"నాకొక కొత్తవ్యక్తిని పరిచయం చెయ్యండి, అతనిగురించి ఒక ఆసక్తికరమైన కథ రాస్తాను," అనేవాడట స్టివెన్ లీకాక్. ఇంచుమించు అలాగే "అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేదోయ్ కవితకనర్హం," అని శ్రీశ్రీ గారు అంటారు. తొంభై ఏళ్ళు పైన బ్రతికిన తాళ్ళపాక అన్నమాచార్య 36,000 సంకీర్తనలు రాసి `ఔరా!` అనిపించాడు. రోజుకి ఒకటి చొప్పున రాసినా అన్ని కీర్తనలు పూర్తిచెయ్యడానికి 97 సంవత్సరాలు పడుతుంది! ఏమి రాయాలో ఆలోచించుకోవలసిన అవసరం లేకుండా, ఏమైనా రాయగల సృజనాత్మకత వాళ్ళ సొంతం.
చాలా ఏళ్ళక్రితం నా స్నేహితుడు ఒకరు స్వాతిలో కథల పోటికి ఒక కథ పంపిస్తే, `రాసే విధానం బాగుంది, కానీ కథగా ప్రచురించగలిగినంత పెద్దగా లేదు. బాగా నిడివి పెంచి రాయండి సీరియల్ గా వేస్తాం,` అని ఒక నోట్ పెట్టి త్రిప్పి పంపించారు. అది చూసి మొదట నిరుత్సాహపడినా, తరువాత నిజంగానే సీరియల్ రచయిత అయిపోయినంత ఆనంద పడిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆకథని నవలగా పెంచి రాయడంగానీ, ప్రచురించబడడంగానీ జరగలేదనేది వేరే విషయం. "చ! ఎడిటర్ల లాంటి చెక్ పోస్ట్లు లేకుండా ఉంటే మన రాతలు మనమే వేసేసుకోవచ్చు," అనేవాడు. మావాడు ఆశపడిన అవకాశం ఇప్పుడువచ్చింది. కొంతకాలం క్రితం వరకూ రచయితలు వేరుగా, పాఠకులు వేరుగా ఉండేవారు. కానీ, అంతర్జాలంలో బ్లాగులు మొదలయ్యాకా ఎవరయినా రచయితలు అవ్వొచ్చు. నా ఫ్రెండుకి బ్లాగు లేదు కానీ, ఒకవేళ ఉంటే ఏమిరాసి ఉండేవాడా అని నాకు సందేహం కలుగుతుంటుంది అప్పుడప్పుడూ. అవకాశం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. లేనిదల్లా ఏమిరాయాలనే అవగాహన మాత్రమే.
నేను ఈ మధ్యనే ఇండీబ్లాగర్ అనే ఇండియన్ బ్లాగర్ కమ్యూనిటీలో చేరడం జరిగింది. వాళ్ళు చెప్పే ఒక వాఖ్యం బాగా నచ్చింది నాకు - "ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్," అని. మరి ఆ `సంతింగ్` అంటే ఏమిటీ అనేది బేతాళ ప్రశ్న. ప్రతీరోజూ కొన్ని వేల మంది బ్లాగర్లు లక్షలకొద్దీ పేజీలు రాసిపడేస్తున్నారు. వాళ్ళంతా రాసే సంతింగ్, సంతింగ్ ఏమిటి? ఆ మేజిక్ ఏదో మనకి కూడా తెలిస్తే చంద్రుడికో నూలు పోగులా ఓ నాలుగు పేజీల మనమూ బరికి పారేయవచ్చుకదా! ఇదే ఆలోచనతో కొన్నిరోజులుగా కనిపించిన బ్లాగునల్లా చదివితే కొన్నివిషయాలు తెలిశాయి. అవి అందరితో పంచుకొoటే బాగుంటుందని ఈ టపా రాస్తున్నాను.
రాతలు 6 రకాలు (Kinds):
1. నెరేటివ్ - సంఘటనలు జరిగిన క్రమంలో కథలాగ చెప్పుకొని పోవడం: `నాచిన్నప్పుడు ఏమి జరిగిందంటే,` అని మొదలుపెట్టి జ్ఞాపకాలు అన్ని రాసేసుకోవడం. జీవితచరిత్రలు, సంఘటనలు, ఏదయినా తయారుచేసే విధానం...లాంటివాటిని ఈ కోవలోకి తీసుకొని రావచ్చు.
2. డిస్క్రిప్టివ్ - వర్ణన: ఒక ప్రదేశాన్ని గురించి వర్ణించి రాసే టపాలు. ట్రేవలాగ్ పోస్టులు ఈ కోవలోకి వస్తాయి.
3. రిఫ్లెక్టివ్ - అద్దంలో ప్రతిబింబం లాంటి రాతలు అన్నమాట: బుక్ రివ్యూస్, ఫిల్మ్ రివ్యూస్ మొదలైనవి.
4. క్రిటికల్ - పరిశీలనాత్మకమైన టపాలు: మనుషులని, నడవడికలని, పనులని, విధానాలని... పరిశీలించి, విశ్లేషించి వ్రాయడం.
5..క్రియేటివ్ - సృజనాత్మక రాతలు: కథలు, కవితలు మొదలైనవి.
6. పిక్ అండ్ పోస్ట్ -ఏదో ఒకటి ఏరుకొని వచ్చి మన మొహాన కొట్టడం: దీనికి వివరణ అనవసరం.
ఇంకా చాలా రకాలు ఉండవచ్చు. విషయాన్ని క్లుప్తంగా చెప్పే టపా కనుక వివరంగా రాయడం లేదు (= నాకు అంతకంటే ఎక్కువ తెలియదు :-p)
రాసే విధానాలు (Moods) :
కొంతమంది చమత్కారంగా హాస్యం ఉట్టిపడేలా చెబుతారు(హ్యుమరస్). ఇది ఒకకళ. వాళ్ళు రాసింది చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయిపోయెలా నవ్వలేక చస్తాం. రెండవ విధానం సీరియస్. జాగ్రఫీ పాఠంలాగ చెప్పేయడం అన్నమాట. మూడవది సర్కాస్టిక్ అంటే వెటకారం. ఒకవైపు నుంచి నవ్వువస్తూనే ఉంటుంది; ఇంకో వైపు కారం రాసినట్టు ఉంటుంది. అయినా ఈ పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )
కొంతమంది చమత్కారంగా హాస్యం ఉట్టిపడేలా చెబుతారు(హ్యుమరస్). ఇది ఒకకళ. వాళ్ళు రాసింది చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయిపోయెలా నవ్వలేక చస్తాం. రెండవ విధానం సీరియస్. జాగ్రఫీ పాఠంలాగ చెప్పేయడం అన్నమాట. మూడవది సర్కాస్టిక్ అంటే వెటకారం. ఒకవైపు నుంచి నవ్వువస్తూనే ఉంటుంది; ఇంకో వైపు కారం రాసినట్టు ఉంటుంది. అయినా ఈ పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )
ఉద్దేశ్యాలు (Purposes):
1. వినోదం కలిగించడానికి 2. ఎడ్యుకేట్ చెయ్యడానికి 3. సుత్తేసి బొరుకోట్టడానికి.
1. వినోదం కలిగించడానికి 2. ఎడ్యుకేట్ చెయ్యడానికి 3. సుత్తేసి బొరుకోట్టడానికి.
ఈ ఆరు రకాలని, మూడు విధానాలని, మూడు ఉద్దేశ్యాలని రకరకాలుగా కలిపి చాలా కాంబినేషన్లని తయారుచెయ్యవచ్చు.
స్టివెన్ లీకాక్ భావించినట్టు మన అందరిలో కూడా ఆసక్తి కరమైన సంగతులు ఉంటాయేమో! వాటిగురించి వ్రాయడం మొదలుపెట్టవచ్చు. ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్. So, start blogging right now.
(నా పరిశీలనలోకి వచ్చిన వాటిని `ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందేమో!` అనే ఆశతో ఈ టపాలో రాయడం జరిగింది. నేను ప్రస్తావించిన కేటగిరీల్లోకి కొందరి పోస్టులు వచ్చే అవకాశం ఉంది కనుక, ఎవ్వరూ విమర్శతో రాశానేమో అని భావించవద్దని మనవి.)
© Dantuluri Kishore Varma
ఇంతకీ మీరే రకం చెప్పేరు కాదు :)
ReplyDeleteవిశ్లేషణ చాల బాగుందండీ... :-)
ReplyDeleteఒక్కో టపా ఒక్కో రకంగా ఉంటాయండి. దీని వరకూ వస్తే, క్రిటికల్ కేటగిరీలో చేర్చవచ్చు. ఎడ్యుకెటివ్ పర్పస్. హ్యూమరస్ గా వ్రాద్దామని ప్రయత్నించాను. మరి ఇది జాగ్రఫీ పాఠంలాగో, సుత్తిలాగో తయారయి ఉండవచ్చు. మొదటి అయిదు రకాలలోనీ నా పోస్టులు ఉన్నాయండి. హ్యూమరస్ శైలి నాకు బాగా నచ్చుతుంది, కానీ అంతబాగా వ్రాయడం రాదు. ఎప్పటికైనా, `కెవ్వు కేక` లాంటి పోస్టులు వెయ్యాలని డ్రీం.ధన్యవాదాలు.మీరు ముందు ఆశీర్వదించండి చెబుతాను - కష్టేఫలె శర్మ గారు.
ReplyDeleteధన్యవాదాలు గిరీం పేట....గారు. నాబ్లాగుకి స్వాగతం.
>>>>పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )
ReplyDeleteహహ్హహ్హ.. బాగుంది మీ పరిశీలన.
థాంక్స్ ఎ లాట్ :)
ReplyDelete
ReplyDeleteబాగుంది:) మరి కెవ్వు కేక ఎప్పుడు?
నాబ్లాగుకి మీకు స్వాగతం జయగారు. రాసినప్పుడు `భలే మంచిరోజు` అని పాడుకొంటూ, మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకు నాటపాల్లో అటువంటిది ఏదయినా కనిపిస్తే మరచిపోకుండా చెప్పండి :) ధన్యవాదాలు.
ReplyDelete