తండ్రి మాటకు ఎదురు చెప్పని వినయం
రాక్షసులని దునుమాడిన శౌర్యం
కష్టాలు ఎదురైనప్పుదు మొక్కవోని ధైర్యం
సైన్యాన్ని నడిపినప్పుడు ప్రదర్శించిన
నాయకత్వలక్షణాలు
మాటతప్పని నైజం...
ఏ యూనివర్సిటీలోనూ ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పరు,
కానీ....
ప్రతీ వ్యక్తికీ కావలసిన విలువలు ఇవే!
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma
వీటిని మాత్రమే వద్దంటున్నారు..పురోగతి :)
ReplyDeleteవద్దని అనకపోవచ్చు శర్మగారు. కానీ, ఇటువంటి ఎన్నో అభిలషణీయమైన సద్గుణాలు మన ఇతిహాసాలలో ఉన్నాయని, వాటిని అర్థం చేసుకోవడంవల్ల ఏ పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లోనూ నేర్చుకోలేనంత ఎక్కువగా నేర్చుకోవచ్చనే అవగాహన ఉండటం లేదు. మీలాంటి పెద్దలు కొందరు వాటి గురించి రాస్తూ పాఠకులకి మేలుచేస్తున్నారు. ధన్యవాదాలు.
Deleteమనమే నేర్పుకోవాలండి ఒకరికొకరం:) మీక్కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ReplyDeleteనిజమే జయగారు, బ్లాగింగ్‌లోకి వచ్చినతరువాత ఎన్నో మంచి బ్లాగులని చదవగలుగుతున్నాను, కొత్తవిషయాలు నేర్చుకోగలుగుతున్నాను. బ్లాగ్‌స్పియర్ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాంటిది. మీకు ధన్యవాదాలు.
Deleteజన్మతహ: రక్తం లో ఇవన్ని కొద్దిగా అయినా ఉండాలేమో అని నా అనుమానం.
ReplyDeleteనేర్పితే రావు అసలు అనిపిస్తుంది. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మీరన్నది కొంతవరకూ నిజమే. అంతే కాకుండా, కథల్ని చిన్నప్పటినుంచీ చెపుతూ ఉండడం వల్ల వినేవాళ్ళకి కొన్ని మంచి విషయాలు విలువలుగా మనసుల్లో నాటుకుపోతాయి. చెప్పేటంత సమయం, వినేఅంత ఓపిక ఎవరికీ ఉండడం లేదు కనుక ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో నయినా వాటిని మననం చేసుకొంటే బాగుంటుందని... ధన్యవాదాలు మీకు.
Deleteనిజమే ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పినా అందరికీ రావనే నేర్పరేమో. ఎవరికి వారు అలవరచుకోవాలేమో...
ReplyDeleteమీకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు!
విద్యాలయాల్లో నేర్పినదానికంటే బ్రతుకు బడిలో నేర్చుకొనే అవకాశం ఎక్కువ. ఎవరికి వారు నేర్చుకోవడం కూడా మంచిదే. ధన్యవాదాలు.
Deletenice post.
ReplyDeleteధన్యవాదాలు లాస్య రామకృష్ణగారు. మీ కామెంటు చుసి చాలా ఆనందంగా ఉంది.
Delete