నూతన సంవత్సరపు బహుమతిలా సూర్యా న్యూస్ పేపర్లో `మనకాకినాడలో..` బ్లాగ్ గురించి పరిచయ వ్యాసం వచ్చింది. ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను.
వ్యాసంలో సందర్శకులకి బదులు అభిమానులని వచ్చింది. అలాగే - కూడలి, సమూహము, హారం, బ్లాగిల్లులతో పోటిపడుతున్నట్టు... అని వచ్చింది. `సభ్యత్వం కలిగి ఉంది` అని రాసి ఉండవలసింది. ఈ రోజు వరకూ ఉన్న 14,000 వేల పేజ్‌రివ్యూలలో ఎక్కువశాతం ఈ బ్లాగ్ ఆగ్రిగేటర్ల ద్వారా వచ్చిందే. రాస్తున్న టపాలని పాఠకుల ముంగిట్లోకి తీసుకు వెళుతున్న కూడలి, సమూహము, హారం, బ్లాగిల్లు మొదలైన ఆగ్రిగేటర్ల పాత్ర అమూల్యమైంది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండిబ్లాగర్ వల్ల దేశవ్యాప్త బ్లాగర్ల నెట్‌వర్క్‌లో మన బ్లాగుల్ని ప్రమోట్ చేసి, ఇంగ్లీష్లో బ్లాగులు రాస్తున్న తెలుగు వారికి కూడా అందుబాటులోనికి తీసుకువెళ్ళగలగడం ఒక మంచి అవకాశం.
* * *
సహబ్లాగర్లకి, పాఠకులకి, మిత్రులకి, ఆగ్రిగేటర్లకి... సర్వులకీ కొత్తసంవత్సరం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనకనకవస్తువాహనాలూ, కీర్తిప్రతిష్ఠలూ కలుగజేయాలని; నా బ్లాగ్‌కి మీ అందరి సహకారం, ఆశీస్సులు ఎప్పటిలాగే ఉండాలని కోరుకొటూ .....
© Dantuluri Kishore Varma
Congratulations Varma garu...!
ReplyDeleteThank you Murty garu.
ReplyDeleteHearty Congratulations
ReplyDeleteనా బ్లాగుకి మీకు స్వాగతం మురళీగారు. ధన్యవాదాలు.
ReplyDeleteఅభినందనలు. నేనుకూడా మీ అభిమానినయ్యాను. బ్లాగ్ ఏగ్రిగేటర్ తెరిస్తే మీ బ్లాగ్ కోసం చూస్తున్నాను ఈ మధ్య.
ReplyDeleteమీ కామెంటు మళ్ళీ చాలా కాలంతరువాత చూసి ఆనందమైంది తేజస్విగారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ReplyDeleteఅభినందనలండీ ( చాలా ఆలస్యంగా )
ReplyDeleteచాలా కాలానికి మళ్ళీ నా బ్లాగు వైపు తొంగిచూశారు లలితగారు, కదా?
ReplyDeleteహలో కిషోర్ గారు మీ సైట్ చాలా బాగుంది. చాలా సమాచారం ఉంది. కాకినాడ గొప్పతనాన్ని అందరికి తెలియచేస్తున్నారు.
ReplyDeleteRamakrishna, Janaspandana.com
ధన్యవాదాలు రామకృష్ణ గారు.
ReplyDelete