Pages

Tuesday 4 March 2014

నా ఓటయితే పుచ్చకాయకే!

ఎండ మండిపోతూ ఉంటే ...
రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళకి పుచ్చకాయల బళ్ళు ఒయాసిస్సుల్లా కనిపిస్తాయి.
 దాహంతో పిడచకట్టుకుపోయిన నాలుక పుచ్చకాయ ముక్కలు కావాలని గోలచేస్తుంది.
ఇంకొంచం ముందుకు వెళితే కూల్‌హోం ఏదో తగులుతుంది కోక్ తాగుదాం అనుకొంటారా?
పుచ్చకాయనే తింటారా?
కూల్‌డ్రింక్‌కి పోకుండా పుచ్చకాయ ముక్కలు తినడమే అన్నివిధాలా మంచిది.
ఎందుకంటే...
పుచ్చకాయ మొత్తం బరువులో నీరు 91 శాతం ఉంటుందట. చక్కెరశాతం ఆరు ఉంటుంది.
శరీరంలో నీరు తగ్గిపోయినప్పుడు పుచ్చకాయ దాని లోటును బర్తీ చేస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ సీలు ఉంటాయి.
విటమిన్ ఏ కంటిచూపుకి మంచిది.
విటమిన్ సీ రోగనిరోదకశక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.
టొమాటో లాంటి ఎర్రని పళ్ళలో ఉండే లైకొపీన్ అనే పోషకం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ మధ్యచేసిన పరిశోదనల్లో తేలిన విషయం ఏమిటంటే... 
మిగిలిన పళ్ళలో లేదా కాయగూరల్లో కంటే లైకొపీన్ పుచ్చకాయల్లో ఎక్కువగా లభిస్తుందని.
ఇంకా, పుచ్చకాయలో లభించే సిట్రులైన్ అనే అమీనో యాసిడ్ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిదట. 
పుచ్చకాయ కొన్ని రకాల కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందట.
బాగుంది కదా? 
ఒక్క ముక్క తింటే...
దాహం తీరడమే కాకుండా
బోనస్‌గా ఈ లాభాలు కూడా ఉన్నాయి. 
నా ఓటయితే పుచ్చకాయకే!
© Dantuluri Kishore Varma

2 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు రాధారావు గారు పుచ్చకాయకి మీ మద్దతు తెలియజేసినందుకు :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!