తిరుమలలో శ్రీవారి సేవలో తరించే ఏనుగులు ఓ అరడజను దాకా ఉన్నాయట. ప్రతీఉదయం భోగ శ్రీనివాసుడికి జరిగే జలాభిషేకంలో కొన్ని గజరాజులు పాల్గొంటే, సాయంత్రం మలయప్పస్వామి ఊరేగింపులో కొన్ని పాలుపంచుకొంటాయి. ఉత్సవాల్లో, సంబరాల్లో, ప్రత్యేక అతిధులకి స్వాగతం చెప్పడంలో శ్రీవారి ఏనుగులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ సేవలు అవీ లేనప్పుడు ఏనుగులని బయటకు తీసుకొని వస్తారో లేదో తెలియదు కానీ మొన్న ఉదయం వరహాస్వామి గుడికి సమీపంలో భక్తులు ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ, వారి శిరస్సులమీద తొండం ఉంచి ఆశీర్వదిస్తూ ఓ ఏనుగు ఇలా కనిపించింది. మావటివాడికీ, గజరాజుకీ ఏదో సంభాషణ జరుగుతుంది. అతను చెప్పినట్టూ చేస్తుంది.
కొందరు భయం, భయంగా కొంచెం భక్తిగా ఆశీర్వాదం తీసుకొంటున్నారు. ఒక్కోక్కరయితే తొండం శిరస్సుమీద ఉంచినప్పుడు ఒక రకమైన జలదరింపుకు లోనవుతున్నారు.
భయంలేదులేమ్మా వచ్చి ఆశీస్సులు అందుకో అన్నట్టు ఉంది కదు!
`హమ్మయ్య ఈ రోజుకి ఈ కార్యక్రమం ముగిసింది. ఇక వెళ్ళి చెరుకు గడలూ అవీ తిందాం,` అనుకొంటుందేమో!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment