ఒక దేశం అభివృద్ది సాధించాలంటే, సంపదలతో తులతూగాలంటే వ్యవసాయం, పరిశ్రమలు ప్రధానమైన పాత్ర పోషించాలి. భారతదేశంలాంటి చాలా దేశాల్లో వ్యవసాయం సాంప్రదాయకమైన వృత్తిగా ఉన్న కారణంగా చాలా కాలం ఒకతరం తరువాత మరొకతరం సాగుచేసే మెళుకువలని అందిపుచ్చుకొంటూ ముందుకు సాగింది. తర్వాత క్రమంగా వేరే రంగాల్లో కూడా అభివృద్ది సాధించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సొంత వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించాలంటే; పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే వ్యక్తులకి కావలసిన మార్గదర్శకత్వం ఎక్కడినుంచి వస్తుంది?
వ్యాపార ఆలోచనని ఆచరణలో పెట్టడానికి కావలసిన ప్రణాళిక, మూలధనం సమకూర్చుకోవడం, మానవ వనరులు నిర్వాహణ, సంస్థని విజయవంతంగా నడిపించడానికి అవసరమయ్యే నాయకత్వ లక్షణాలు మొదలనవి ఎలా సమకూరుతాయి? ఇవి వ్యాపారవేత్తల వంశంలో పారంపర్యంగా వస్తాయా? వ్యవసాయ లేదా వృత్తి పరమైన నేపద్యం నుంచి వచ్చిన వాళ్ళకి అవి అందుకోలేనంత ఎత్తులో ఉండిపోతాయా? ఈ సక్సెస్ సూత్రాలని సామాన్యులకి కూడా నేర్పించ గలిగితే ఎన్నో కొత్త వ్యాపార ఆలోచనలు సఫలీకృతమై, దేశ ఆర్థికవ్యవస్థ పురోగతి సాధిస్తుంది. కానీ, వాటిని నేర్పించడం సాధ్యమేనా?
సాధ్యమే అని నిరూపించడానికి అవసరమైన ప్రయోగం 1961వ సంవత్సరంలో జరిగింది. కాకినాడ ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రశిద్దమైన ఈ ప్రయోగం ఎన్నో దేశాలలో `ఎంటర్‌ప్రెన్యూవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(EDP)లకి` అధారమైంది. డేవిడ్ మెక్‌క్లేలాండ్ అనేఆయన `ఏదయినా పని పూర్తిచెయ్యలనే తపనని కలిగిస్తే, ఎవరయినా ఏదయినా సాధించగలర`నే సూత్రాన్ని నిరూపించడానికి మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి 51 మంది వ్యక్తులని ఎంపికచేసి, హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇది విజయవంతం అయ్యింది. శిక్షణలో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ లక్ష్యాలని చేరుకోవడంలో సఫలీకృతం అయ్యారు. డేవిడ్ మెక్‌క్లేలాండ్ `ఎచీవింగ్ సొసైటీ` అనే తన పుస్తకంలో ఈ విషయాలని పొందుపరచాడు. అయితే ఏమిటట అంటారా?
ఈ పరిశోధనా ఫలితాలని ఆధారంగా చేసుకొని మనదేశంలో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యువర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఈడీపీని అందిస్తున్నాయి. ఈ హవా మనదేశం తోనే ఆగిపోలేదు. అమెరికా, ఇంగ్లండ్ లతో సహా ఇంకా చాలా దేశాలు కాకినాడ ఎక్స్‌పెరిమెంట్ నుంచి స్పూరి అందుకొని ఈ శిక్షణని అందిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామికాభివృద్ది శిక్షణకి పునాది మనకాకినాడలో ఉండడం గర్వకారణమే కదా!
© Dantuluri Kishore Varma
good post mr.kishore!
ReplyDeleteThanks Seeta garu.
ReplyDeletewow... proud to be a resident of Kakinada
ReplyDeleteThanks for sharing your feeling Mr Kiran :)
Deleteతాజా వార్త.
ReplyDeleteమీ కాకినాడ సీమాంధ్రకి రాజధాని అవబోతోందట.
అవునట బోనగిరిగారు :)
Delete