Pages

Tuesday, 11 December 2012

రేపు రేపే!

కొవ్వు తగ్గించుకొని స్లిమ్‌గా అవ్వాలనుకొంటున్నారా? అయితే ఆలోచించకుండా మాణింగ్ వాకో, యోగానో, డైటింగో మొదలు పెట్టేయండి. 
రేపటినుంచి మొదలు పెడతానండీ.
ఇంగ్లీషో, హిందీనో నేర్చేసుకొని ఆయా భాషల్లో మహవక్తలా ఉపన్యాసాలివ్వాలా? ముప్పై రోజుల్లో ఏ భాషయినా నేర్పేసే పుస్తకాలు కొట్టుకో(షాప్) పుట్టెడు. ప్రారంభించండి మరి. 
రేపే వెళ్ళి ఆ బుక్స్ తెచ్చుకొంటానండి.
ఎమయ్యా రోమియో, మూడుసంవత్సరాలనుంచి ఓ జూలియట్‌కి లైను వేస్తున్నావుకదా; మరి నీ ప్రేమకి ఓకే చెప్పిందా?
ఏదండీ ఇంకా ప్రపోజ్ చెయ్యందే. కాదంటుందేమో నని భయo. అయినా ప్రేమించాకా ప్రపోజ్ చెయ్యడం తప్పదుగా! రేపే చెప్పేస్తానండి.
మీ అమ్మాయికి డెలివరీడేటు ఇచ్చారా?
ఇంకా పదిరోజులు టైము ఉండట. కానీ, అల్లుడుగారు రేపు సిజేరియన్ చేయించమన్నారు.
కొత్త ఇంటిలోకి మారేరా?
రేపండి.
ఎగ్జాంస్ దగ్గరకి వస్తున్నాయి. ప్రిపరేషన్ మొదలుపెట్టావా?
రేపటినుంచి స్టార్ట్ చేస్తా.
మీ ఫ్రెండ్ పెళ్ళెప్పుడు?
రేపే.
మీ హీరోగారి కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడు?
రేపు.
పాపం మీ తాతగారు కోమాలో ఉన్నారట?
ఔనండి. వెంటిలేటర్ల సహాయంతోనే ఇంకా బ్రతికున్నారు. డాక్టర్లు కష్టం అన్నారు. రేపు వేంటిలేటర్లు తొలగించమని చెప్పేశాం.
ఎమయ్యా దారిన పోయే దానయ్యా, ఎదో పెద్ద పార్టీ చేసుకొంటున్నారట, ఎప్పుడు?
రేపు.
ఎందుకో?
ప్రజలు రకరకాల కారణాలతో రేపుని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఏ కారణం లేని మాబోటి వాళ్ళం పార్టీ చేసుకొంటున్నాం.
ఏమిటో రేపటి ప్రత్యేకత!?
12.12.12
© Dantuluri Kishore Varma

9 comments:

  1. రేపు రూపులేనిది :)

    ReplyDelete
  2. థాంక్స్ ఇషాన్. థాంక్స్ శర్మగారు.

    ReplyDelete
  3. మీరు నా బ్లాగులోకి రాక చాలా కాలమైంది శిశిరగారు. మీ కామెంటు చూసి అనందంగా ఉంది. మీ ఎదసడి బ్లాగ్ అందరికీ ఓపెన్ కాదా? This blog is open to invited readers only అని వస్తుంది.

    ReplyDelete
  4. సౌమ్యగారు మీకు నా బ్లాగ్‌కి స్వాగతం. మీలాంటి మంచి బ్లాగర్‌నుంచి కాంప్లిమెంట్ అందుకొన్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. Nice One Varma garu!!

    ( this Is new Anonymous, visitng ur blog for the first time, good to read ur posts :)

    Thanks

    ReplyDelete
  6. Thanks for the appreciation! You are welcome to my blog and hope to see you with your identity in future.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!