స్నేహితుడు విజయకృష్ణ కాకర్ల ఫోన్‌చేసి, సర్పవరం దగ్గర గంగరాజునగర్ నాలుగవ వీధిలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి రమ్మని పిలిచారు. ఈ రోజు తారకరామారావు గారి 17వ వర్ధంతి. తనకు తెలిసి రామారావుకి ఉన్న అభిమానుల్లో ఒక వ్యక్తిని పరిచయంచేస్తానని ఈ ఆహ్వానం యొక్క సారాంశం.
చంద్రమౌళి |
ఆయనపేరు పుచ్చకాయల చంద్రమౌళి. ఓఎన్‌జీసీ లో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం. ఇష్టం, అభిమానం, భక్తీ అన్నీ నటరత్న నందమూరి తారకరామారావు మీదే. రామారావు నటించిన సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటవిశ్వరూపాన్ని చూసి కురుక్షేత్ర సంగ్రామం సమయంలో కృష్ణుని విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందిన అర్జునుడిలా ఆనందపడిపోతూ ఆస్వాధించడం, ఆ మహానటుని డైలాగులు వింటూ మురళీగానాన్ని విన్న బృందావన వాసిలా తన్మయత్వం చెందడం ఈయన అభిరుచులు.
వీధిమొదటిలో రెండూ బై రెండు సైజులో ఎన్‌టీఆర్ బొమ్మలతో `నటరత్న కళామందిర్` పేరుతో దారిచూపించే బోర్డు కనిపించింది. చంద్రమౌళి గారి సొంత ఇల్లు తారకరామా నిలయం లో మొదటి రండు అంతస్తులూ స్వంతంగా వాడుకోవడానికి. ఇంటిలో ప్రతీ గదికీ రామారావు నటించిన సినిమాపేర్లు బడిపంతులు, గుడిగంటలు వగైరా ఉన్నాయి. రెండవ అంతస్తులో కట్టిన పెద్ద హాలు తన అభిమాన నటుడి కోసం. ఈ హాలు పేరే నటరత్న కళామందిరం.
హాలు ఎన్‌టీ్ఆర్ గుడిలా ఉంది. పాతకాలం వీడియో షాపుల్లోలాగ వాల్‌రేక్‌లో రామారావు నటించిన సినిమా డీవీడీలు, ఎదురుగా కప్‌బోర్డ్‌లో వందలకొద్దీ ఆడియో కేసెట్లు, ఎన్‌టీ్ఆర్ గురించి వచ్చిన పుస్తకాలు, కృష్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలలో ఉన్న నిలువెత్తు పోస్టర్లు, నాలుగు వైపులా గోడలమీద అతికించిన సుమారు 700 పాత్రలలో ఉన్న నటసార్వభౌమ చిత్రాలు, రామారావు చిత్రాలను ప్రదర్శించడానికి హోందియేటర్, మ్యూజిక్ సిస్టం లతో కళాత్మకంగా ఏర్పాటు చేసారు.
ఈ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణుల వివరాలు, పాటలు, ఆయా చిత్రాల నిర్మాణ విశేషాలను చంద్రమౌళికి కరతలామలకం. టాక్సి రాముడు, టైగర్ రాముడు, రాముని మించిన రాముడు లాంటి సినిమాల గురించి చాలామందికి తెలుసుకానీ, రామారావు నటించిన శృంగారరాముడు అనే అంతగా ప్రజాధరణ పొందని సినిమా డిస్కు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి పల్లెటూరిపిల్ల సినిమా డీవీడి కోసం నందమూరి బాలకృష్ణ అడిగి తీసుకొన్నారట. ఆడియో పాటల సేకరణకూడా ఇక్కడ ఉంది. చాలా అరుదైన పాటలు ఈయన దగ్గర ఉన్నాయి. ఘంటసాల తనయుడు రత్నకుమార్ కళామందిర్ చూసి, ఇక్కడ ఉన్న ఘంటసాల పాటల కలెక్షన్ గురించి ప్రశంసల జల్లు కురిపించారు. ఒకే హీరో నటించిన ఎక్కువ సినిమా ఒరిజినల్ డీ.వీ.డీ ల సేకరణలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి రికార్డుని చంద్రమౌళి పేరుమీద నమోదు చేశారు.
ఇంటరెస్టింగ్ హాబీ. కదూ?
© Dantuluri Kishore Varma
నిజమే. ఇంటరెస్టింగ్.
ReplyDeleteనిజమైన కళాభిమాని.
ReplyDeleteమా చిన్న తాతయ్య గారు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫాన్స్ అసోసియేషన్ స్థాపించారు...ఆయన కూడా ఎన్టీఆర్ చిత్రాలతో ఆల్బమ్స్ చేసి నందమూరి వారసులకు స్వయంగా అందజేశారు...వారి అబ్బాయి పేరు తారక రామారావు. ఇంటి నిండా ఆయన పంపిన చిత్రాలే కనిపిస్తాయి...ఆయన ప్రతి సంవత్సరం మే 28న విశాఖపట్నంలో NTR జయంతి ఉత్సవాలు చేసి విభిన్న పోటీలు పెట్టి బహుమతులు అందజేస్తుంటారు...(ఆయన పేరు k v sree raama murty...sub registrar గా రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో ఉన్నారు.)...మీ మిత్రునికి తెలిసే ఉంటుంది బహుశా...మంచి పోస్ట్...@శ్రీ
ReplyDeleteశిశిరగారు, చిన్ని ఆశగారు, మెచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteశ్రీగారు, వారి అబ్బాయికి కూడా రామారావుగారి పేరే పెట్టేసుకొన్నారా! ప్రాణంపెట్టే అభిమానులు ఉంటారండి.
anthuleni abhimanam ante idi
ReplyDeleteమీతో ఏకీభవిస్తున్నాను Aswatha Narayana గారు.
Delete