తిరుమల లాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, తిరిగివస్తూ స్నేహితులకి, బందువులకి, సహోద్యోగులకి ఏవయినా సావనీర్స్ లాంటివి తీసుకొని వెళ్ళడం తప్పని సరి. ప్రసాదంతో పాటూ ఓ వేంకటేశ్వరుడి కీ చెయినో, ఫోటోనో, భక్తిపాటల సీడీనో, కనీసం కాశీతాడో ఇవ్వడం రివాజు. అవి కొనడానికి షాపులవెంట పడవలసిందే. గుండు చేయించుకొన్నవాళ్ళు టోపీలకోసం, వాళ్ళకి తోడువెళ్ళిన ఆడవాళ్ళు గాజులకోసం, చెంపపిన్నులకోసం, పిల్లలు బొమ్మల కోసం, ఉంగరాలకోసం షాపింగ్‌స్ప్రీ మొదలు పెడతారు. అదో సరదా!
© Dantuluri Kishore Varma







No comments:
Post a Comment