే Lifestyle as per the Attitude you form towards Money to attain Peace. ఇది ఒక దీపంలాగ నీబ్రతుకుకి శాంతి ప్రసాదిస్తుంది. సుఖీభవ!!

`ఠంగ్!!` (అంటే దేవుడు మాయమైపోయాడని)!

ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన విషయాలేమిటో (నాకు తోచినవి) చెప్పడానికే ఈ పోస్ట్.

సంభాషణ అంతే జరిగింది. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే తపస్సుచేసుకొని, దేవుడిని ప్రసన్నంచేసుకోoడి. ఆయనే తీరుస్తాడు!
© Dantuluri Kishore Varma

27 comments:

  1. ధన్యవాదాలు శర్మగారు.

    ReplyDelete
  2. నాబ్లాగుకి మీకు స్వాగతం అనంతo కృష్ణచైతన్య గారు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఠంగ్!!!!! ( అంటే అదిరిపోయేలా చెప్పారని . కాన్సెప్ట్ బావుంది ఆచరించగలిగితే....)

    ReplyDelete
  4. ధన్యవాదాలు లలితగారు. బహుచక్కగా రాసే మీలాంటి సీనియర్ బ్లాగర్ నుంచి ప్రశంశ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీలయినప్పుడల్లా నాబ్లాగ్‌కు విచ్చేసి మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తే ఆనందిస్తాను.

    ReplyDelete
  5. (ధనం గురించి మంచి దృక్పదం అలవాటుచేసుకో. నీకు వచ్చినదానికి సరిపోయే జీవనవిధానాన్ని ఏర్పరచుకో. అందనిదానికోసం నిచ్చెనలు వేసి అఖాతంతోకి పడిపోకు. అప్పుడే సుఖమూ, శాంతీ రెండూ దొరుకుతాయి). This is correct and i liked very much

    ReplyDelete
  6. Very good what u said about money,

    ReplyDelete
  7. నాబ్లాగుకి మీకు స్వాగతం కిషోర్ గారు. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదలు.

    ReplyDelete
  8. Simple, straight, awesome as usual....:)

    ReplyDelete
  9. Kishore Garu,
    Mee Post kosm eppudani eduru chustuntam

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా ధన్యవాదాలు నవీన్‌గారు. తప్పనిసరిగా రెగ్యులర్‌గా రాస్తాను.

      Delete
  10. So excited.. chala perfect ga chepparu

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫణితేజశర్మగారు

      Delete
  11. చాలా బావుందండి . టంగ్ టంగ్... అంటే గుడి గంటలు మ్రోగటం అన్నమాట . :)

    ReplyDelete
    Replies
    1. హ.. హ.. అదీ సరియైన మాటే వనజ గారూ :)

      Delete

  12. కిషోర్ గారు,

    హోలీ ల్యాంప్ :) బాగుంది మీ ACRONYM :)

    @వనజ వనమాలీ గారు,

    ఏమండీ మీ బ్లాగు టపా కి కామెంట్ల కి తాళం పెట్టేసేరు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు Zilebi గారూ :)

      వనజగారు ఎందుకు రీడర్స్ కామెంట్స్‌ని డిజేబుల్ చేశారో!

      Delete
    2. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ ఎక్కువయిందిగా. "సభ్యులు" మాత్రమే వ్యాఖ్యలు వ్రాయచ్చనే కండిషన్ పెట్టి ఓ exclusive club లాగా తయారుచేసుకుంటున్నారు. కానివ్వండి, ఎవరి బ్లాగ్ వారిష్టం.

      Delete
    3. ఫేస్ బుక్కు మహిమ.

      Delete
  13. నడిపించెడు వాడు రామభద్రుండట!
    నడిచెడిది భాగవత మార్గమట!
    నే నడిచిన భవహర మగునట!
    నడిచెద వేరొండు దారుల నడువగ నేల?

    ReplyDelete
    Replies
    1. బహుబాగు హరిబాబుగారూ, ధన్యవాదాలు :)

      Delete
    2. పేరడీ బాగానేఉంది కానీ కందంగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది

      Delete
    3. యేదో సరదాగా "రచన" కావ్యగతమైతే "నడక" జీవితగమనానికి సంబంధించ్హినది అనిపించి అలా వ్రాశాను,అంతే!

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!