Pages

Friday, 14 March 2014

సైమాటిక్స్

సైమాటిక్స్(Cymatics) అనే ఒక శాస్త్రం గురించి మీకు తెలుసా? శబ్ధతరంగాలు ఏ రకమైన ఆకారాలు సృష్టంచగలవో తెలియజేసే సైన్స్ ఇది. హేన్స్ జెన్నీ(Hans Jenny) అనే స్విడ్జర్‌లాండ్ దేశస్తుడు ఈ శాస్త్రానికికి ఆద్యుడు. 1967వ సంవత్సరంలో సైమాటిక్స్ - ద స్టడీ ఆఫ్ వేవ్ ఫినామినా అనే గ్రంధాన్ని విడుదల చేశాడు. టోనోస్కోప్(Tonoscope) అనే ఒక పరికరాన్నీ తయారుచేశాడు. దీనినుంచి శబ్దాన్ని నిర్దుష్టమైన పౌన:పున్యంలో పంపవచ్చు.  దానిపైన మనం ఇళ్ళల్లో వాడే జల్లెడ చట్రం లాంటి పరికరాన్ని అమర్చేవాడు. ఈ చట్రంమీద మెత్తని పొడిని జల్లి, టోనో మీటర్ నుంచి శబ్దాన్ని పంపితే చక్కని డిజైన్లు ఏర్పడేవి.  వీడియో ఇక్కడ చూడండి. 
ఒకనీటి బిందువుని తీసుకొని దానికి దగ్గరగా ఓం అనే శబ్ధాన్ని వెలువరిస్తే, ఆ పౌన:పున్యానికి నీటిబిందువులోని కణాలు సంచలించి శ్రీచక్రపు ఆకారాన్ని ఏర్పరుస్తాయని ఎక్కడో చదివాను. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీని గురించి మరింత వివరణకోసం ప్రయత్నిస్తే అది కేవలం అపోహ అని, ధ్వని వల్ల పదార్దాలలో ఏర్పడే తరంగాలు కోణాలను ఏర్పరచలేవని, శ్రీచక్రంలో కోణాలు ఉంటాయి కనుక ఇది నిజంకాదని మరోచోట చదివాను. నిజానిజాలు ప్రక్కన పెడితే ఇది ఒక ఆసక్తికరమైన అంశమే!  

పైన ఇచ్చిన వీడియో లింక్ గమనిస్తే ధ్వని పదార్థాలయొక్క కణాలలో మార్పును తీసుకొని వస్తుందనేది నిజమే అని తెలుస్తుంది కదా? మనవేదాలలో చెప్పినట్టు ఓం అనే శబ్ధం నుంచి విశ్వం పుట్టింది అనే దానిలో నిజం ఉండి ఉండవచ్చు అని అనిపిస్తుంది. సినిమాలలో చూపిస్తూ ఉంటారు ఒక్కోసారి, పక్షవాతం వచ్చిన వాళ్ళదగ్గర పాటపాడితే వాళ్ళు లేచి నిలబడడం లాంటివి. శ్లోకాలు చదివితే వర్షం కురవడం గురించి విన్నాం. అలాగే వైద్యశాస్త్రంలో ధ్వనితరంగాలను ఉపయోగించి శరీరంలో కణజాలాల కదలికలలో మార్పులు చేస్తూ కొన్ని చికిత్సలు చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం సైమేటిక్సే!  హేన్స్ జెన్నీ చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే మనవాళ్ళకు దీనిగురించి తెలుసు! హౌ మార్వలెస్! 
© Dantuluri Kishore Varma 

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!