పెద్దపండగొస్తుంది
సంబరాలు తెస్తుంది
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం
చుట్టాలంతా వస్తారు
సరదా సందడి చేస్తారు
చక్కని ఆటలు ఆడుదాం
నచ్చిన పాటలు పాడుదాం
కొత బట్టలు కడదాం
పిండివంటలు తిందాం
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం
చుట్టాలంతా వస్తారు
సరదా సందడి చేస్తారు
చక్కని ఆటలు ఆడుదాం
నచ్చిన పాటలు పాడుదాం
కొత బట్టలు కడదాం
పిండివంటలు తిందాం
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం
బుడబుక్కలొస్తాడు
కొమ్మదాసరొస్తాడు
కొంత కొంత పంచుదాం
హాయిగా పంపుదాం
చిడతల శబ్ధం బాగుంది
తంబుర నాదం బాగుంది
అరిగరిగరిగో హరిదాసుగారు
ఎన్నో పాటలు పాడేస్తారు
చారెడుబియ్యం ఇచ్చేస్తేమరి
అంటారు వారు, "హరిలో రంగ హరి"
భం భం భం భం శంఖానాధం
భం భం భం భం శంఖానాధం
గణ గణ గణ గణ గంటల శబ్ధం
వింటున్నావా "శంభో శంకర!"
అతనే అతనే జంగం దేవర
డూ డూ డూ డూ బసవన్న
డూ డూ డూ డూ బసవన్న
చెప్పినవన్నీ చేస్తావా?
అమ్మగారికి దన్నంపెట్టి
అయ్యగారికి దన్నంపెట్టి
తోచినదేదో ఇచ్చేస్తే
చక్కా తీసుకుపోతావా?
పెద్దపండగొస్తుంది
పెద్దపండగొస్తుంది
సంబరాలు తెస్తుంది
భోగి మంటలేద్దాం
'గొబ్బియల్లో' పాడుదాం
భోగి మంటలేద్దాం
'గొబ్బియల్లో' పాడుదాం
చిన్నప్పుడు ఆ బసవన్న ఇచ్చే దీవనల కోసం పోటీ పడే వాళ్ళం ...నేను ఇస్తాను డబ్బులు ...నేను ఇస్తాను అంటూ...ముందస్తు శుభాకాంక్షలు...వర్మ గారూ!...
ReplyDeleteధన్యవాదాలు శ్రీగారు. `మన సంస్కృతి` లేబిల్‌తో ఇలా ఇంకా కొన్ని టపాలు పెడదామని పండుగకు చాలా ముందుగానే హడావుడి మొదలుపెట్టేశాను. మీకుకూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDelete