తిరుమలను శ్రీ ఆదివరహా క్షేత్రం అని పిలుస్తారని మీకు తెలుసా? నిజానికి ఈ కొండ వరహాస్వామిది. విస్ణుమూర్తిమీద అలిగి లక్ష్మీదేవి భూలోకంలో ఆకాశరాజు కుమార్తెగా అవతరించింది. ఆమెను పరిణయం చేసుకోవడానికి శ్రీనివాసుడు దివినుంచి భువికి దిగివచ్చాడు. వరహాస్వామి క్షేత్రమైన కొండమీద తాను ఉండడానికి కొంత జాగా కావాలని కోరతాడు. ఆతని విన్నపాన్ని మన్నించిన వరహాస్వామి వందఅడుగుల స్థలాన్ని అప్పుగా ఇస్తాడు. దానికి ప్రతిఫలంగా వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా తననే దర్శనం చేసుకోవాలని, మొదటి పూజా, నైవేద్యం తనకే రావాలని నిబంధన విదిస్తాడు. ఇప్పటికీ ఈ ఆచారమే కొనసాగుతుంది. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు మొదటిగా వరహాస్వామినే దర్శించుకొని తీరాలి.
అంతగా ప్రచారం లేదు కనుకు ఎక్కువమంది భక్తులకి ఈ విషయంగురించి తెలియదు.
కాబట్టి ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఏమిచేస్తారంటే....
శ్రీవారి దేవాలయానికి ఉత్తరం వైపు ఉన్న పుష్కరిణి వొడ్డున వరహాస్వామి గుడి ఉంది. పుష్కరిణిలో నీటిని యంత్రాలద్వారా నిరంతరం శుబ్రపరుస్తూ ఉన్నారు. చల్లని కొలను నీటిలో స్నానం చెయ్యండి. ప్రక్కనే స్నానపుగదులు, దుస్తులు మార్చుకొనే గదులూ ఉన్నాయి. అక్కడ పొడిబట్టలలోకి మారి, వరహాస్వామి ఆలయం వైపు నడవండి. మీకు చక్కని దర్శనం లభిస్తుంది. ఇలా చేసిన తరువాతే మీరు వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాలని చెపుతారు.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment