Pages

Sunday, 27 April 2014

పద్నాలుగున్నర లక్షల వ్యూస్!

దిమ్మతిరిగిపోయింది లాంటి టైటిల్ పెట్టొచ్చో లేదో తెలియదు కానీ, నిజంగా జరిగింది అదే! చాలామందికి ఉన్నట్టే నాకు కూడా ఒక గూగుల్‌ప్లస్ ప్రొఫైల్ (link) ఉంది. బ్లాగ్‌లో రాసిన ప్రతీ పోస్ట్‌ని అక్కడ షేర్ చెయ్యడం మినహా ఈ సోషల్  నెట్‌వర్క్‌ని నేను ఉపయోగించడం తక్కువ. అహా.. అయిష్టం కాదండి, ఎలా ఉపయోగించాలో పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడే ఒక అశ్చర్యకరమైన విషయం నా కంటపడింది. ఒకరి గూగుల్ ప్లస్ ప్రొఫైల్ చూస్తుంటే - వారికి ఉన్న ఫాలోవర్స్, ప్రొఫైల్ వ్యూస్ మీద నా దృష్టి పడింది. ఇప్పటి వరకూ వాటిని నేను పెద్దగా గమనించలేదు. అది చూశాకా, `నాకు ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ ఉండి ఉంటాయ్?` అనిపించి, ఓ లుక్కేసేసరికి నిజంగానే దిమ్మతిరిగిపోయింది - 14,39,200! ఏదో పొరపాటు జరిగి ఉంటుందనిపించింది. మార్క్ జుకెంబెర్గ్‌కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో పరిశీలిస్తే 16,39,500 ఉన్నాయి. ఆయన ఫాలోవర్సేమో ఆరున్నర లక్షలమంది. నా ఫాలోవర్స్ మాత్రం 29 మంది. లక్షల్లో, ఆ మాటకొస్తే కోట్లలో కూడా వ్యూస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు... కానీ,  కొంచెం ఎక్జైటింగ్‌గా ఉంది! `తూచ్! అన్నిలేవు,` అని గూగుల్‌వాడు రేపెప్పుడైనా వాటిని వెనక్కి తీసేసుకొంటాడేమో అని భయంగా కూడా ఉంది!


© Dantuluri Kishore Varma

7 comments:

  1. haha.... nenu ippude chusanu andi.. ee lekka edo tedagane undi .. naa 3,738,289 views

    ReplyDelete
    Replies
    1. అయి వుండవచ్చు, కాకపోనూ వచ్చు రాజాచంద్రగారు. Congrats to you!

      Delete
  2. congrats కిషోర్ గారు.

    రాజా చంద్రగారు, అది వాళ్ళ ఇంటర్ నెల్ కోడింగ్ లొ పొరబాటు అయి ఉండవచ్చు.

    ReplyDelete
  3. congrats kishore గారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అనంత్‌గారు.

      Delete
  4. your blog is like ICE cream in Hot Summer. Always brings happiness to heart really

    ReplyDelete
    Replies
    1. Thanks a million for your appreciation Srinivas garu.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!