Pages

Saturday, 29 December 2012

కోనసీమ

గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలిఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. తూర్పుగోదావరిజిల్లాలో పదహారు మండలాలు కోనసీమలో ఉన్నాయి. అవి అమలాపురం, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, రావులపాలెం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలు.

గోదావరిమీద బ్రిడ్జీలు నిర్మించడానికి పూర్వం కోనసీమనుంచి బయట ప్రదేశానికి రాకపోకలు లాంచీలమీద, పడవలమీద జరిగేది. ఇప్పటికీ లాంచీ ప్రయాణాలు పాతబడిపోలేదు. గోదావరినది దాటుతున్నప్పుడు దూరంగా మధ్య, మధ్యలో కనిపించే లంకల్లాంటి ఇసుకమేటలు, చిన్నచిన్న అలలు లాంచీ అంచులకి తగిలి నప్పుడు మీదపడే నీటి తుంపరలు, చల్లగా వీచే గాలి, లాంచీలో జనాల రణగొణద్వని- పదిహేను, ఇరవై నిమిషాల ప్రయాణం డ్రీం జర్నీలా ఉండేది.
సమృద్ధిగా నీటివనరులు, అత్యంత సారవంతమైన నేలా ఉన్న కారణంగా పంటలు చాలా బాగా పండుతాయి. కనుచూపుమేర విస్తరించిన వరిపొలాలు, కొబ్బరితోటలు, కాలువల్లో నింపాదిగా సాగే పడవలతో కేరళానుంచి ఒకముక్క కత్తిరించి ఆంధ్రాలో అతకించినట్టు ఉంటుంది కోనసీమ. కోనసీమలో రైతే రాజు. పొలానికి నీరు పెట్టుకోవడం, దుక్కిదున్నుకోవడం, విత్తనాలు జల్లుకోవడం, నాట్లువేసుకోవడం, కలుపుతీసుకోవడం, ఎరువులు, పురుగుమందులు జల్లుకోవడం, కోతలు కోసుకోవడం, కుప్పలునూర్చుకోవడం, ధాన్యాన్ని మార్కెట్టుకో, ఇంటికో చేర్చుకోవడం, మళ్ళీ పైర్లు చల్లుకోవడం...ఏడాదంతా పనే! దాళవాలకి నీరు వదలనప్పుడో, తుఫాన్లు కన్నెర్రజేసినప్పుడో, పంటలకి కిట్టుబాటుధర సరిగా లేనప్పుడు తనంతట తాను క్రాపు హాలిడే ప్రకటించుకొన్నప్పుడో తప్పించి రైతుకి శలవు లేదు. ఇక్కడ వరి తరువాత ఎక్కువగా పండించే పంట అరటి. రావులపాలెంలో అరటి మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖమైన వాటిల్లో ఒకటి. తెలతెల వారుతూ ఉండగా, మంచు తెరలు ఇంకా భూదేవి మేనిపైనుంచి తొలగకముందే సైకిళ్ళమీద రైతులు అరటిగెలలు మార్కెట్లకి తీసుకువెళుతుండడం ఒక మనోహరమైన దృశ్యం. 
కోనసీమలో ఎన్నో దేవాలయాలున్నాయి. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి, మురమళ్ళలో వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వరస్వామి, అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి, అంతర్వేదిలో నరసింహస్వామి, అయినవిల్లిలో శ్రీ సిద్దివినాయకస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి ఇక్కడి కొన్ని ప్రముఖమైన దేవాలయాలు.

`గుళ్ళూ, గోపురాల్లాంటివేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?` అంటారా? అన్నీ చెప్పాలంటే ఒక్క టపా సరిపోదు. అలా అని చెప్పకుండా ఉండాలంటే మనసొప్పదు. అందుకే మీకోసం, నాకోసం కొన్ని విశేషాలని ఇక్కడ ఇస్తున్నాను. అవి ఏమిటంటే.. ఆదుర్రులో బౌద్ద స్థూపం,  మలికిపురంలో దిండీ రిసార్ట్స్, ముమ్మిడివరంలో బాలయోగి ఆశ్రమం   అమలాపురంలో కోనసీమకే మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ ఎస్.కే.బీ.ఆర్ కాలేజ్. ఆత్రేయపురం పూతరేకులు, బండారులంక చీరలు, కోనసీమ కొబ్బరికాయలు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు ఈ ప్రాంతం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఎవరో చెప్పినట్టు కోనసీమ అంటే వర్షంలా కురిసిన చిలకాకుపచ్చరంగు కల. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు! కెమేరాని ఎటుతిప్పి తీసినా అందమైన దృశ్యమే వస్తుంది.

ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసామాన్యాన్ని కూడా చూడండి. కలుపుతీసే పల్లె పడుచులు, మైదానంలో మేకలని కాసుకొనే  ముసలికాపరి, చెట్లకొమ్మలకి తాడు ఉయ్యాల కట్టి ఊగే చిన్నపిల్లల గుంపు, కాలువలో ప్రపంచాన్ని మరిచి ఈతలుకొట్టే యువకులు, సంధ్యా సమయంలో పడవతెడ్డుమీద గెడ్డం ఆనించి సూర్యాస్తమయాన్ని చూస్తున్న నావవాడు, ఆవులమందని ఇంటిదారిపట్టిస్తున్న కుర్రాళ్ళు... ఏదయినా మీ కెమేరా కంటికి అందమైన ఫోటోని ఇవ్వవచ్చు.

ఫేస్‌బుక్‌లో కోనసీమ అనే పేజీని ఇక్కడ చూడండి

© Dantuluri Kishore Varma

26 comments:

  1. దంతులూరి కిషోర్ వర్మ గారు మీకు ధన్యవాదాలు.. మీ బ్లోగ్ చాలా బాగుంది

    ReplyDelete
  2. Konaseema is of its own beauty...and people are friendly in nature..!Yes...it resembles Kerala...but keralites are reserved with new people..and a bit cunning in nature...!It's my experience..I don't know whether it's proved wrong...anyway different people have different bags,to put it in American slang.Excellent photos and well conceived by you..!

    ReplyDelete
  3. "బొబ్బర్లంక చీరలు" కాదు మాస్టారూ.. బండార్లంక. నేను పుట్టి పెరిగిన మా కోనసీమ గురించి వ్యాసం as usual బ్రహ్మాండంగా ఉంది. ఫేస్ బుక్ లింకిచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. మార్చాను ఫణిబాబుగారు. చాలా ధన్యవాదాలు. మూర్తిగారూ మీ పరిశీలన చాలా బాగుంది. ఫోటోలు అన్నీకూడా కోనసీమగ్రూపువే. వారికి మీ అప్రీసియేషన్‌ని తెలియజేస్తాను. విజయ్ గారూ మంచిఫోటోలు ఇచ్చినందుకు మీకే నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా థాంక్స్!

    ReplyDelete
  5. Simply the best. Keep up your good work.

    ReplyDelete
  6. Thanks a lot Ravindra Varma garu for the appreciation.

    ReplyDelete
  7. Keep it up..All the Team Members!!!

    Note:-Add to this :vprawn farming

    ReplyDelete
  8. chala manchi blog ippativaraku chudaledu ee pradesanni meeru raasina danni batti chusthuntey karchitham ga chudali ani manasu vuvviluruthundi... dhaynyavaadamulu :-)

    ReplyDelete
  9. ప్రాన్ ఫార్మింగ్ కూడా ఒకముఖ్యమైన పరిశ్రమే ఇక్కడ. ధన్యవాదాలు భోనీగారు.

    ReplyDelete
  10. నాబ్లాగ్‌కి మీకు స్వాగతం వాసుగారు. మీకు ఇక్కడరాసిన ప్రదేశాలన్నీ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  11. Thank you Satish Raju garu. Welcome to my blog.

    ReplyDelete
  12. నేను కొనసీమలొ పుట్టి పెరగడం నా పూర్వజన్మ సుకృతముగా భావిస్తా.
    సదా ఆ భగవంతునికి క్రుతజ్ఞతలు.

    చెల్లూరి సుబ్రహ్మణ్య శర్మ, ముంగండ

    ReplyDelete
  13. Beautiful అండీ! ఎప్పుడూ వినటమే తప్ప అటువైపు వెళ్ళనే లేదు. ఎప్పటికైనా వెళ్ళి ఆ అందాలన్నీ తనివితీరా చూడాలనుంది. Brief and చక్కగా రాశారు. Photo లూ ఎంతో అందంగా ఉన్నాయి.

    ReplyDelete
  14. సుబ్రహ్మణ్య శర్మగారు, మీకు నా బ్లాగుకి స్వాగతం. మీ స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  15. చిన్ని ఆశగారు తప్పనిసరిగా చూడండి :)

    ReplyDelete
  16. Hello Varma sir !!! Wonderful narration about Konaseema which is known for its green Coconut orchards, lushgreen Paddy fields and numerous canals. Expecting few more blogs on Godavari.....Frankly speaking we(this generation) don't know the prominence of our place....these blogs will help us to know.....

    ReplyDelete
  17. Thanks a lot for your words of appreciation Mr.Kiran.

    ReplyDelete
  18. వర్మ గారు మీకు నా అబినందనలు నా ఫెరు రవి నెను మీ బ్లొగు ప్రతిరొజు చదువుతాను.మీరు చెఫ్హె ప్రతిది చాలా ఈష్తంగా చదువుథాను నా మనసుకు చాలా హప్ప్యి గా అనిపిస్తూఊంది.మీరు ఈలానె పదిమంధికి మంచి చెయ్యలని కొరుకుంతు
    మీకు,మీ ఫమిల్య్ సిరి సంపదలొథొ సంథొసంగా ఉంధలని ఆ ధెవునిని కొరునుంతున్న.

    ReplyDelete
  19. చాలా ధాంక్స్ రవిగారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

    ReplyDelete
  20. hai sir thanks for your replay.

    ReplyDelete
  21. మీరు రాసిన బ్ల్లొగ్ అద్భుతంగ వున్నది. మల్లి మావూరు చుసిన ఫీలింగ్ వచ్చి వుంది

    ReplyDelete
    Replies
    1. హరిగారు, మీకు నచ్చినందుకు సంతోషం.

      Delete
  22. Thanks a million Arun Kumar garu. Your appreciation means a lot to me.

    ReplyDelete
  23. కిషోర్ వర్మ గారు మీ బ్లోగ్ చాలా బాగుంది. చాల మంచి సమాచారం ఉంది. ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం సురేంద్రగారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!