కాకినాడ బీచ్ రోడ్డులో శిల్పారామం పార్క్ ఈ రోజు ప్రారంభించారు. సుమారు ఒక పాతిక శిల్పాలవరకూ ఏర్పాటు చేశారు. ఈ రకమైన శిల్ప కళా పరిచయం కాకినాడ వాసులకి బహుశా మొట్ట మొదటిది. శిల్పాలలో నాజూకుతనం, చెక్కడంలో శిల్పుల అనుభవం కనిపిస్తున్నాయి. అన్నింటిలో ఒకటి చాలా ప్రత్యేకంగా ఉంది. దానిని ఆబ్స్‌ట్రాక్ట్ స్కల్‌ప్చర్ అనచ్చునేమో! ధీర్ఘచతురశ్రాకారంలో ఉన్న ఒక రాతిమీద మూడు కోణాల నుంచీ ప్రక్క భుజాలమీదకు సూర్యుడు, చంద్రుడు, ఒక వృక్షం చెక్కి; నాలుగవ కోణం అలా వదిలి పెట్టారు. బేస్‌లో కెరటాలు, జలచరాలు; చెట్టుకి పైన ఎగురుతున్న పక్షులు. రాతి పైన ఆకాశం వైపు చూస్తున్న వ్యక్తి ముఖం. ఈ శిల్పాన్ని చూస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎవరయినా ఈ థీం యొక్క తాత్పర్యం చెబితే బాగుండును. మీకు తెలిస్తే చెప్పరా, ప్లీజ్?
© Dantuluri Kishore Varma
శిల్పారామం మీ కాకినాడ లోనూ వెలిసిందా?
ReplyDeleteభలే, భలే!
ఫొటోలు కన్నుల పండువలా ఉన్నాయి.
ఇప్పుడు(January 11,12,13) కాకినాడలో బీచ్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఆ సందర్భంగా నిన్ననే ప్రారంభించారు చిన్ని ఆశ గారు.
ReplyDeleteGood photo session
ReplyDeleteThanks Sharma garu.
ReplyDelete