కాకినాడ ప్రత్యేకత ఏమిటంటే తడుముకోకుండా కాజా అని చెప్పేస్తారు చాలా మంది. కాజా కాకపోతే సుబ్బయ్య హోటల్. వినేవాళ్ళకి మొహం మొత్తేస్తుంది. మొన్న ఒకాయన చుట్టపుచూపుగా వచ్చినప్పుడు స్వీటూ, హాటూ తినడానికి పెడితే `వద్దంటే, వద్దు,` అన్నాడు. `ఇది బ్రెడ్డుతో చేసిన పాకం స్వీటు. చెట్టునుంచి అప్పుడే తీసిన తేనెపట్టులా ఉంటుంది` అన్నా ససేమిరా అన్నాడు. పైపెచ్చు మొహం అదోలా పెట్టడంతో కొంచం నొచ్చుకోవలసి వచ్చింది. మా ఫీలింగ్స్ అర్థమయ్యాయేమో `నా కొక స్వీట్ల దుకాణం ఉందండీ. అందుకే ఏ తీపిపదార్ధం చూసినా కడుపులో తిప్పినట్టు అవుతుంది,` అని వివరణ ఇచ్చాడు. ఆ వ్యక్తి బాధ కూడా సమంజసమైనదే! అలాగే కాజా, కాజా, కాజా...అని అదేపనిగా చెబుతున్నా వినేవాళ్ళకి వికారం మొదలవడం ఖాయం. కాకినాడకి నిజానికి పైన చెప్పిన రెండు విశేషాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కాజాని కొంచంసేపు ప్రక్కన పెట్టి మిగిలిన విశేషాల గురించి తెలుసుకొందాం.
రిఫైనరీలో క్రూడాయిల్ విపరీతంగా వేడిచెయ్యబడుతుంది. అప్పుడు దీనిలో ఉన్న వేరువేరు పదార్ధాలు వేరు వేరు ఉష్ణోగ్రతలవద్ద ఆవిరిగా మారతాయి. ఈ ఆవిరిని తిరిగి చల్లార్చడంద్వారా వివిధ పదార్ధాలని వేరుచేస్తారు. నూనె శుద్దిచేసినతరువాత రిఫైండ్ ఆయిల్, వనస్పతి, బేకరీషార్టెనింగులుగా విడగొట్టబడి ప్యాకింగ్ విభాగానికి పైపులైను ద్వారా పంపించబడుతుంది. ప్యాకింగ్ సెక్షన్లో మెషీన్‌ల వద్ద పేకెట్లగా, డబ్బాలుగా తయారు చేస్తారు. వనస్పతీని కోల్డ్ స్టోరేజిల్లో 15 డిగ్రీలకి చల్లబరచడం వల్ల గడ్డకట్టి పేరుకొంటుంది. దీనిని కూడా ప్యాక్‌చేస్తారు.
* * *
శెలవులు ఇచ్చేశారు, ఎక్కడికైనా తీసుకు వెళ్ళమని పిల్లలు గొడవ చేస్తున్నారు. మొహంమొత్తే ప్రతీసారీ తీసుకువెళ్ళే ప్రదేశాలకి వద్దని కండీషను ఒకటి మళ్ళీ! మా అన్నయ్య పృథ్వీరాజు ఒక ఆయిల్ రిఫైనరీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు కనుక అక్కడికి తీసుకు వెళితే వెరైటీగా ఉంటుంది ప్లస్ విజ్ఞానంకూడా.
ఫ్యాక్టరీకి వెళ్ళి అన్నీ చూశాకా మన కాకినాడ యొక్క మరొక ప్రత్యేకత తెలిసింది. వెజిటబుల్ క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంలో దేశంలోనే నాలుగవ అతిపెద్ద పోర్టుగా కాకినాడ ఉంది. రుచీ, అకల్‌మార్, నిఖిల్, అగర్వాల్, లోహియా లాంటి సుమారు పది చమురు శుద్ది కర్మాగారాలు వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎడిబుల్ ఆయిల్ తయారు చేస్తున్నాయి. కార్గో షిప్పులద్వారా పోర్టుకి చేరిన ఆయిల్ని పైపులైన్ల ద్వారా ఈ ఫేక్టరీలకి సరాసరి పంపించేస్తారు.
హెరిటేజ్, ఫ్రీడం, రుచి గోల్డ్, గోల్డ్‌మొహర్ లాంటి బ్రాండ్ వంటనూనెలు ఇక్కడే తయారయి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలకి కూడా ఎగుమతి అవుతున్నాయి. కాకినాడ రిఫైనరీల్లో తయారయ్యే బిస్కెట్ ఆయిల్‌ని భారతదేశంలో ప్రముఖ బిస్కెట్ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నాయి. బేకరీల్లో, స్వీట్‌షాపుల్లో వనస్పతి, బేకరీ షార్టెనింగుల్ని ఉపయోగిస్తారు. ఆఖరికి కాకినాడ కాజా తయారీలో కూడా వీటి ఉపయోగం తప్పనిసరి.
* * *
150వ టపా ఇది!
© Dantuluri Kishore Varma
Congratulations !!!!
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteఆసక్తికరమైన సమాచారం.
ReplyDeleteధన్యవాదాలు శిశిరగారు.
Deletegood information sir
ReplyDeleteథాంక్యూ కృష్ణమోహన్‌గారు.
DeleteInko vishesham undandi Kishore Varmagaaru... Mana Telugu stateslo marekkadaa leni vidhamgaa agricultureki avasaramaina Urea, DAPs ni produce chese plants mana Kakinadalone unnai.. Nagarjuna & Coromandel perutho... those also pride of KKD.
ReplyDeleteనిజమే హరిబాబు చౌదరి గారు.
Delete