తిరుమల కొండమీద యాత్రికులకోసం దేవస్థానం ఉచిత బస్సులు నడుపుతుంది. వీటిని శ్రీవారి ధర్మరధాలు అని వ్యవహరిస్తారు. ప్రతీ పది, పదిహేను నిమిషాలకీ ఒక్కో బస్సు వస్తుంది. తిరుమల బస్‌స్టాండ్, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు, కాటేజీలు, సత్రాలు, రాంబగీచా గెస్ట్‌హౌస్, వైకుంఠం క్యూ లైను, మ్యూజియం, కళ్యాణకట్ట, సప్తగిరి సర్కిల్, నిత్యాన్నదానం బిల్డింగ్... ఇలా చాలా స్టాపుల్లో భక్తుల్ని ఎక్కించుకొని, దించుతూ ఉచిత బస్సులు వెళతాయి. రకరకాల ప్రదేశాల్లో వీటిని చూడడం చాలా బాగుంటుంది. పిక్చర్ పెర్ఫెక్ట్ అంటారు చూడండి అలా ఉంటాయి. సమయం ఉంటే తప్పనిసరిగా వీటిలో ప్రయాణించి తిరుమలకొండమీద ప్రదేశాలు చూడండం, జనాలని గమనించడం మిస్‌కావద్దు.
© Dantuluri Kishore Varma
వర్మ గారు...మిరు ఏమీ అనుకోనంటే మీపై నాకు గల complaint ఏమిటంటే..ఆంధ్రదేశం లో ని అనేక ప్రాంతాలపై చక్కని ఫోటోలతో చక్కని కధనాలు రాస్తున్నారు.ఇవన్నీ ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఇంగ్లీష్ బ్లాగు కనక ఓపెన్ చేసి రాస్తే ...ఎన్ని ప్రశంసలు ...వస్తాయో..ఎంత wider range of people కి అందుతాయో నేను ఊహించలేను.అంతకి మించి ప్రాంతానికీ ప్రీతిపాత్రులవుతారు. ఒక ప్రత్యేకత గా మిగులుతుంది.
ReplyDeleteనాకూ ఆ ఆలోచన ఉంది కానీ సమయాభావం వల్ల కుదరడంలేదు మూర్తిగారు. దేనికైనా టైంరావాలంటారు కదా! చూద్దాం నా ఇంగ్లీష్‌బ్లాగ్ మంచి టేక్ఆఫ్ తీసుకొంటుందేమో! మీ సూచనకు ధన్యవాదాలు.
Delete