వివేకానందుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేశాడు. ప్రజల స్థితిగతులు అభిలషణీయంగా లేవు. పేదరికం, అవిద్య, మూఢవిశ్వాసాలు, అనారోగ్యం వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. అన్నింటికీ మించి పరాయి పాలకుల క్రింద వెయ్యిసంవత్సరాలుగా బానిసత్వం. నాగరికతలో, శాస్త్రవిజ్ఞానంలో, వైద్యంలో, గణితంలో, విద్యలో ప్రపంచ ప్రజలకు ఒకప్పుడు మార్గనిర్దేశం చేసిన భరతఖండానికా ఈ దుస్థితి! నీచంగా చూడబడుతున్న ప్రజలకి ఆత్మగౌరవం ఇవ్వగల మార్గం ఏది? వాళ్ళలో ఉన్న శక్తిని జాగృతం కావించడానికి ఏమిచెయ్యాలి?
భారతదేశపు ధక్షిణపు కొన నుంచి సముద్రంలోకి ఏభై మీటర్ల దూరంలో హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు కలిసే చోట ఒక చిన్న ద్వీపంలాంటి శిల ఉంది. వేగంగా వచ్చి కొడుతున్న అలల ధాటికి నిబ్బరంగా నిలబడి ఉంది. వివేకానందుని మస్తిష్కంలో కూడా ఆలోచనలు ఉవ్వెత్తున విరిగి పడుతున్నాయి.
ద్యానంలో వాటికి సమాదానాలు కనుగొనాలనుకొన్నాడేమో! సముద్రం మధ్యలో నిశ్చలమైన శిల దగ్గరకి చేరుకోవాలనుకొన్నాడు. పడవకోసం ఆగలేదు. కల్లోల సముద్రంలో ఈదుకొంటు వెళ్ళి, అక్కడే మూడురోజులపాటు నిద్రాహారాలు లేకుండా తపస్సు చేసుకొన్నాడట.
ఈ సంఘటన తరువాతే, చికాగో సర్వమత సభల్లో భారతీయ ఆద్యాత్మిక వాణిని వినిపించి మనదేశ కీర్తి పతాకను ఎగురవేశాడు. బుద్దుడికి భోది వృక్షం ఎలాగో, వివేకానందునికి కన్యాకుమారి వద్ద ఈ శిల అలాగ.
తరువాత చాలా కాలానికి 1970లలో దీనిని వివేకానందా రాక్ మెమోరియల్‌గా అభివృద్దిచేశారు. ఇక్కడ రెండు నిర్మాణాలు ఉన్నాయి ఒకటి వివేకానంద మండపం, రెండవది దేవత కన్యాకుమారి యొక్క శ్రీపాద మండపం.
ఈ రెండు నిముషాల వీడియో చూడండి.
© Dantuluri Kishore Varma
good
ReplyDelete:)
ReplyDeleteI got back to my ferry trip to Rock memorial.An exciting one and worth visiting..the waves of great waters kept rocking all the way...! Great post...have you been there..?
ReplyDeleteNo Murthy garu, but I hope to visit this place.
Delete