"మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడండి. అస్సలు చెప్పిన మాట వినడంలేదు. అన్నంకూడా సరిగా తినడు. మీరు భయం చెప్పండి," అని విద్యార్ధుల తల్లితండ్రులు ఉపాధ్యాయులని కోరుతూ ఉంటారు. కానీ, ఒక టీచరు యొక్క ప్రభావం విద్యార్ధి మీద అతని ఇంటిదగ్గర కూడా ఉంటుందా అనేది సందేహాస్పదం. చదువు వరకూ స్కూల్ యొక్క ప్రభావం ఉన్నా, స్టూడెంట్ ప్రవర్తన ఇంటిదగ్గర, బయటిసమాజంలో ఎలా ఉండాలీ అనే విషయాన్ని నిర్ణయించేది -తల్లితండ్రుల, విద్యాలయాల ఉమ్మడి పాత్ర.
ఒకసారి తన కుమారుని ఉపాధ్యాయునికి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ రాసిన లేఖలో ఆ కుర్రాడికి ఏమేమి నేర్పించాలో చెబుతాడు. ఇది చాలా ఇన్స్పయరింగా ఉంటుంది.
"మావాడు ఎంతో నేర్చుకోవాలి. నాకు తెలుసు లోకంలో అందరూ న్యాయబద్ధులు, సత్యవంతులూ కారని. కానీ సమాజంలో ప్రతీ దుష్టుడికీ ఒక ఆరాధ్యుడు ఉంటాడని మా వాడికి నేర్పండి. స్వార్థపరుడైన ప్రతి రాజకీయవేత్తకి నిస్వార్థ నాయకుడు ఉంటాడు.
ప్రతీ శత్రువుకీ ఓ స్నేహితుడుంటాడని బోధించండి. ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షులు, ఎండలో తిరిగే చీమలు, పచ్చని కొండ చెరియల్లో పూసే పూల రహస్యాల్ని తెలుసుకోను కాస్తంత సమయమూ ఇవ్వండి. మోసం చేయడం కంటే విఫలం కావడమే గౌరవప్రదమని చాటి చెప్పండి. అతని ఆలోచనలను ఇతరులు తిరస్కరించినా వాటి పట్ల అతనికి నమ్మకం కలిగించండి. మంచి వారి పట్ల మంచిగా, చెడ్డవారి పట్ల కఠినంగా వ్యవహరించడమూ నేర్పండి.
అందరూ వెళ్లే దారిలో కాకుండా సత్యాన్ని శోధించే దారిలో వెళ్లేందుకు మా అబ్బాయికి శక్తినిచ్చేందుకు ప్రయత్నించండి. అందరి మాట వినడం, విన్నవాటిలో సత్యాన్ని గ్రహించేట్టు చేయండి. మనసు బాగోలేకపోయినా నవ్వడం నేర్పండి మీకు వీలైతే. దుఖం అవమానం కాదని, అనాలోచనాపరులకు దూరంగా ఉండమని, అతిగా పొగిడేవారి పట్ల జాగ్రత్త వహించమని బోధించండి. ఆలోచనలు ఉన్నత పథానికి వెళ్లడానికి వినియోగించమని బోధించండి కానీ, మనసుకు వెలకట్టకూడదని చెప్పండి.
అల్లరిమూక గోల వినవద్దని, తన ఆలోచన సత్యమైతే దానికోసం పోరాడమని చెప్పండి. సున్నితంగా బోధించండి. కానీ మరీ ముద్దు చేయొద్దు. కఠిన పరీక్షలతోనే గదా రాటు తేలేది!
అసహ్యాన్ని ఎదిరించేందుకు, ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి ఎంతో సహనంతో నిలవడం బోధించండి. తనపై తనకి అపార నమ్మకం కలిగేట్టు చెయ్యండి. తద్వారా మానవాళిపై నమ్మకాన్ని పెంచుకోగలుగుతాడు.
దీన్ని ఆదేశంగానే తీసుకోండి. మీరు చేయగలిగింది చేయండి. మా వాడు మా మంచి పిల్లవాడు!"
అలాగే ఒక పేరంట్ కూడా తను చేయవలసిన పనులను ఒక చిట్టా తయారుచేసుకొని వాటిని అమలు పరిస్తే....
పిల్లలు చక్కటి ప్రవర్తన, క్రమశిక్షణ, బాధ్యత, సమయపాలనలతో పెరిగి పెద్దవ్వాలి అంటే తల్లితండ్రుల పాత్ర విశేషంగా ఉండాలి. పెద్ద పేరున్న కార్పొరేట్ స్కూల్లో చేర్చి మన బాధ్యత తీరింది అనుకుంటే తప్పు చేసినట్లే. పిల్లలు స్కూల్లో విద్యా విషయాలు, క్రమశిక్షణ, సమయపాలన, సామాజిక ప్రవర్తనా నియమాలూ నేర్చుకొంటే; కుటుంభం నుంచి నైతిక విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్ధిక విషయాలు, ప్రేమ, ఆప్యాయతలు నేర్చుకొంటారు. పిల్లల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లితండ్రులదే ప్రముఖ పాత్ర అనేది కాదనలేని సత్యం.
తల్లితండ్రులు విద్యాధికులు అయిఉండీ, రోజులో కొంత సమయాన్ని పిల్లలికి కేటాయించగలిగితే ఆ పిల్లలు చదువులో, చక్కని ప్రవర్తనలో తమ సహచరులుకంటే ముందు ఉండే అవకాశం ఎనభై శాతం వరకూ ఉంటుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ప్రతీరోజూ చేయించడం, చేతివ్రాత చక్కగా ఉండేలాగ జాగ్రత్త తీసుకోవడం, ఒక నిర్ధుస్టమైన ప్రణాళికననుసరించి చదివించడం కిండర్ గార్టెన్ స్థాయి నుంచీ పిల్లలికి పేరెంట్స్ అలవాటు చెయ్యాలి. ఇది క్రమశిక్షణ, సమయపాలనలు నేర్పించడంలో మొదటి మెట్టు.
లాంగ్వేజస్ లో, భావాల వ్యక్తీకరణలో ప్రగతి సాధించడానికి డిక్టేషన్ ఇవ్వాలి, మంచి నీతి కథలు చెప్పి వాళ్ళు తమ స్వంత మాటలలో వ్రాసేలాగ ప్రోత్సహించాలి. దీనివలన మంచి కమ్యూనికేషన్ అలవడటమేకాక, నైతికవిలువలు నేర్చుకోగలుగుతారు.
సైన్సు, మేథ్స్ సబ్జెక్ట్ లలో చిన్న చిన్న పరిశోధనలు చెయించడం, కొంచం డబ్బు వారికిచ్చి ఏమయినా వస్తువులు కొనిపించి ప్రాధమిక గణిత భావనలను అవగాహన అయ్యే విధంగా చేసినప్పుడు చదువు యొక్క వాస్తవ విలువను గ్రహించగలుగుతారు. ఈవిధమైన ప్రణాళిక వలన శ్రధ్ధ, ఆసక్తి కలిగి సెల్ఫ్ మొటివేషన్, ఐక్యూలతో తిరుగులేని విజయాలకి పునాది వేసుకోగలుగుతారు. తల్లితండ్రులయొక్క సహకారం లేకుండా ఏ విద్యాసంస్థ అయినా ఇటువంటి పౌరుల్ని తయారు చెయ్యడం సాధ్యమయ్యె పనేనా?
మరి నిరక్షరాస్యులయిన తల్లితండ్రులు, ఉద్యోగ లేదా వ్యాపారలలో తీరిక లేని వారి విషయంలొ ఏమి చెయ్యలీ అనేది ప్రశ్న. ట్యూషన్ అనేది ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, అది కేవలం ఎకడమిక్స్ వరకే పరిమితం అని గమనించాలి. ఎంతవరకూ ట్యూటర్ శ్రధ్ధ వహిస్తున్నారు అని తెలుసుకోవడం తప్పనిసరి.
ఏ పాఠశాలల్లోనూ సాధారణంగా నేర్పించని విషయాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి చిన్న చిన్న పనులని పిల్లలికి అప్పగించి స్వతంత్రంగా పూర్తి చేసేలాగ చెయ్యడం, డబ్బు విషయంలో – దూబరాకి అవకాశం లేని ఆర్ధిక నిబధ్ధతని అలవరచడం, జంక్ ఫుడ్ కి అలవాటుపదకుండా చూడడం, పెద్దలపట్ల గౌరవం, దీనులపట్ల ఆదరణ, వోడినప్పుడు కూడా స్థైర్యం కొల్పొకుండా ఉండడం, పనులని కష్టంతో కాకుండా ఇష్టంతో చెయ్యడం , మెడిటెషన్…. మొదలైనవి. ఖచ్చితంగా వీటిపట్ల సమయం కేటాయించ వలసినది తల్లితండ్రులే.
బాల్యంలో, యవ్వనంలో ఉన్న పిల్లలితో సరిఅయిన కమ్యూనికేషన్ కొనసాగిస్తూ, టి.వి. సినిమా, ఇంటర్నెట్ల యొక్క దుష్ప్రభావవానికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అలాగని వారిని టెక్నాలజీకి దూరంచెయ్యకూడదు. చెడ్డ ఫ్రెండ్స్ నుంచి కూడా దూరంగా ఉంచాలి. పిల్లల్ని పెంచడం మొక్కల్ని పెంచడం వంటిదే. అది ఒక తప్పనిసరి బాధ్యత కాదు అని, ఇష్టంతో ఆహ్లాదంగా చెయ్యాలి అని మరవకూడదు.

అందుకే, తల్లితండ్రులు నేర్చుకోవలసిని మొట్టమొదటి సాఫ్ట్ స్కిల్ హౌ టు బి ఏన్ ఎఫెక్టివ్ పేరెంట్ అనేది.
ఇవి నాకు తోచిన కొన్ని విషయాలు మాత్రమే. బహుశా ఈ లిస్టుకి ఇంకా చాలా పాయింట్స్ చేర్చుకోవచ్చనుకోంటాను!
ఇవి నాకు తోచిన కొన్ని విషయాలు మాత్రమే. బహుశా ఈ లిస్టుకి ఇంకా చాలా పాయింట్స్ చేర్చుకోవచ్చనుకోంటాను!
© Dantuluri Kishore Varma
Its very good post... please continue like this...
ReplyDeleteతప్పనిసరిగా కొనసాగిస్తానండి. ధన్యవాదాలు. ఐ.డి.తో కామెంట్స్ పెడితే ఇంకా చాలా సంతోషిస్తాను.
ReplyDeleteExcellently written sir. Very informative. If possible will you please elaborate on how to protect children from bad influences like tv and internet without bereaving them of their benefits?
ReplyDeleteThanks Mr. Krishna Chaitanya for your appreciation. And welcome to my blog. I think, monitoring of the programs children watch on T.V. and sites they visit in the internet, can be used to achieve this balance. There is a lot of content which is inappropriate for the kids to watch. The parent`s discretion is the key factor here.
ReplyDeleteexcellent work sir!
ReplyDeleteథాంక్యూ సీత గారు. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు సంతోషంగా ఉంది.
ReplyDeleteThe article was exemplary Sir...
ReplyDeleteThank you Mooksevak garu.
ReplyDeleteచాలా బావుంది... :)
ReplyDeleteమీ కామెంటుకి ధన్యవాదాలు సంతుగారు. నా బ్లాగ్‌కి వీల్లున్నప్పుడు వచ్చి మీ అభిప్రాయాలని తెలియజేయండి.
ReplyDeleteChala baga rasaru, it's inspiring
ReplyDeleteధన్యవాదాలoడి.
ReplyDeleteసతీష్ గారూ! మీ బ్లాగు బాగుంది. లింకన్ ఉత్తరం నాటి ఉపాధ్యాయుడికి వ్రాసినా, నేటి తల్లితండ్రులకు దిక్సూచిగా ఉంది. మీరు ఔరంగజేబు ఆయన చిన్నప్పటి గురువుకు వ్రాసిన ఉత్తరం చదివే ఉంటారు. నా దగ్గర ఉండాలి. మీరు చదివి ఉండకపోతే చెప్పండి, వెతికి పంపిస్తాను.
ReplyDeleteరాజా. gksraja.blogspot.in
థాంక్యూ రాజా గారు. ఔరంగజేబు తన గురువుకి రాసిన ఉత్తరం నేను చదివిన జ్ఞాపకం లేదు.
Deleteచిన్నసవరణ. నా పేరు కిషోర్‌వర్మ - సతీష్‌కాదు.