Pages

Wednesday 15 May 2013

కాటన్

మేం వచ్చాం,
మేం చూశాం,
మేం గెలుచుకొన్నాం.....

జూలియస్ సీజర్ మాటల్ని తెల్ల వాళ్ళు తమకి ఆపాదించుకొని తిరిగి చెప్పవచ్చు. యావత్తు జాతినీ శృంకలాల్లో బంధించి పరిపాలించారుకనుక ఒకవిధంగా ఈ మాటలకి అర్థం ఉంటుంది.  కానీ ఇక్కడ ఉపయోగించిన `గెలుచుకొన్నాం` అన్న మాట హృదయాలకు సంబంధించినదైతే, అది కేవలం కొంతమంది వ్యక్తులకి మాత్రమే సరిగ్గా  సరిపోతుంది. అటువంటి కొద్ది మందిలో అపరభగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ ముఖ్యమైన వాడు. గోదావరి జిల్లాల్లో కాటన్ విగ్రహాలు నాలుగువేలదాకా ఉన్నాయంటే జనం గుండెల్లో ఈ ఆంగ్లేయుడు ఏవిధంగా గూడుకట్టుకొని ఉండిపోయాడో అర్థమౌతుంది. కొన్ని గ్రామాల్లో అయితే కాటన్ ప్రతీ జయంతి రోజునా(మే 15) ఆయన విగ్రహాలకి అభిషేకాలు చేసి ఉత్సవాలు జరుపుతారు. 
దవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉండకపోతే ఉభయగోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షయపాత్రగా మారిఉండటానికి బదులుగా,  లక్షల ఎకరాలు నేల బీడువారిపోయి, ప్రజలు కరువుకాటకాల బారినపడి నశించి ఉండేవారు. 

`ఆనకట్ట నిర్మించడం లాంటి పనిని ప్రభుత్వం అప్పజెపితే ఏ ఇంజనీరయినా పుర్తిచేస్తాడుకదా, దానిలో కాటన్ యొక్క గొప్పతనం ఏముంది?` అని ఎవరికయినా అనిపించవచ్చు. కానీ, వ్యవసాయ అవసరాలకి ఉపయోగపడే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయిపోతుందని, దానిని అడ్డుకొని భూములని సస్యశ్యామలం చెయ్యవచ్చని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి, పని ప్రారంభింప చేసిన ఘనత కాటన్‌కే దక్కుతుంది.  `గోదావరి నది మీద ఆనకట్ట ఎందుకు కట్టాలి?` అనే ప్రశ్నకి `వరదలు వచ్చిన సమయంలో గోదావరి నదిలో ఒక్కరోజు ప్రవహించే నీరు లండన్‌లో థేంస్ నది గుండా  ఒక సంవత్సరంపాటు ప్రవహించే నీటికి సమానం,` అని ఒక్క వాఖ్యంతో సమాదానం చెప్పి సందేహ నివృత్తి చేశాడట. 

కాటన్ జన్మించి 210 సంవత్సరాలయ్యింది. దవళేశ్వరం బ్యరేజ్ నిర్మించి నూట అరవై ఏళ్ళయ్యింది. కానీ కాటన్‌ జనాల మనసుల్లోఇప్పటికీ  నిలిచిపోయి ఉండడానికి కారణం  ఆయన మానవతావాదం.

© Dantuluri Kishore Varma

8 comments:

  1. మన దొరలు మనల్నే దోచుకుంటుంటే ఎక్కడి దొరో, అయినా మన హృదయాలను దోచుకుని చిరంజీవి కావటం విశేషం.
    ఆయన జయంతినాడు గుర్తుచేసుకుంటూ పోస్ట్ రాసిన మీకు అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. సొంతలాభంమానుకొని పొరుగువాడికి సాయపడమనే మాటని పాటించి అన్నదాతలకే అన్నదాత అయ్యాడు ఈయన. అందుకే అంత గౌరవం. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  2. Here I am presenting Swami Vivekananda's opinion on these English people,Varma garu.


    He wrote to the Hale sisters on November 28, 1896: 'The English are not so bright as the Americans, but once you touch their heart it is yours for ever....I now understand why the Lord has blessed them above all other races — steady, sincere to the backbone, with great depths of feeling, only with a crust of stoicism on the surface. If that is broken you have your man.' In another letter: 'You know, of course, the steadiness of the English; they are, of all nations,least jealous of each other and that is why they dominate the world. They have solved the secret of obedience without slavish cringing — great freedom with law-abidingness.' On still another occasion he called the English 'a nation of heroes, the true kshatriyas....Their education is to hide their feelings and never to show them. If you know how to reach the English heart, he is your friend for ever. If he has once an idea put into his brain, it never comes out; and the immense practicality and energy of the race makes it sprout up and immediately bear fruit.'

    ReplyDelete
    Replies
    1. The observation of the nature of the English by Vivekananda may not be found in every English man. If that had been the case, all the people that were ruled by the English would have been very happy. But most of the qualities mentioned by the Swamy can be seen in Sir Arthur Cotton. Thanks to you Murty garu for your informative comment.

      Delete
  3. దొర అన్న బిరుదుకి న్యాయం చేసినవాడు, సర్ అర్థర్ కాటన్.
    వృత్తిపరంగా చేసే పనినే ఉన్నత ఆశయంతో చేసి గొప్పవాడయ్యాడు.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ వందశాతం వాస్తవం బోనగిరిగారు. ధన్యవాదాలు.

      Delete
  4. మూడు సంవత్సరాల క్రితం మేము కాకినాడ, రాజమండ్రీ పరిసర ప్రాంతాలని చూడడానికి వెళ్ళినప్పుడు కాటన్ దొరగారిమీద ప్రజలకున్న అభిమానాన్నీ, ఇన్నేళ్ళయినా ఆయన పుట్టినరోజుని వారు జరుపుకునే తీరుని సందర్శించే భాగ్యం కలిగింది.. దాదాపు మేము చూసిన ప్రతీ విగ్రహానికీ పూల దండలు వేసి ఉన్నాయి..మీరందరూ రాసినది కరక్ట్.. ఆయ్న ప్రజల హృదయాలలొ ఎప్పటికీ చిరంజీవే..

    ReplyDelete
    Replies
    1. మీ కామెంటు వల్ల ఈ పోస్టుకి ఆథెంటిసిటీ వచ్చింది. థాంక్స్ ప్రసీదగారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!