కాకినాడనుంచి ఉప్పాడ వెళ్ళడానికి రెండు దారులున్నాయి. ఒకటి పిఠాపురం మీదుగా వెళితే, రెండవది వాకలపూడి లైట్‌హౌస్ ప్రక్కనుంచి సముద్రానికి ఆనుకొని వెళ్ళే బీచ్‌రోడ్డు. ఈ రెండవది విశాఖపట్నం నుంచి బీమిలీ వెళ్ళే రోడ్డుని తలపిస్తుంది. ఎగసిపడే అలలు, తీరం వెంబడే ఎగిరే నీటి పక్షులు, చల్లని సముద్రపుగాలి, బీచ్ ఇసుకమీద లంగరు వేసి ఉన్న నాటుపడవలు, అక్కడక్కడా నీచువాసన, వలలు భుజానవేసుకొని రోడ్డువెంబడి నడచిపోయే మత్యకారులు.. ఓ పదికిలోమీటర్ల దూరం ఇట్టే జరిగిపోతుంది. సముద్రపు అలలు రోడ్డుని కోసేయ్యకుండా రివెట్‌మెంట్ వేశారు. కానీ, ప్రతీ వర్షాకాలంలోనూ అది కొట్టుకొని పోతుంది. ఒక్కోసారి ఉప్పాడ ఇరుకు వంతెన మూడింట రెండు వంతులు కోతకు గురవుతుంది. మిగిలిన సన్న దారిలో ముంబై మెరైన్‌డ్రైవ్‌లో కెరటాలు విరుచుకుపడి, నీటి తుంపర్లు మీదపడుతున్నప్పటిలా సముద్రం హడావుడి చేస్తుంటే బితుకు, బితుకు మని ప్రయాణీంచడమే! ఈ ఫోటోలు చూడండి. ఇంకొక్క తమాషా చెప్పనా? రోడ్డుకి ఓ వైపు సముద్రం, రెండవ వైపు వరి చేలు!
© Dantuluri Kishore Varma
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment