నేను తీసిన వాటిల్లో మంచివి....
రాజమండ్రీ ఇస్కాన్ మందిరందగ్గర మధ్యాహ్నం రెండుగంటల సమయంలో నీడలో చల్లగా ఉన్న నాచుపట్టిన ఫౌంటెన్ మీద పావురం. రెండు స్నాప్స్ తీసిన తరువాత ఆ చప్పుడుకి బెదిరి ఎగిరిపోయి దురంగా వాలింది.
ముందురాత్రి వేటకి వెళ్ళివచ్చి, లంగరు వేసిఉన్న పడవలు. వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వార్తల్లో చెపుతున్నారు.ఎన్నో సార్లు చెప్పినప్పుడు తుఫాను రాలేదు, చెప్పకుండా వచ్చింది. ఈ రోజు మళ్ళీ వేటకి వెళ్ళడమా, లేదా? మత్యకారుల సంధిగ్దానికి గుర్తుగా తెల్లవారినా కడలిదారి పట్టని పడవలు.
అరకు లోయలో. చలిపులిని ఆరిపోతున్న కాగడాతో దూరంగా ఉంచడానికి చివరిప్రయత్నం చేస్తున్న సాయంత్రపు సూర్యుడు. ఎప్పుడో పుష్కరం క్రిందట తీసిన ఫోటో. స్కాన్ చేసింది. మిగిలిన ఫోటోలంత క్లారిటీ ఉండదు.
ఫోటోలు బాగున్నాయి
ReplyDeleteమీప్రోత్సాహానికి కృతజ్ఞతలు శర్మగారు.
ReplyDeleteబాగా వ్రాసినారండీ!
ReplyDeleteమీ ప్రశంస ఆనందం కలిగించింది. మీకు నా బ్లాగుకి హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు.
ReplyDelete