తారా, చంద్రుల కథ విన్నారా ఎప్పుడైనా? చంద్రుడు మహా అందగాడు. విద్యను నేర్చుకోదలచి బృహస్పతి దగ్గర చేరాడు. బృహస్పతి భార్య తార. ఆమె యవ్వనవతి. తారా, చంద్రుల మధ్య అభిలషణీయం కాని బంధం ఏర్పడింది. చేసిన తప్పుకి చంద్రుడిని తన కళలు అన్నీ కోల్పోవలసిందిగా గురువుగారు శపించాడు. ప్రతీ శాపానికీ విమోచన మార్గం ఉన్నట్టుగానే దీనికీ ఉంది. దాని ప్రకారం దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కులా శివలింగాలను ప్రతిష్టించాడు చంద్రుడు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారని మీకు తెలుసుకదా? అందుకే అతను ప్రతిష్టించిన శివాలయాలను అష్టసోమేశ్వరాలయాలు అంటారు. అవి ఏఏ ఊళ్ళల్లో ఉన్నాయో ద్రాక్షారామం ఆలయంలో గోడమీద రాసి ఉంచారు.
ఈ టపాలో కోలంక శివాలయం ఫోటోలు ఇస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం దాటిన తరువాత కోలంక అనే ఊరు వస్తుంది. అక్కడే ఉంది పైన చెప్పిన ఎనిమిది వాటిలో ఒక సోమేశ్వరాలయం.
ఇంతకు ముందు ఈ బ్లాగులో రాసిన కొన్ని సోమేశ్వరాలయాల గురించి, ద్రాక్షారామం గురించి ఈ క్రింద చదవండి.
© Dantuluri Kishore Varma
When you give details of new places like these, please include details of bus or trains available to go to these places and from where. For example if you go to Bikkavolu from Rajamundry after 8:30 PM there will be no transportation available from that town back to RJY (My experience). So a family going on bus will have a lot of trouble overnight at Bikkavolu if they miss bus. Thanks
ReplyDeleteThanks for the suggestion. I will try my best to supply such information also whenever possible.
Delete