ప్రతీరోజూ
ఓ అందమైన సూర్యోదయం,
అంతకన్నా అందమైన సూర్యాస్తమయమూ ఉంటాయి.
ఎవరో అంటారు-
అస్తమించే సూర్యుడిని, ఉదయించే చంద్రుడిని గమనిస్తూ ఉంటే
సృష్ఠికర్త మీద గౌరవం మరింత పెరుగుతుందని.
అపార్ట్‌మెంట్ల నడుమ
చెట్లవెనుక
కొండలమధ్య
గోదావరిమీద పడవల తెరచాటుగా
వరిచేలదగ్గర...
సూర్యుడు వీడ్కోలు చెపుతుంటే
ఆగి, చూడకుండా ఉండలేం!
No comments:
Post a Comment