ఒక వృద్దుడు - అరవై ఏళ్ళు ఉంటాయి- రోడ్డు వారగా నడచి వెళుతున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది. మోటార్‌బైక్ ఒకటి అతనిని వొరుసుకొంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. బైక్ నడుపుతున్న పాతికేళ్ళ కుర్రాడు వెనక్కితిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. `ముసలోడా..వాకింగ్ పార్క్‌లో చేసుకోవచ్చుకదా?` అన్నాడు. రోడ్డు వెంబడి కనిపించిన జనాలనందరినీ ఏదో ఒకటి అని ఆనందం పొందడం వాడికి అలవాటులా ఉంది. ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలినీ, అడ్డంగా రోడ్డు దాటుకొంటూ వెళుతున్న మామిడిపళ్ళతో ఉన్న తోపుడు బండినీ చూసుకోలేదు. ఒక్క క్షణంలో బైక్ ఆ బండిని గుద్దుకోవడం, బైక్ నడుపుతున్న కుర్రాడు ఎగిరి నేలమీద పడడం జరిగిపోయాయి. వాకింగ్ స్టిక్ తో నడుస్తున్న వృద్దుడు నాలుగు అంగల్లో అక్కడికి చేరుకొని కుర్రాడు పైకి లేవడానికి చెయ్యి అందించాడు.
కొట్టుకుపోయి మండుతున్న మోచేతులూ, మోకాళ్ళను తడుముకొంటూ ఆ కుర్రాడు అడిగాడు, `వెటకారం చేసిన నేనంటే కోపం లేదా?` అని.
పెద్దాయన అన్నాడు, `నా కొడుకు నీలానే తప్పుచేసి, తరువాత వాడికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నీ వయసు కుర్రాళ్ళలో నా కొడుకే కనిపిస్తాడు.`
`మీవయసు పెద్దవాళ్ళలో నాకు నా తండ్రి ఎందుకు కనిపించడం లేదు! నేను మారాలి` అనుకొన్నాడు ఆ కుర్రాడు.
© Dantuluri Kishore Varma
కిషోర్ వర్మ గారు ,
ReplyDeleteచాలా బాగుందండి ,
ధన్యవాదాలు ,
techwaves4u.blogspot.in
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
Thank you Tarun garu.
DeleteWell said:) Good moral.
ReplyDeleteధన్యవాదాలు అనూ గారు. మీకు నా బ్లాగ్‌కి స్వాగతం.
Deleteఅదే యువత కీ తాతకీ ఉన్న తేడా,
ReplyDeleteచాలా చక్కని పరిశీలన!
థాంక్స్ చిన్ని ఆశ గారు.
Deleteపొరపాటు చేసిన వారందరూ ఆ కుర్రాడి లా ప్రవర్తిస్తే సమాజం తొందరగానే మారుతుంది . ఆరోజు రావాలి .
ReplyDeleteనా బ్లాగ్‌కి మీకు స్వాగతం నాగరాణీ గారు. మీ కామెంటుకి ధన్యవాదాలు.
Deleteచాలా బాగుంది సర్! మీరు ఒక విషయాన్ని చెప్పడంలో మీది ఒక ప్రత్యేకమైనశైలి..... చిన్న కధతో పెద్ద ఆలోచన చేయిస్తారు..... అభినందనలు......... గ్రేట్! :)
ReplyDeleteకృష్ణచైతన్య గారు మీ అభిమానానికి ధన్యవాదాలు :)
Deleteokka chinna mukkalo chala adham chepparandi simply super
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం :)
Deleteకథ మీ చేతిలో ఉంది కాబట్టి, ఆ కుర్రాడికి అంత త్వరగా పశ్చాత్తాపం కలిగింది. బయట అసాధ్యం.
ReplyDeleteచాలా బాగుంది సర్!
ReplyDelete