Pages

Sunday, 16 December 2012

ప్రియమైన విష్ణుమూర్తికి...

విష్ణుమూర్తికి ప్రియమైన ధనుర్మాసంలో ఆయన దశావతారాల సందర్శన ఇదిగో ఇలా. మానవ పరిణామ క్రమం కూడా దశావతారాల్లో కనిపిస్తుంది అంటారు - మీరు కూడా గమనించండి. రాజమండ్రీ ఇస్కాన్ దేవాలయంలో దశావతార మూర్తులు. ప్రత్యేక అనుమతితో మన కాకినాడ బ్లాగ్‌ కోసం తీసిన ఫోటోలు. 
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము 
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము
మనవాళ్ళకి అన్నీ తెలుసు!

చార్లెస్ డార్విన్ అనే ఆయన జీవపరిణామ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. పరిణామం అంటే మార్పు. ఈ భూమి మీద మనిషి, మనిషిలాగ ఆవిర్భవించలేదు. చుట్టు ప్రక్కల ఉన్న పరిసరాలకి అనుగుణంగా తనను తాను మార్చుకొంటూ,  జీవం మార్పు చెందుతూ వచ్చింది. భూమి పూర్తిగా నీటితో నిండి ఉన్నప్పుడు కేవలం చేపల్లాంటి జలచరాలు మాత్రమే ఉండేవి. ఆతరువాత నీటిలోను, భూమి మీదా కూడా నివశించగలిగిన ఉభయచరాలు వచ్చాయి. కొంతకాలానికి, పూర్తిగా భూమిమీద నివసించగలిగిన జంతువులు, వాటినుంచి జంతువులాంటి మనిషి, అతనినుంచి పూర్తిగా పరిణామం చెందని మనిషి, తరువాత  ఇప్పడు మన అందరిలాంటి పరిపూర్ణ వ్యక్తిగా అవతరించడం జరిగింది. ఈ మార్పులన్నీ జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది.  

దీనినే పరిణామ క్రమం అంటారు. ప్రపంచం అంతా 1869 నుంచి, అంటే డార్విన్ ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన దగ్గరనుంచీ ఈ విషయాన్నిఅవగాహన చేసుకోవడం మొదలు పెట్టింది. కానీ, మన దేశంలో దీనిని వేలసంవత్సరాలకు పూర్వమే కథల రూపంలో నిక్షిప్తం చేశారు.

మన పురాణాలలో విష్ణువు దశావతారాలు ఈ పరిణామ క్రమానికి సరిగ్గా సరిపోతాయి. మొదటిది మత్యావతారం(చేప) - జలచరం; రెండవది కూర్మావతారం(తాబేలు) - ఉబయచరం; మూడవది వరహావతారం(వరహం)- జంతువు; నాలుగవది నరసింహావతారం(సగం సింహం, సగం మనిషి)- జంతువు లాంటి మనిషి; అయిదవది వామనావతారం(పొట్టి మనిషి)- పూర్తిగా పరిణామం చెందని మనిషి; తరువాత అవతారాలన్నీ (పరశురామ,   రామ, కృష్ణ, బుద్ధ, కల్కి) పూర్తి మానవావతారాలు.

కథలరూపంలో చెపితే ఏదయినా అవగాహన చేసుకోవడం ఎంతో సులభం అని మన పూర్వికులు భావించడం వల్ల పరిణామక్రమాన్ని దశావతారాల్లో చూపించడం జరిగింది.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. మూర్తుల విగ్రహాలు అందంగా ఉన్నాయండీ!

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది చిన్ని ఆశ గారు.

    ReplyDelete
  3. చాలా బాగుంటాయి ఈ విగ్రహాలు..లేజర్ కట్ తో చేసారట...మామూలు ఉలితో ఆ నునుపుదనం రాదనీ...
    అక్కడ పనిచేసిన శిల్పులు చెప్పారు ...నిజమో కాదో తెలియదు...
    గుడి కూడా చాలా బాగుంటుంది...మంచి ఫొటోస్ షేర్ చేసారు ...@శ్రీ

    ReplyDelete
  4. చాలాకాలానికి మీ కామెంట్ చూడడం ఆనందంగా ఉంది శ్రీగారు. ధన్యవాదాలు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!