Pages

Monday 10 December 2012

పట్టి తెచ్చానులే...



నేను తీసిన వాటిల్లో మంచివి....





రాజమండ్రీ ఇస్కాన్ మందిరందగ్గర మధ్యాహ్నం రెండుగంటల సమయంలో నీడలో చల్లగా ఉన్న నాచుపట్టిన ఫౌంటెన్ మీద పావురం. రెండు స్నాప్స్ తీసిన తరువాత ఆ చప్పుడుకి బెదిరి ఎగిరిపోయి దురంగా వాలింది. 







ముందురాత్రి వేటకి వెళ్ళివచ్చి, లంగరు వేసిఉన్న పడవలు. వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వార్తల్లో చెపుతున్నారు.ఎన్నో సార్లు చెప్పినప్పుడు తుఫాను రాలేదు, చెప్పకుండా వచ్చింది. ఈ రోజు మళ్ళీ వేటకి వెళ్ళడమా, లేదా? మత్యకారుల సంధిగ్దానికి గుర్తుగా తెల్లవారినా కడలిదారి పట్టని పడవలు.  







అరకు లోయలో. చలిపులిని ఆరిపోతున్న కాగడాతో దూరంగా ఉంచడానికి చివరిప్రయత్నం చేస్తున్న సాయంత్రపు సూర్యుడు. ఎప్పుడో పుష్కరం క్రిందట తీసిన ఫోటో. స్కాన్ చేసింది. మిగిలిన ఫోటోలంత క్లారిటీ ఉండదు. 





తిరుమల కొండల్లో:   
తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్ల నల్ల నంత నింత - నదిగో వారే
చల్లని తమ్మిరెకుల - సారసపుగన్నులు
మెల్ల మెల్లనె విచ్చి - మేలుకొనవేలయ్య 



© Dantuluri Kishore Varma 

4 comments:

  1. ఫోటోలు బాగున్నాయి

    ReplyDelete
  2. మీప్రోత్సాహానికి కృతజ్ఞతలు శర్మగారు.

    ReplyDelete
  3. మీ ప్రశంస ఆనందం కలిగించింది. మీకు నా బ్లాగుకి హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!