ఈ పోస్ట్ టైటిల్ ఒక పాపులర్ సెల్ఫ్‌హల్ప్ బుక్‌ని పోలి వుండవచ్చు. కానీ, దానికీ దీనికీ ఏ సంబంధం లేదు. చాలా కాలం క్రితం నేను ఒకసంస్థలో పనిచేస్తున్నప్పుడు, నాతో పాటూ ఒక బుద్ధిస్ట్ పనిచేసేవారు. బౌద్ధమతాన్ని అవలంభించే వాళ్ళని కలవడం అదే మొట్టమొదటిసారి నాకు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన తండ్రిగారు బుద్ధుని బోధనలను గురించి రెండుపుస్తకాలని ఇచ్చారు. `లెట్ నోబుల్ థాట్స్ కం ఫ్రం ఆల్ డైరెక్షన్స్` అని ఋగ్వేదంలో చెప్పినట్టు, మంచి అనేది ఎక్కడున్నా గ్రహించవలసిందే. చిన్న బుక్‌లెట్స్‌లాగ ఉన్న వాటిని చదివినప్పుడు బౌద్ధంలో ఆచరణాత్మకమైన విధానం ఉందనిపించింది. నాలుగంటే నాలుగే సత్యాలని అవగాహన చేసుకొంటే ఆనందంగా ఉండగలిగే స్థాయికి చేరుకోవచ్చు.
1. మొదటి అంశం కొంచెం నిరాశా వాదంతో మొదలైనట్టు ఉంటుంది. కానీ, అది వాస్తవం అనే పునాది. భగవద్గీత చూడండి! అర్జున విషాదయోగంతో మొదలౌతుంది. అలాగే బౌద్ధం కూడా జీవితంలో కస్టాలూ బాధలూ అనేవి సర్వసాధారణం అని చెపుతుంది. ఇవి శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు. అలసట, అనారోగ్యం, గాయపడడం, మరణం లాంటివి శారీరకమైన కష్టాలు అయితే; ప్రేమరాహిత్యం, ఒంటరితనం, భయం, భవిష్యత్తుగురించి ఆందోళన, ఆశాభంగం మొదలైనవి మానసికమైన కష్టాలు. ఇవి ఉన్నాయని అవగాహన పెంచుకోవడమే ప్రారంభం.

2. అవసరం, కోరిక అనే మాటల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. అవసరం అనేది తీరుతుంది, కోరిక తీరదు. బాధలకి కారణం కోరికే. ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా అవసరాలని మాత్రం తీర్చుకొంటే మానసికమైన కష్టాలని దూరంగా ఉంచవచ్చు. అయితే ఏది అవసరం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఒక సాధారణ ఉద్యోగి భవిష్యత్తుకోసం కొంతపొదుపు, వైద్య అవసరాలకోసం మెడికల్ ఇన్స్యూరెన్స్, అద్దెఇంటి కష్టాలు తప్పించుకోవడానికి ఒక సొంతగూడు, తిరగడానికి ఒకవాహనం లాంటివి కనిస అవసరాలు అనుకొంటే; రోజుకూలీ చేసుకొనే వాడికి వీటిలో కొన్ని అందుకోలేని విలాసాలు కావచ్చు.
కష్టం అందనిదాన్ని కోరుకోవడంతో మొదలౌతుంది. సెల్‌ఫోన్ అవసరం. ఒక మూడువేలతో సాధారణమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుక్కొని వాడుకొంటూ ఉంటాం. మనకన్నా కొంచెం డబ్బున్నవాడు స్మార్ట్ ఫోన్ వాడుతుంటాడు. మనం వాడేది విసుగు పుడుతుంది, వాడు ఉపయోగించేదానిమీద ఆశ కలుగుతుంది. కొనుక్కోవాలని ప్రయత్నిస్తాం. ఓపిక సరిపోదు. నిరుత్సాహ పడతాం. ఒకవేళ దాన్ని సాధించుకోగలిగినా, ఆ మరునాడు ఇంకొక పెద్ద వస్తువుమీదకి మనసులాగకుండా ఉండదు. అలాగే ఒకఫ్రెండ్ అప్పిస్తాడని, ఒక అందమైన అమ్మాయి ప్రేమిస్తుందని, షేర్‌మార్కెట్లో లక్షలు సంపాదించవచ్చని స్థాయినిమించి ఆశిస్తే ఏడుపే మిగులుతుంది.
కోరికలేకపోతే అభివృద్ది ఎక్కడ ఉంటుంది అని మీరు అడగవచ్చు. అందుకే మన సామర్ధ్యం తెలుసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని ముందే చెప్పడం జరిగింది. ఒక మెరిట్ స్టూడెంట్ ఐఏఎస్ కావాలని కోరుకోవడం, మరొక అత్తెసరు మార్కులతో పాసయిన విద్యార్థికూడా అదే లక్ష్యంగా పెట్టుకోవడం మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది?
3. ఆనందాన్ని సొంతంచేసుకోవడం సులభమే అంటాడు బుద్ధుడు. అనవసరమైన కోరికలని దూరంగా ఉంచడం. అలసట, అనారోగ్యం, గాయపడడం లాంటి శారీరక కష్టాలు కలిగినప్పుడు సహనంగా ఉండడం, జీవితం మనకిచ్చిన మంచివిషయాలని మనస్పూర్తిగా ఆస్వాదించడం, మన అవసరాలు తీరినతరువాత మిగిలినవారికి సహాయపడం, జీవితాన్ని ఏరోజుకారోజు జీవించడం - ఇవి చేస్తే ఆనందం మనసొంతం అంటాడు.
4. మొదటి మూడూ థియరీ పార్ట్ అయితే నాలుగవది వాటిని ఎలా చెయ్యాలో చెప్పే ప్రాక్టికల్ పార్ట్. కష్టాలని, దు:ఖాన్ని అధిగమించడానికి అనుసరించవలసిన మార్గాన్ని చెప్పేది. దీనినే అష్టాంగ మార్గం అంటారు. దీనిగురించి ఇంకొకసారి చెప్పుకొందాం! (ఈ లింక్‌ని నొక్కండి)

ఏ వ్యక్తిత్వవికాస పుస్తకంలోనూ లేని సరళత దీనిలో ఉంది.సరిగ్గా అర్ధం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే ఫలితాన్ని పొందవచ్చు. మీరేమంటారు?
© Dantuluri Kishore Varma