Pages

Monday 29 April 2013

ఇప్పటికైనా ఉద్యోగం వెత్తుక్కోరా బాబూ!

చీర్స్!

సిక్సర్ బార్ కార్నర్ టేబుల్ దగ్గర డిం లైటింగ్‌లో మూడు లిక్కర్ గ్లాసులు `టింగ్` మని చప్పుడు చేశాయి. 

`సంవత్సరం అయ్యిందిరా మనం ముగ్గురం కలిసి,` అన్నాడు వరుణ్, `ఈ రోజు బిల్లు మాత్రం నాదే. కాదంటే ఒప్పుకొనేది లేదు. మీరిద్దరూ నా గెస్టులు ఈ రోజు.` 

`ఫ్రీడం దొబ్బింది ఈ ఏడాదిగా. ఫైనల్ ఇయర్ అయ్యిందో లేదో కొంపలుమునిగినట్టు ప్లేస్‌మెంట్ వచ్చిపడింది మా ఇద్దరికీ. నువ్వు అదృష్టవంతుడివిరా బాబూ. ఫ్రీ బర్డ్‌లాగ తిరుగుతున్నావు,` అన్నాడు వరుణ్‌ని ఉద్దేశించి ప్రిన్స్‌రాంబాబు . ఫేస్‌బుక్‌లో వాడి పేరు అదే. అందరూ అలాగే పిలవడానికి అలవాటు పడ్డారు.

`వీడి అన్నను మెచ్చుకోవాలిరా అసలు. చిన్న ఉద్యోగం చేస్తూ వీడిని బీటెక్  చదివించడమే కాకుండా, ఇప్పటికి కూడా పోకెట్ మనీ ఇస్తున్నాడు చూడు అందుకు,` డార్లింగ్ ప్రసాదు అన్నాడు.

గ్లాసులో ఎర్రగా మెరుస్తున్న ద్రవంకేసి రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు వరుణ్. గిల్టీ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది డార్లింగ్ ప్రసాద్ మాటలకి. `ఇంకేంటిరా సంగతులు,` అన్నాడు. టాపిక్ డైవర్ట్ అయ్యింది. కాలేజీ రోజుల్లోకి దొర్లుకొంటూ వెళ్ళిపోయారు. చికెన్ మంచూరియా నంజుకొంటూ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకొన్నారు. పుర్తయ్యే సరికి రాత్రి పదకొండు అయ్యింది. 

విడిపోయే ముందు ప్రసాదూ, రాంబాబు మరీ మరీ చెప్పారు వరుణ్‌కి చెన్నై వచ్చేస్తే వాళ్ళ రూంలోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చెయ్య వచ్చని. `అలాగే,` నని ఇంటిదారి పట్టాడు. వీధిలైటు వెలుగులో ఏడు పోర్షన్ల ఇంటిలో వాళ్ళుండే మధ్య పోర్షన్ నాచుపట్టిన పురాతన సమాధిలా ఉంది. పేంట్ జేబులోనుంచి జండుబాం డబ్బా తీసీ, కొంత బాంని నుదుటికి, మెడ వెనుకా రాసుకొన్నాడు. అలా చేస్తే, మందు వాసన వదినకి తెలియకుండా ఉంటుంది. వెళ్ళి తలుపు కొట్టాడు.  

వదిన తలుపు తీసింది. `మళ్ళీ తలనొప్పా? భోజనం చేస్తావా?` అంది. ఆమె కళ్ళు ఏడ్చి నట్టు ఎర్రబడి ఉన్నాయి. `ఆకలి లేదు వదినా. పడుకొంటాను,` అన్నాడు. `రేపు ఉదయం నేనూ, మీ అన్నయ్యా చిన్నూ స్కూలుకి వెళ్ళాలి. టెర్మ్ ఫీజు కట్టడానికి చివరిరోజు. మేము తిరిగి వచ్చేలోగా నువ్వు బయటకు వెళితే ఇంటి తాళం పక్క పోర్షన్‌లో ఇచ్చి వెళ్ళు,` అంది. అలాగే అని తల ఊపాడు. సాయంత్రం బార్‌కి వెళ్ళే ముందు హేంగర్‌కి తగిలించిన అన్నయ్య షర్ట్ జేబులో ఐదొందల కాగితాలు కనిపించాయి. స్కూల్ ఫీజు కట్టడంకోసం వదిన వంటిమీద ఉన్న చిట్ట చివరి బంగారం పిసరు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు. `నేను ఒక నోటు తీసిన సంగతి వీళ్ళకు తెలిసి ఉంటుందా!?` అనుకొంటూ ఉండగా నిద్ర పట్టేసింది.  

డార్లింగ్ ప్రసాదునీ, ప్రిన్స్‌రాంబాబునీ సర్కార్కి ఎక్కించి వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. ఆఫీసుకి శెలవు పెట్టినట్టున్నాడు, అన్నయ్య ఇంటిలోనే ఉన్నాడు. వరుణ్ ఇంటికి వచ్చిన విషయం గమనించలేదు. లోపలి గదిలోనుంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అన్నయ్య అంటున్నాడు, `అప్పుడప్పుడూ ఆపదలో ఉన్నవాళ్ళకి బ్లడ్  డొనేట్ చెయ్యడమే కానీ, ఎప్పుడూ డబ్బు తీసుకొన్నది లేదు. ఈ రోజు అడిగి మరీ అయిదు వందలు తీసుకోవలసి వచ్చింది,` అని.
© Dantuluri Kishore Varma

18 comments:

  1. మందుకొట్టేవాళ్ళకి ఇతరుల కష్టాలు తెలియవు

    ReplyDelete
    Replies
    1. కనీసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడైనా వాళ్ళలో మార్పురావాలి.

      Delete
  2. బాగా రాశారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శివగారు.

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు సింధుగారు.

      Delete
  4. ప్చ్..బాధ్యత తెలియకుండా ఉండడం,పైగా వ్యసనాలకు బానిసవ్వడం,స్నేహితుల దగ్గర గొప్పలు పోవడం...వరుణ్ గొప్పతనమైతే..
    వరుణ్ అన్న, వదినల మంచితనం --వారి దురదృష్టం అంతే!

    ReplyDelete
    Replies
    1. బాధ్యతారాహిత్యాన్ని వేలెత్తి చూపించకుండా లేదా నిందించకుండా, ఆ లోటుని తమ త్యాగంతో బర్తీ చేసే కుటుంభసభ్యుల వ్యక్తిత్వం వరుణ్ లాంటి వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి.

      Delete
  5. గుండెలు పిండేశారు...

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చేలా రాయగలిగినందుకు సంతోషం ఫణిబాబుగారు. ధన్యవాదాలు.

      Delete
  6. Chala baagundandi..mee posts chala baavunnayi..

    Varun lanti vaallalo maarpu ilanti sanghatanatho raavaali...raakapote ika eppatiki raadu....endukante taagubothula kathalu dukhanthale....

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం ఉషారాణీ గారు. మీరన్నది అక్షరాలా నిజం. ధన్యవాదాలు.

      Delete
  7. Gud job KISHOREgaru.. Like it

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!