మంచిదో, చెడ్డదో ఎంచుకొని చదివే అలవాటు పెద్దవాళ్ళకే ఉంటుంది. అంతకుముందు ఊహతెలుస్తూఉన్న కోత్తలో చదవడమంటే చదవడంకోసమే! ఎక్కడ తెలుగు పదాలు కనిపించినా కూడబలుక్కోని చదవడం నాకు బాగా చిన్నప్పుడే ఎలా అలవాటు అయ్యిందో చెబుతాను.
పూర్వకాలపు పల్లెటూర్లలో ఉండే విశాలమైన ఇళ్ళలాంటి ఒకానొక ఇల్లుమాది. ఇంటిముందు పెద్ద గేటు ఉండేది. గేటు అంటే ఇనుప కమ్మెలతో, నగిషిలతో ఉండే ఇప్పటిలాంటిది కాదు. చతురశ్రాకారపు చెక్కఫ్రేముకి ఇనుపరేకుని మేకులతో దిగగోట్టి తయారుచేసింది. సమాంతరంగా ఉండే ఇటువంటి ప్రదేశం మా పక్కఊరిలో ఉండే సినిమా హాలు వాళ్ళకి ఉచితంగా లభించిన ఎడ్వర్టయిజ్మెంట్ హోర్డింగ్ లాంటిది. తత్ఫలితంగా వారానికో, పదిరోజులకో మారే ప్రతీ సినిమా పోస్టరూ మాగేటుమీద తప్పనిసరిగా అంటించవలసిందే. రోజూ స్కూలుకి వెళ్ళి వచ్చేటప్పుడు నలుపు తెలుపుల్లో, అప్పుడప్పుడు రంగుల్లో ఉండే సినిమా పోస్టర్లు చూస్తూ ప్రతీ పదం కూడబలుక్కొని చదువుకొనే వాళ్ళం. కామిక్ పుస్తకాలలో బొమ్మలు చూసుకొంటూ చదవడంలో ఉన్న ఆనందం కంటే కూడా ఎక్కువ ఆసక్తి సినిమా పేరూ, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలుసుకోవడంలో ఉండేది.
ఓపెన్ చేసి ఉన్న గేటు కారుకి వెనుకవైపు కనిపిస్తుంది చూడండి.
కూడబలుక్కోని చదవడం నేర్పించడంలో నాకు మొదటిగురువు మాపొరుగూరి సినిమా థియేటర్ వాళ్ళయితే, రెండవగురువు ఆర్.టి.సి. వాళ్ళు! మావూరు దాటి నాలుగు ప్రక్కఊళ్ళకి నిరంతరం బస్సులు తిరిగేవి. వాటి చుట్టూ అవి ఆగే స్టాపులపేర్లు రాసివుంటే చదవగలిగినన్ని పేర్లు బిగ్గరగా చదివేవాళ్ళం. రాజమౌళీ తీసిన సై సినిమాలో పాటలోలాగ ఏదయినా ప్రయాణం చేసినప్పుడు కనిపించిన ప్రతీ పదాన్నీబఠానీల్లాగ నమిలెయ్యడమే.
వారం, వారం ఆంధ్రప్రభ వీక్లీ వచ్చేది మా ఇంటికి. అందులో మొదట కార్టూన్లూ; తరువాత క్రమంగా తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్లు చిన్న కథలు, సీరియళ్ళ దాకా చదవడం కొనసాగి, చిట్ట చివరికి కవర్ టూ కవర్ కవరేజ్ స్థాయికి చేరుకొంది. ఆసక్తికరమైన విషయాలూ, ప్రమదావనం, వంటలు మొదలైన ఉపయోగకరమైన శీర్షికలు, సీరియల్సు పత్రికల నుంచి వేరుచేసి బైండ్ చేయించేవారు. అవి అన్నీ మాయింటినిండా పెట్టెల్లో సర్ది ఉండేవి. ఎవరికయినా చదవాలంటే వాటిని తీసుకొని వేళ్ళేవారు.
"ప్రాణాలకి తెగించి పుస్తకాలు చదివే వాడిని," అని గొప్పలు చెప్పుకోవడానికి సరిపోయేలా ఒక సంఘటన జరిగింది.
లైబ్రరీ, పల్లపు వీధి అనే ప్రాంతంలో ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండే మా ఇంటి నుంచి అక్కడికి సైకిల్ మీద వెళ్ళాలంటే, తొక్కవలసిన అవసరం లేదు. రోడ్డు వాలులో `ఝామ్మని`దూసుకొని పోవడమే. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లతో పాటూ, మహా మంత్రి తిమ్మరుసు, చత్రపతి శివాజీ, దుర్గాబాయి దేశ్ ముఖ్ వంటి చిన్ని చిన్ని జీవిత చరిత్రలు లైబ్రరీలో అందుబాటులో ఉండేవి. వాటి కోసం రోజూ వెళ్ళేవాడిని. అసలు ఏమి జరిగిందంటే - అప్పటికి నాకు ఇంకా సైకిల్ తొక్కడం సరిగా రాలేదు. ఒకరోజు దాన్ని బయటికి తీసి, పెడల్ తొక్కుకొంటూ లైబ్రరీ వైపుకు బయలుదేరాను. పల్లంలో వేగంగా వెళ్ళిపోతుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. తొక్కడమే అంతంత మాత్రం అంటే ఇక ట్రాఫిక్ రూల్స్ అనేవి లేనే లేవని అర్ధం. ఎదురుగా ప్రియా స్కూటర్ మీద త్రిబుల్సుతో అతికష్టమ్మీద అప్ ఎక్కిస్తున్న ఆసామికి అయ్యగారు (అంటే మనమే) హై స్పీడుగా వస్తున్నారని తెలియదు. మనోడు కంగారుపడి తప్పించే సరికే డాషిచ్చేసి రోడ్డుప్రక్కన ఉన్న గోతిలో పడగొట్టేయ్యడం జరిగిపోయింది.
`ఒకటే గమ్యం, ఒకటే గమనం ,` అన్నట్టు, స్ప్రింగ్ లాగ లేచి, 8 అంకేలాగ వంగిపోయిన ముందు చక్రాన్నీ, నుదుటి నుంచి కారుతున్న రక్తాన్నీ కూడా గమనించకుండా సైకిల్ ఎక్కేస్తున్న నన్ను చూసిన అప్పటీకే అక్కడ ప్రోగయిపోయిన మావూరి జనాలలో ఒకరు "బండ రాస్కేల్," అని తిట్టి, హాస్పిటలుకి తీసుకొని వెళ్ళి కట్టు కట్టించడంతో ఒక అడ్వంచర్ ముగిసింది. ఎడమ కనుబొమ్మ పైన ఉన్న మచ్చని ఇప్పటికీ చూపించి లైబ్రరీ మచ్చ అని బడాయి చెబుతుంటాను మా పిల్లలకి.
మా అన్న కాలేజీలో చేరినతరువాత టాబ్లాయిడ్ సైజులో ఉండే సితార, మేగజైన్ సైజులో, మంచి క్వాలిటీ పేపరుతో వచ్చే విజయచిత్ర; యండమూరి, మల్లాది నవలలు; విశ్వవిజ్ఞాన దర్శిని లాంటి పాపులర్ సైన్స్ పుస్తకాలూ విరివిగా అందుబాటులోకి తెచ్చాడు. స్కూల్లో నేర్చుకొన్నది ఎంతో తెలియదు కానీ, ఇలాంటి పుస్తకాలు అన్నీ చదివి జనరల్ ఎవేర్నెస్ కొంత వొంట బట్టింది.
కంప్యూటర్, ఇంటర్నెట్లు అందుబాటులోకి వచ్చినతరువాత లభిస్తున్న వేలకొద్దీ పుస్తకాలు, వెబ్ సైట్లు, ఆన్లైన్ మాగజైన్లు, ముఖ్యంగా బ్లాగులు పుస్తక ప్రియులకి అన్నమయ్య చెప్పినట్టు, "ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపముమరి, ఇదిగాక వైభవము ఇంకొకటి కలదా?"... వీటి వల్ల ఇంకొక అధనపు ఉపయోగం- శోభాడేతోనో, అమితాబ్తోనో, మరిఎవరితోనయినా మన అభిప్రాయాన్ని కామేంట్ గా చెప్పగలగడం. మంచి పుస్తకాన్ని చదివినప్పటి ఆనందాన్ని, ఫీలింగుని మనబ్లాగ్ ద్వారా మిగిలిన వారితో పంచుకోగలగడం....హ్యాపీ రీడింగ్ అండ్ హ్యాపీ షేరింగ్!
"ప్రాణాలకి తెగించి పుస్తకాలు చదివే వాడిని," అని గొప్పలు చెప్పుకోవడానికి సరిపోయేలా ఒక సంఘటన జరిగింది.
లైబ్రరీ, పల్లపు వీధి అనే ప్రాంతంలో ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండే మా ఇంటి నుంచి అక్కడికి సైకిల్ మీద వెళ్ళాలంటే, తొక్కవలసిన అవసరం లేదు. రోడ్డు వాలులో `ఝామ్మని`దూసుకొని పోవడమే. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లతో పాటూ, మహా మంత్రి తిమ్మరుసు, చత్రపతి శివాజీ, దుర్గాబాయి దేశ్ ముఖ్ వంటి చిన్ని చిన్ని జీవిత చరిత్రలు లైబ్రరీలో అందుబాటులో ఉండేవి. వాటి కోసం రోజూ వెళ్ళేవాడిని. అసలు ఏమి జరిగిందంటే - అప్పటికి నాకు ఇంకా సైకిల్ తొక్కడం సరిగా రాలేదు. ఒకరోజు దాన్ని బయటికి తీసి, పెడల్ తొక్కుకొంటూ లైబ్రరీ వైపుకు బయలుదేరాను. పల్లంలో వేగంగా వెళ్ళిపోతుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. తొక్కడమే అంతంత మాత్రం అంటే ఇక ట్రాఫిక్ రూల్స్ అనేవి లేనే లేవని అర్ధం. ఎదురుగా ప్రియా స్కూటర్ మీద త్రిబుల్సుతో అతికష్టమ్మీద అప్ ఎక్కిస్తున్న ఆసామికి అయ్యగారు (అంటే మనమే) హై స్పీడుగా వస్తున్నారని తెలియదు. మనోడు కంగారుపడి తప్పించే సరికే డాషిచ్చేసి రోడ్డుప్రక్కన ఉన్న గోతిలో పడగొట్టేయ్యడం జరిగిపోయింది.
ఆ రోడ్డు ఇదే
మా అన్న కాలేజీలో చేరినతరువాత టాబ్లాయిడ్ సైజులో ఉండే సితార, మేగజైన్ సైజులో, మంచి క్వాలిటీ పేపరుతో వచ్చే విజయచిత్ర; యండమూరి, మల్లాది నవలలు; విశ్వవిజ్ఞాన దర్శిని లాంటి పాపులర్ సైన్స్ పుస్తకాలూ విరివిగా అందుబాటులోకి తెచ్చాడు. స్కూల్లో నేర్చుకొన్నది ఎంతో తెలియదు కానీ, ఇలాంటి పుస్తకాలు అన్నీ చదివి జనరల్ ఎవేర్నెస్ కొంత వొంట బట్టింది.
మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన నవల అంకుల్ శామో, సావిరహేనో సరిగా జ్ఞాపకం లేదుకానీ - దానిలో రాజ్ కృష్ణ అనే ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కారెక్టర్ ఇంగ్లీష్ మీద ఇంటరేస్ట్ క్రియేట్ చేసింది. భాషలో చమత్కారాలు, దాని ఉపయోగాలు(ప్రపంచ సాహిత్యం అందుబాటులో ఉండడం లాంటివి) ఆసక్తి కలిగేలా ఈ పాత్రచేత చెప్పిస్తాడు రచయిత. రాబిన్సన్ క్రూసో, గాన్ విత్ ద విండ్, ప్రైడ్ అండ్ ప్రెజుడీజ్ మొదలైన క్లాసిక్స్ నుంచి ఇండియన్ ఆదర్స్ ఆర్.క్.నారాయణ్, టాగోర్, జవహర్లాల్ నెహ్రూ వరకూ; అక్కడినుంచి ప్రస్తుతపు చేతన్ భగత్ వరకూ; నావల్స్ నుంచి ఫిలాసఫీ అక్కడినుంచి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలవరకూ ఏదయినా ఇంగ్లీష్ లో విరివిగా లభించడంవల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అ సాహిత్యం చదివి ఆనందించడానికి ఒక రచయిత కల్పించిన పాత్ర ప్రభావితం చెయ్యడం పుస్తకాలు చదవడం యొక్క అత్యుత్తమ ఉపయోగం అని నా అబిప్రాయం.
కంప్యూటర్, ఇంటర్నెట్లు అందుబాటులోకి వచ్చినతరువాత లభిస్తున్న వేలకొద్దీ పుస్తకాలు, వెబ్ సైట్లు, ఆన్లైన్ మాగజైన్లు, ముఖ్యంగా బ్లాగులు పుస్తక ప్రియులకి అన్నమయ్య చెప్పినట్టు, "ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపముమరి, ఇదిగాక వైభవము ఇంకొకటి కలదా?"... వీటి వల్ల ఇంకొక అధనపు ఉపయోగం- శోభాడేతోనో, అమితాబ్తోనో, మరిఎవరితోనయినా మన అభిప్రాయాన్ని కామేంట్ గా చెప్పగలగడం. మంచి పుస్తకాన్ని చదివినప్పటి ఆనందాన్ని, ఫీలింగుని మనబ్లాగ్ ద్వారా మిగిలిన వారితో పంచుకోగలగడం....హ్యాపీ రీడింగ్ అండ్ హ్యాపీ షేరింగ్!
© Dantuluri Kishore Varma
Happy Reading.. Thanks for Sharing. :)
ReplyDeleteధన్యవాదాలు శిశిరగారు.
ReplyDeletemee baalyam loni sangatanalu baagunnayandi thank you sir
ReplyDeleteధన్యవాదాలు మూర్తిగారు.
Deletelecturer character savirahe lode varma garu
ReplyDeleteఅవును, సావిరహేనే :)
Delete