చార్లెస్ డికెన్స్ రాసిన ఎ క్రిస్మస్ కేరల్ నవలలో స్క్రూజ్ అనే వ్యక్తి పరమపిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టని రకం. మన నేటివిటీకి పోల్చి చెప్పాలంటే, జంద్యాల `అహ నా పెళ్ళంట` సినిమాలో కోట శ్రీనివాసరావు టైపు. పండగ పూటా ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చిన మేనల్లుడిని, `ఏమి డబ్బులున్నాయనిరా, నువ్వు క్రిస్మస్ అని ఎగిరెగిరి పడుతున్నావు?` అంటాడు. ఈ పిసినారి దృష్టిలో పండగంటే డబ్బులులేకపోయినా షాపింగ్ బిల్లు కట్టడం, ఒక సంవత్సరం వయసు పెరగడం... అంతకంటే ఏమీలేదు. అతని మేనల్లుడు మాత్రం అలాంటి వాడుకాదు. అతని ఉద్దేశ్యం ప్రకారం ఇది ఒక గొప్ప సమయం, సాధారణంగా కుంచిచించుకుపోయి ఉండే హృదయాలు దయతో, భక్తితో, సమాజంలో అందరి పైనా ఆపేక్షతో తెరుచుకొనే రోజు. అందుకే, స్క్రూజ్‌తో అంటాడు, `నీకు ఏమిలేదని పండుగపూటా అలా ఏదో పోగొట్టుకొన్నట్టు ఉంటావు?` అని.
ఊళ్ళో మెయిన్ రోడ్డు జనాలతో కిటకిటలాడిపోతుంది. బట్టల కొట్లు, జోళ్ళ షాపులు, స్వీట్ స్టాళ్ళు, బంగారం కొట్లు, టైలరింగ్ షాపులు... పండగ శోభతో కళకళ లాడుతున్నాయి. ప్రియమైన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం సాంప్రదాయం. ఉన్నంతలో ఆప్తులని ఆనందపెట్టడం ఒక గొప్ప తృప్తి. ఏదో కథలో భార్యాభర్తలు - ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. క్రిస్మస్‌కో, పెళ్ళిరోజుకో ఒకరికి తెలియకుండా, ఇంకొకరు పరస్పరం బహుమతులు ఇద్దామనుకొంటారు. కానీ పాపం అంత కలిగున్న సంసారం కాదు. భర్తకి మంచి వాచ్ డయల్ ఉంటుంది దానికి చెయిన్ ఉండదు. భార్యకి పొడవైన జుట్టు ఉంటుంది కానీ దాన్ని చక్కగా దువ్వుకోవడానికి దంతపు దువ్వెన ఉండదు. పండుగరోజు ఉదయాన్నే ఒకరికొకరు ఇచ్చుకొన్న బహుమతులు చూసుకొని అవాక్కవుతారు. ఆయనకి వాచ్ చెయిను, ఆమెకి దంతపు దువ్వెన! కానీ, ఏమి ప్రయోజనం? ఆమె తన పొడవైన జుట్టు అమ్మి ఆయనకి బహుమతిని కొంటే, ఆయనగారేమో తన వాచ్ డయల్ అమ్మి ఆవిడకి దువ్వెన కొన్నాడు. ప్రేమగెలిచింది.

చదువులూ, ఉద్యోగాలు అని పిల్లలు దూరప్రాంతాలకి వెళ్ళిపోవడంతో, ఒంటరిగా ఉన్న తల్లితండ్రులకి పండగ ఉత్సాహం ఉండటంలేదు. `ఎ క్రిస్మస్ మాణింగ్` అనే కథలో రాబర్ట్, అతని భార్యా పండుగరోజు సాయంత్రం వచ్చే పిల్లలు కోసం, మనుమలకోసం ఎదురు చూస్తారు. `క్రిస్మస్ ట్రీని మనిద్దరికోసం అలంకరించాలా?` అంటుంది. `ఎంతమంది ఉన్నారని కాదు, ఇద్దరే ఉన్నా పండుగ పండుగే,` అంటాడు రాబర్ట్. అతని చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం వస్తాయి. పదిహేను సంవత్సరాల వయసులో ఆవులకి పాలు తియ్యడానికి తండ్రికి సహాయం చెయ్యాలి. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపేవాడు తండ్రి. ఎదిగే వయసులో పిల్లాడికి నిద్ర ఎంత అవసరమో తెలుసు. కాని కొన్ని తప్పవు. రాబర్ట్ తండ్రి ఎంతో బాధపడుతూనే కొడుకుని మేల్కొలిపే వాడు. క్రిస్మస్ రోజు రాబర్ట్ రోజూకంటే ముందే నిద్రలేచి, ఒక్కడే బకెట్ల నిండా పాలు పితికి, గప్‌చిప్ గా వచ్చి ముసుగుతన్ని పడుకొంటాడు. తండ్రి ఎప్పటిలాగే ఖాళీ బకెట్లకోసం పశువుల శాలకి వెళ్ళతాడని తెలుసు. నిండుగాఉన్న పాత్రలని చూసి ఎంతగా ఆశ్చర్యపోతాడో ఊహించుకొంటూ తండ్రి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఉధ్వేగంతో గుండె అదేపనిగా కొట్టుకొంటూ ఉంటుంది. గాఢమైన ఉచ్వాశనిశ్వాసాలని బలవంతంగా నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుండగా తండ్రి గదిలోకి వస్తాడు. కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి గర్వంగా తీసుకొన్న తండ్రి, ఆ గర్వానికి కారణభూతుడైన కొడుకు ఘాఢమైన ఆలింగనంలో శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ప్రేమగెలిచింది.
బహుమతులంటే తప్పనిసరిగా గుర్తుకువచ్చే బొద్దుగా ఉండే సాంతాక్లాజ్ ఒక ఫాంటసీ. ఎర్రనికోటు, తెల్లగా పండిన గుబురు మీసం, గెడ్డాలు, చేతికి గ్లౌస్, కళ్ళకి జోడు, కాళ్ళకి బూట్లుతో క్రిస్మస్ తాత సంవత్సరమంతా మంచి, చెడ్డ పిల్లల జాబితా తయారు చేసుకొని పండుగ ముందురోజు రాత్రి రెయిన్‌డీర్‌కి కట్టిన స్లెల్డ్జ్ మీద ఆకాశ మార్గంలో వచ్చి నిద్రిస్తున్న మంచి పిల్లలకి మంచిమంచి బహుమతులు, చెడ్డ పిల్లలకి బొగ్గుముక్కలూ వాళ్ళ వాళ్ళ ప్రక్కన నిశబ్ధంగా పెట్టేసి వచ్చినట్టే వెళ్ళిపోతాడట. పిల్లలు ఏం బహుమతికావాలో సాంతాక్లాజ్‌కి విన్నవించుకోంటే, పెద్దలు ఏమివ్వగలరో అది నిద్రపోతున్న పిల్లల పక్కలో చప్ప్పుడుచెయ్యకుండా పెట్టేయండి. ప్రేమ గెలుస్తుంది. అందరికీ మెర్రీ క్రిస్మస్!
A pleasant and cute animated story showing the tradition of Santa Claus ఇక్కడ చూడండి
© Dantuluri Kishore Varma
Nijam ga prema gelustundantaara
ReplyDeleteగెలుస్తుందండి!
Delete