Pages

Friday 7 December 2012

అయ్యవారి బొమ్మ వెయ్యబోతే అది కోతిబొమ్మ కావాలా!

వాటర్ స్ప్రింక్లర్స్



మా అమ్మాయిల స్కూల్లో పెయింటింగ్ ఏక్టివిటీ పెట్టారు. ఏదయినా ఒకప్రదేశాన్ని గీసి పెయింట్ చెయ్యడం నేర్పించమటే, ఒక ప్రయోగం చేద్దామని డ్రాయింగ్ చార్టు, వాటర్ కలర్స్, బ్రష్‌లు కొనుక్కొని వచ్చి మొదలు పెట్టాం.





ఈతకొట్టేస్తున్న ఓ అబ్బాయి


ముందుగా షీట్‌ని స్ట్రెచ్ చేసాం. స్ట్రెచింగ్ అంటే షీట్‌ని నీళ్ళతో తడిపి ముడతలు లేకుండా ఆరబెట్టుకోవడం. ఇలా చెయ్యడం వల్ల కాగితానికి రంగులు బాగా పడతాయని ఎక్కడో చదివాను. ఆరిన తరువాత పాత రికార్డ్ బుక్‌లో పెట్టెసి మొదటిరోజు కార్యక్రమాన్ని ముగించాం.

దిగడానికి తయారుగా ఉన్న అమ్మాయి


కొన్నిరోజులముందు రాజమండ్రీ వాటర్‌పార్క్ దగ్గర తీసిన ఫోటోలు రిఫరెన్స్‌గా పెట్టుకొని, ఒక్కో ఫోటో నుంచీ ఒక్కో మనిషినీ, ఒక్కో స్థలాన్నీ తీసుకొని  ఔట్‌లైన్ స్కెచ్ పెన్సిల్తో చాలాలైటుగా ఆరిన చార్ట్ పేపరు పైన వేశాం.





ఎరుపు రంగు డ్రాయరు  కుర్రాడు


ఎరుపు రంగు డ్రాయరు వేసుకొని నీళ్ళల్లో నుంచున్న కుర్రాడు, మోకాళ్ళలోతు కూడా లేకపోయినా స్విమ్మర్‌లా ఈతకొట్టేస్తున్న ఓ అబ్బాయి, మెట్లమీద నీటిలోకి దిగడానికి తయారుగా ఉన్న అమ్మాయి, స్లైడ్ మీద మొదటిసారి భయం భయంగా జారుతున్న ఇంకొక అబ్బాయి, వీళ్ళందరి మధ్యలో చెయ్యి చెయ్యీ పట్టుకొని వెళుతున్న శ్రావ్య, వర్షిత.

 శ్రావ్య, వర్షిత


లేయర్ బై లేయర్ పెయింట్ చేస్తే బాగుంటుందని అనుకొని లైట్ బ్లూకలర్తో మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వాష్ ఇచ్చాం. ఈ కలర్ని మళ్ళీ పూర్తిగా ఆరనిచ్చి వరుసగా గోడ, స్విమ్మిగ్‌పూల్‌లో నీరు, స్లైడ్లు, మెట్లు, వాటర్ స్ప్రింక్లర్స్, మనుష్యులు ఒకదాని తరువాత ఒకటి రంగులు వేసుకొంటూ వచ్చాం.




స్లైడ్ మీద జారుతున్న అబ్బాయి
అయ్యవారి బొమ్మ వెయ్యబోతే అది కోతిబొమ్మ కావాలా! అని ఏదో పాటలో చెప్పినట్టు మాప్రయోగం ఇలా తయారయ్యింది.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. అమ్మో...మొదటి ప్రయత్నమే భలే చక్కగా చేశారండీ, కొన్ని ఫొటోలు, ఒక్కొక ఫొటో నుంచీ కొంత తీసుకుని ఫైనల్ వాటర్ కలర్ పెయింటింగ్....భలే చక్కని ప్రయోగం, ప్రొఫెషనల్ గా చేశారు.
    ఈరోజుల్లో అయ్యవారిబొమ్మ "కో..." అలా వేస్తే నే ఎక్కువ మంది చూస్తారు ;) సరదాకన్నాం, మరీ సీరియస్ గా తీసుకోకండే!

    ReplyDelete
  2. మీటపాలకి మీరు వేసే బొమ్మలు చాలా బాగుంటాయి. మీనుంచి మెచ్చుకోలు అంటే ఏదో మెడల్ వచ్చినంత ఆనందంగా ఉంది. :)

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!