కాకినాడలో స్టార్ హోటళ్ళు, రిటెయిల్ మార్ట్‌లు, మల్టిఫ్లెక్స్‌లు, కార్ల షోరూంలు, జ్యూయలరీ షాపులు, షాపింగ్ మాల్స్, బట్టల షాపులు వరసగా పెట్టుకొంటూ వస్తున్నారు. ఎవరి నోటివెంటవిన్నా పట్టణం వేగంగా అభివృద్ధిచెందుతుందని చెపుతున్నారు. ఇంత అకస్మాత్తుగా ఎందుకు?
రాజదానిలో పాతికవేలు జీతమొచ్చినా చాలీ, చాలని సంపాదనలా ఉంటుంది. అదే కాకినాడలో ఓ పదివేలు తెచ్చుకొన్నా జీవన వ్యయం తక్కువ కనుక రాజాలా బ్రతికేయవచ్చు. మధ్యతరగతి ప్రజలదగ్గర కొనుగోలు శక్తి ఉంటుంది. ప్రజలకి నిలకడగా ఉండే ఆదాయ వనరులు ఉండాలి. అంటే మంచి జీతం వచ్చే ఉద్యోగమో, బాగా పండే పొలమో, సమృద్దిగా వడ్డీని అందిస్తున్న బ్యాంక్ డిపాజిట్టో, చక్కగా నడుస్తున్న వ్యాపారమో, వృత్తో అన్నమాట. ఏదో ఒక వ్యాపకం చేసుకొని సంపాదించుకొనే వాళ్ళే తప్ప, ఖాళీగా బలాదూరు తిరిగే జనం అరుదు. అలాగని మిగిలినచోట్ల లాగ నిరుద్యోగం, పేదరికం ఇక్కడ లేవని కాదు.
పని అయిపోయిన తరువాత ప్రజలకి ఖాళీ సమయం బాగా ఉండాలి. బయటకు వెళ్ళి చక్కగా తిరిగి రావడానికి అనుకూలంగా ఉండే, జనసమ్మర్ధం లేని రోడ్లు ఉండాలి. ఎలాగంటే, ఉదాహరణకి కాకినాడ ఏ చివరినుంచి, ఏ చివరికైనా బైకు మీదా ఓ ఇరవై నిమిషాలలో వెళ్ళిపోవచ్చు - లేదంటే ఓ అరగంట. పెద్దగా ట్రాఫిక్ జాంలు కూడా ఉండవు. దానికి తోడు మెయిన్‌రోడ్ విస్తరణ కూడా జరిగింది. సినిమా హాళ్ళు, బీచ్ లాంటి ఒకటి రెండు ప్లేసెస్ తప్పించి పెద్దగా రిక్రియేషన్‌కి అవకాశం ఉండకూడదు. ఈ కారణాలన్నీ సరయిన పాళ్ళలో ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ప్రజలందరూ, ఊళ్ళో షాపుల్లో ఏదమ్మితే అది ఎగబడి కొంటారు. షాపింగే వాళ్ళకి పెద్ద వినోదం అవుతుంది. ఊళ్ళో ఎక్కడయినా రాజస్తానీ ఏగ్జిబిషనో, హ్యాండీ క్రాఫ్ట్స్ బజారో, హోంఅప్లియన్సెస్ ఎక్స్ఫోనో, ఫ్యాక్టరీ వాళ్ళ డైరెక్ట్ సేల్ ఆఫర్లో...అదీ, ఇదీ అని కాదు ఏది పెట్టినా తీర్థానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తారు. `ఓరి నాయనో, వారంరోజులపాటు ప్రదర్శన నిర్వహిస్తేనే ఇంత లాభాన్ని అందించారంటే, మనం షాపే పెట్టేసుకొంటే సంవత్సరం తిరిగేసరికి వచ్చినలాభాలతో ఊళ్ళో సగం కొనేసుకోవచ్చు!` అన్న ఆశ మొదలవుతుంది.
ఇవే కాకుండా-
కాకినాడ చుట్టుపట్ల ఉన్న చమురు నిక్షేపాలు. ప్రస్తుతం ఉన్నవి కాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా కాకినాడనుంచి, విశాఖపట్టణం వరకూ ఏర్పాటు చేస్తారని అనుకొంటున్న కోస్టల్ బెల్ట్. ఒక్కసారి అది కనుక కార్యరూపం దాల్చిందంటే, పట్టణం యొక్క ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కాకినాడ, రాజమండ్రీల మధ్య ఉన్న వేలకొలదీ ఎకరాల భూమి. నీటి వనరులు లభ్యత, రవాణా వ్యవస్థా, స్థలసేకరణ అవకాశం కలిగిన ఈ ప్రాంతాన్ని ఏ రకంగానయినా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది.
మౌలికి సౌకర్యాలు వేగంగా ఫలవంతమౌతున్నాయి. కాకినాడా, రాజమండ్రీ కెనాల్ రోడ్డు నాలుగు రోడ్లగా విస్తరించడానికి పచ్చ జండా ఊపారని ఈ మధ్యనే పేపర్లో వార్త వచ్చింది.
వీటన్నింటితో పాటూ కాకినాడని పర్యాటకంగా అభివృద్ది చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బీచ్ ఫెస్టివల్ని అత్యంత వైభవంగా నిర్వహించడం, శిల్పారామం, బీచ్ పార్కుల్ని నెలకొల్పడానికి సన్నాహాలు ప్రారంభించడం, రేపూరులో అత్యంత ఎత్తైన సాయి బాబా విగ్రహం ఏర్పాటు మొదలైనవి కాకినాడని టూరిస్ట్స్ డెస్టినేషన్‌గా మారుస్తాయి.
ఇన్నిరకాల శుభసుచనలు కనిపిస్తూ ఉన్నా - హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం లాంటి సిటీలతో పోల్చుకొంటే రియల్ ఎస్టేట్ రేట్లు చాలా చవకగా కనిపిస్తాయి. ముంబాయినుంచో, హైదరాబాదు నుంచో వచ్చి తమ వ్యాపార సంస్థకి ఒక బ్రాంచ్ పెడదామనుకొనే బడా పారిశ్రామిక వేత్తలకి ఇక్కడి భూమి రేట్లు ఆఫ్ట్రాల్ గా అనిపించడం వింతకాదు.
కాబట్టే ఈ మధ్య అందరి దృష్ఠీ కాకినాడ మీద పడింది.
© Dantuluri Kishore Varma
బాగా చెప్పేరు. నేనెరిగున్న కాకినాడకి ఇప్పటికి అసలు పోలిక లేదు. ఇరుకయిపోతూ ఉంది. వర్షం వస్తే చెరువులా ఉంటోంది. ఒకప్పుడు కాలికి మట్టి అంటుకునేది కాదంటే నమ్మగలరా? కెనడా లా ఉంటుందని ఆ పేరు పెట్టేరు.
ReplyDeleteవర్షం వస్తే చెరువులా ఉండే మాట నిజమే శర్మగారు. మెయిన్ రోడ్‌లో మసీదు దగ్గర, సినిమారోడ్డులో సంత చెరువు దగ్గర, ఇంకా చాలా చోట్ల చిన్న వర్షానికే పెద్ద మడుగులు ఏర్పడతాయి. డ్రెయినేజ్ సిస్టం బాగుపడాలి. కెనడాలా ఉండే ముచ్చట గురించి, ఇంతకు ముందు `అదే పదివేలు` అనే టపాలో రాశాను.
Delete
ReplyDelete20సం;క్రితం చూసాను.చాలా బాగుండేది అందంగా.చవక కూడా.ఇప్పటికీ పరవాలేదనుకుంటాను.కాని మీరు చెప్పిన ''development''ఇంకా ఎక్కువ ఐతే జీవనవ్యయం పెరుగుతుంది.ట్రాఫిక్.రద్దీ,అపరిశుభ్రత,కాలుష్యం పెరిగితీరతాయి.అందులోను మన మున్సిపాల్టీలు.వాటి నిర్వహణ తెలిసిందే.ఇప్పటికి జరిగిన ' అభివృద్ధి ' చాలనుకొంటాను.
నా బ్లాగుకి మీకు స్వాగతం. కాకినాడ ఇప్పటికీ అందంగానే ఉంటుంది `కమనీయం` గారు. పై కారణాల వల్ల అందరిదృష్టీ ఈ పట్టణం మీద పడిందని చెప్పడానికే కానీ, అభివృద్దివల్ల వచ్చే కష్టనష్టాలని ఈ టపాలో ప్రస్తావించలేదు - గమనించే ఉంటారు. మీరుచెప్పిన కాలుష్యం, కాస్టాఫ్ లివింగ్‌లు ఇప్పటికే పెరగడం మొదలయ్యాయి. అభివృద్దితో పాటూ సౌకర్యాల మెరుగుదల ఉంటుందని ఆశిద్దాం.
Delete
ReplyDeleteBalanced and planned development is always good.But it is rare in our country.Anyway I agree that Kakinada is a beautiful town next to Vizag in A.P.
Thank you sir for your valuable time and sensible comments. Do visit my blog and leave your feed back whenever you can spare a few minutes.
Deletethe best city i always want to get settled in is kakinada.... i missed it so much... Hope i could make my future in my destined city... :)
ReplyDeleteAll the very best to you and I ardently hope that your wish fulfills. Thanks for the comment. :)
Deleteచాలా మంచి వ్యాసం వ్రాశారు. నేను కాకినాడ వదిలి యాభై ఏళ్ళు అయినా, రెండు', మూడేళ్ళ కోసారి వచ్చి హాయిగా ఉంటాను. అక్కడ చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. కాస్త తేడాలు ఉన్నా, ఇప్పటికీ చాలా ఆహ్లాదకరమైన నగరం కాకినాడే!
ReplyDeleteమీరు చేపట్టే సామాజిక కార్యక్రమాలు, కాకినాడ గురించి రాసే కబుర్లు ఫాలో అవుతూనే ఉంటాను చిట్టెన్ రాజు గారు. మీరు అభినందనీయులు. మీ స్పందనకి ధన్యవాదాలు.
DeleteLast 10 yrs lo population pollution rendu bayamkaramga perigipoyay. Chuttu pakkala palleturulu nundi andaru ekada settle ipothunaru. Cost of living amantham perigipoyindhi. Yekada chusina traffic. Edi prasththa kakinada mukha chitram. Janabha ki tagattu development aneydhi jaragaledhu. Adhi jarigitheney pensioners paradise ani peruganchina mana kakinada poorva prasantha jeevithaniki chirunamaga nilusthundhi..hope for the best
ReplyDeleteమీరు కోరుకొంటున్న అభివృద్ధి తప్పనిసరిగా జరగాలాని ఆశిద్దాం ప్రసన్న కుమార్ గారు. మీ స్పందనకి ధన్యవాదాలు.
Deletegood post. sir, i would like to know about the mada forest and its surroundings.
ReplyDeletecould you please let me know?
చక్రతేజ గారు ఈ లింక్ ద్వారా వెళ్ళి కోరింగ మడ అడవుల గురిమిచి చదవండి.
Delete