ఓ రెండుకథలు చదివాను. ఒకటి ఈ మధ్యన, రెండవది ఎప్పుడో. వాటిని నా మాటల్లో క్లుప్తంగా చెపుతాను....
కథ 1:
రాజుగారు ఏనుగు అంబారీమీద ఎక్కి రాజవీధుల వెంట వెళుతున్నారు. సంవత్సరానికి రెండుసార్లు అలా వెళ్ళడం ఆనవాయితీ. ప్రజల కష్టసుఖాలని తెలుసుకోవడం, అవసరమయితే సహాయం చెయ్యడం అనేది దీనివెనుక ముఖ్యఉద్దేశ్యం. ఒక ముష్టివాడికి ఈ అవకాశం వదులుకోకూడదని అలోచన వచ్చింది. రోజూ ఒకేపని చెయ్యడం వాడికి కూడా విసుగ్గా ఉంది. ఒకేసారి రాజుగారిని దీనాతిదీనంగా అడుక్కొంటే మళ్ళీజీవితంలో బొచ్చెపట్టే అవసరం ఉండదు. రాజుగారి అంబారీ సమీపిస్తుండగా రాతిగుండెలు కూడా కరిగే విధంగా ఆక్రందించాడు. `మహారాజా నా కష్టాలని కడతేర్చండి, నాకేదయినా దానం చేసి పుణ్యం చేసుకోండి` అని స్పెషల్ఆఫర్ ఇచ్చాడు.
`అందరిదగ్గరా తీసుకొంటునే ఉన్నావు కదా? నేను నీకు ఇవ్వడం కాదు, నువ్వే నాకు ఏదయినా ఇవ్వు` అన్నాడు రాజు.
బిచ్చగాడికి కడుపు రగిలిపోయింది. `ఈ రాజు అడుక్కొనే వాడిదగ్గర తిరిగి అడుక్కొనేవాడిలా ఉన్నాడు` అని మనసులో అనుకొని, నాణాలతో కళకళలాడుతున్న బొచ్చెలోనుంచి ఒకేఒక్క సత్తురూపాయి తీసి రాజుమీదకి విసిరాడు. అంబారీ ముష్టోడిని దాటిపోతూ ఉండగా ఒక బంగారు నాణం వచ్చి వాడిమీద పడింది. రాజుగారు నవ్వుతూ అన్నాడు, `ఒకటికి ఒకటి` అని.
బొచ్చెలో ఉన్న రూపాయలన్నీ ఇచ్చేస్తే ఎలా ఉండేదో తలచుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు ఆ ముష్టోడు.
కథ 2:
ఓ కుర్రాడు ఐస్‌క్రీం కొనుక్కోవడానికి పార్లర్‌కి వెళ్ళాడు. వరుసగా అరలుగా ఉన్న గాజు డిస్‌ప్లేలో రకరకాల ఐస్‌క్రీములు ఉన్నాయి. మొదటిది చూపించి `ఇదెంత?` అని షాపువాడ్ని అడిగాడు.
షాపువాడి సమాదానం - `ఐదు రూపాయలు`.
కుర్రాడు తరువాత అర చూపించి, `మరి ఇది?` అన్నాడు.
`ఎనిమిది రూపాయలు.`
`ఈ మూడోది?`
`ఇరవై. నీకు ఏమైనా కావాలా, వద్దా? నీదగ్గర ఉన్న డబ్బెంతో చెపితే, దానికి సరిపడా ఇస్తాను,` అన్నాడు విసుగ్గా.
`పదిరూపాయలు.`
`అయితే ఈ అయిదురూపాయలవి రెండువస్తాయి తీసుకో,` అన్నాడు.
`వద్దు. ఎనిమిది రూపాయలది ఒక్కటి చాలు,` అని పదిరూపాయలు కాగితం పార్లర్ వాడికి ఇచ్చి ఒక్క ఐస్‌క్రీంతో ఆనందంగా బయటకి నడిచాడు.
ఎనిమిదిరూపాయలు కొన్నదాని ధర, రెండురూపాయలు టిప్పూ చూసి షాపువాడికి నోట మాట రాలేదు.
* * *
ముష్టోడికి ఒక బంగారు నాణేమంత లాభం, ఏడుపూ మిగిలితే, కుర్రాడికి రెండురూపాయల నష్టం, తృప్తి మిగిలాయి. ఇవ్వడంలో ఉన్న దృక్పదమే వాళ్ళ విషయంలో విషాదానికి లేదా ఆనందానికి కారణం. ఇచ్చిపుచ్చుకోవడం రోజూ కొన్ని వందలసార్లు చేస్తూ ఉంటాం. ఇవ్వడం అనేది కేవలం డుబ్బురూపంలోనే కాకుండా సేవలు, ఆఫీసులోనో లేదా ఇంటిదగ్గరో బాధ్యతగా చెయ్యవలసిన పనులు, సలహాలు, ఎవరైనా మంచిపని చేసినప్పుడు ప్రశంసలు... ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. ఎదుటివాళ్ళ గురించి ఆలోచించి చేసే పనిలో(Consideration for others) తృప్తి ఉంటే, స్వార్థంలో ఏడుపు ఉంటుంది.
ఇచ్చినదానికి ప్రతిఫలంగా ఏమి పొందాలనేది నిర్ణయించుకోవలసింది మనమే. చాయిస్ ఈజ్ అవర్స్!
© Dantuluri Kishore Varma
ReplyDeleteమీ టపా కి మా 'శెహభాష్ ఇచ్చే సామండీ !!
జిలేబి
ధన్యోస్మి!
Deletesuper
ReplyDeleteThank you Srini garu.
Deletebaga chepparu
ReplyDeleteధన్యవాదాలు సుబ్బారెడ్డిగారు.
Deleteబావుంది, తృప్తే జీవితాన అతి పెద్ద సంపద.
ReplyDeleteనిజమే, చిన్నిఆశ గారు.
Delete"icchutaloo vunna haayeee..verechhatanu leneeledani....."
ReplyDeletenijamgaa ivvadamloo aanandam anubhavistenee telustundani. 2 kathaloo chaalaa baagunnaai messageki chaala APT.
థాంక్స్ ఎన్ఎన్ గారు.
Delete