తిరుమలలో జరిగే నిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు మొదలైనవాటిని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుపుతారు. దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమశాష్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి. విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారట. తన శిష్యులు బృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులకు ఆగమశాస్త్రాన్ని ఉపదేశించారట. వారు దానిని ఎన్నో గ్రంధాల రూపంలో పొందుపరచారు. శ్రీ విఖనస మహర్షి ఆలయం తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఉత్తరదిక్కున ఉంది. చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో మహర్షి విగ్రహం ఉంటుంది. నలుగురు మహర్షులు కూడా ఉంటారు. ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీనిని సందర్శించండి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment