Google images |
కల్నల్ డి.ఎస్.రాజు గారు, డాక్టర్ ఎం.వీ.కృష్ణారావుగార్లు కోస్తాప్రాంతంలో విద్యార్థులకి వైద్యవిద్యని అందించే ఉద్దేశ్యంతో ఒక ప్రైవేట్ వైద్య కళాశాలని స్థాపించాలని అనుకొన్నారట. మెడికల్ కాలేజీని ప్రారంభించాలంటే చిన్నవిషయంకాదు. కాబట్టి విరాళాలు సేకరించారు. విరాళాలు ఇచ్చినవారిలో తణుకు వాస్తవ్యులు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు ఒకరు. ఆయన బావగారు రంగారావు అప్పటికే స్వర్గస్తులయ్యారు. ఆ రంగారావుగారి పేరుమీదే దీనికి రంగరాయా మెడికల్ కాలేజ్ అని పేరుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే గొప్పకాలేజీలలో ఇది ఒకటి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నీలంసంజీవరెడ్డిగారు 1958లో ప్రారంభోత్సవంచేశారు. 1977లో ప్రయివేట్ యాజమాన్యం నుంచి రంగరాయ మెడికల్ కాలేజీ ప్రభుత్వ కాలేజీగా మారింది.
కాలేజీ స్థాపించి 50సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో భారత తపాలా శాఖవారు రంగరాయ మెడికల్ కాలేజీ ఫస్ట్‌డే కవర్‌ను విడుదల చేశారు.
© Dantuluri Kishore Varma
1960 సంవత్సరప్రాంతంలో పదివేలు డొనేషన్ తో ఈ కాలేజిలో సీట్ వచ్చేది. నాటి రోజుల్లో అవే లేక చదవుకోలేక .....ఇలా మిగిలిపోయాం... జీవితంలో నష్టపోయామని మాత్రం అనుకోలేదు....:)
ReplyDeleteఅప్పట్లో పదివేలంటే ఎక్కువే కదండి మరి!? నష్టపోయాం అనుకోకపోవడమే మంచి దృక్పదానికి నిదర్శనం.
DeleteI am a Rangaraya graduate, Joined in 1960, Donation was Rs ^ 000 only, Fee is 1000 a year
ReplyDeleteమీరు రంగరాయా కాలేజ్ పూర్వవిద్యార్థి అన్నమాట :) అయితే మీరు కల్నల్ డి.ఎస్.రాజుగారిని, కృష్ణారావుగారినీ కలిసే ఉంటారు.
Delete