యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం ఊరిలోనుంచి ఎడమవైపుకి తిరిగి గోదావరి గట్టు ఎక్కేస్తే ... ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి. పల్లె పల్లె పచ్చాని పందిరి అన్నట్టు గట్టుకి ఓ వైపు గోదావరి, మరోవైపు పచ్చని చేలూ, చేలగట్లమీద వరసల్లో కొబ్బరిచెట్లూ.. వీటన్నింటికీ మించి ఆనందం కలిగించేది `మా వూరు వచ్చేస్తున్నాం` అన్న ఫీలింగు. ఇంతకీ మావూరి పేరు చెప్పలేదు కదూ? పిల్లంక.
ఊరంటే నా స్నేహితులూ, బందువులూ, నేను చదువుకొన్న స్కూలు, ఊరిలోనుంచి బయటకు వెళ్ళినా, తిరిగి వచ్చినా తప్పనిసరిగా హాయ్ చెప్పే గోదావరీ, గోదావరి మధ్యలో లంకలూ, కాలవగట్లమీద నడచి వెళ్ళడం, పంటుమీద, పడవలమీదా నది దాటడం గుర్తుకు వస్తాయి.
శేఖర్ కమ్ముల, వంశీ, బాపు... సెల్యులాయిడ్ మీద చూపించిన దానికంటే పిల్లంకలో గోదావరి బాగుంటుంది.
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఒక్కటే కాదు, పిల్లంక కూడా.
పిల్లంక కాలువ గట్టు. నా చిన్నప్పుడు మా ఊరికి బస్సు ఉండేది కాదు. ఇంజరం వంతెన వరకూ నావలమీద వెళ్ళి బస్సు ఎక్కేవాళ్ళం. కాలువలో నావమీద ప్రయాణం ఒక ప్లజంట్ మెమొరీ. తరువాత, హై స్కూల్ కి నడచి ఈ దారి వెంటే వెళ్ళేవాళ్ళం. మధ్యలో మామిడి కాయలు, చింతకాయలు.... గోల్డెన్ డేస్.
గోపాలస్వామి గుడి ఉంది. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ శిధిలావస్థకి వచ్చేసింది. అందరం చూసి బాధపడటమే కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు.
రెండుసంవత్సరాల క్రితం నా కజిన్ సతీష్ పిల్లంక పేరుమీద ఫేస్‌బుక్ గ్రూప్ ప్రారంభించాడు. ఎవరో గుడి అవస్థ గురించి ఒక పోస్ట్ పెట్టారు. సభ్యులందరూ తక్షణం స్పందించారు. విరాళాలు పోగయ్యాయి. సంవత్సరం తిరిగేసరికి గుడి మరామత్తులు జరిగిపోయాయి. గుడికి చేర్చి కళ్యాణమండపం నిర్మించారు, రంగులు వేశారు. ఇప్పుడు మా వేణుగోపాలస్వామి వెలిగిపోతున్నాడు.
మావూరి యూత్ ఉంది.
ప్రతీసంవత్సరం పెద్దపండగకి సభ్యులు అంతాకలిసి గెట్‌టుగెదర్ ఏర్పాటు చేస్తారు. ముందటేడు ఊరి ఆడబడుచులని కూడా పిలవాలని మంచి ఆలోచన వచ్చింది ఓ బుర్రలోకి. ఇంకేముంది ఆ ఏడాది పండుగకీ, మళ్ళీ ఈ పండుగకీ అంతా వచ్చి కలిశారు. ఊరంతా సందడే సందడి. కేరింతలతో, తుళ్ళింతలతో, ఆటల పాటలతో మారు మోగిపోయింది.
గోదావరికి, వేణుగోపాలస్వామికి, పిల్లంకయూత్‌కి, ఫేస్‌బుక్‌గ్రూపుకి, హోల్‌మొత్తంగా మావూరికి జై!
© Dantuluri Subha
Nice pics
ReplyDeleteThank you very much Gayatri garu :)
Delete
ReplyDeleteఫేస్ బుక్ కి ఇంత పవర్ ఉందన్న మాటండీ !
గోపాలుడికి గుడి కట్టించిన వైనం బాగు బాగు !
శుభాకాంక్షల తో
జిలేబి
ఫేస్‌బుక్ కి జై కొట్టవలసిన విషయమేనండి ఇది. మీకు ధన్యవాదాలు. :)
Deleteజిలేబిగారి మాటే నామాట!
ReplyDeleteజై ఫేస్‌బుక్
ధ్యన్యవాదాలు తేజశ్విగారు :)
Deleteమీ ఊరి ముచ్చట్లు, చిత్రాలు బావున్నాయండీ!మీఊరి ప్రజల ఐకమత్యం ఇంకా బాగుంది .
ReplyDeleteథాంక్యూ వెరీమచ్ నాగరాణి గారు :)
Deleteస్ఫూర్తి మయము ... బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు ప్రసాదరావుగారు :)
DeleteMy Grandmother house located in Pillanka only.
ReplyDeleteమీ పేరు ఏమిటో చెప్పండి. బహుశా నాకు తెలిసి ఉండవచ్చు.
Deletenice post
ReplyDeleteథాంక్యూ ఆనంద్. మీకు నచ్చినందుకు సంతోషం.
Deleteమీ ఊరు ,ఫొటోలూ బావున్నాయండి .ఇప్పటి కుర్రకారు తలుచుకోవాలి కానీ ఎంతసేపండి
ReplyDeleteనిజమేనండి. యూత్ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమమే ఇది. గుడినిర్మాణం చాలా వేగంగా జరిగింది. ధన్యవాదాలు.
Deleteమళ్ళోసారి పిల్లంకెళ్ళాలి.
ReplyDelete------------------------------
పిల్లంకకి ఈ ప్రక్క బ్రహ్మపురి ఉంటుంది.మేమంతా పిల్లంక హైస్కూల్ కి బల్లకట్టు దాటి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బల్లకట్టు దగ్గరే పద్దయ్య ఉండేవాడు. ఆ పద్దయ్యనావమీదే అంతా ఇంజరం వంతెనవరకూ వెళ్లి బస్సెక్కేవారు.బల్లకట్తు దిగ్గానే ఓ గుడి ఉండేది. బహుశా మీరు చెప్పిన గుడి అదే అయి ఉంటుంది. కాలవగట్తు వెంట నడుచుకుంటూ వెళితే రాజుగారి తొట ఇల్లు ఉండేది. పేరు గుర్తు రావడం లేదు.( వేగేశ్న సుబ్బరాజు అవునా/కాదా? ఏమో ) అక్కడ బొల్డు బాదం చెట్లు ఉండేవి. నేను ఒ బాదం మొక్కని తీసుకెళ్ళి బ్రహ్మపురిలోని మా తోటలొ పాతాను. నేను పిల్లంక హైస్కూల్ లో 7 వ తరగతి చదివాను. అప్పుడు మా ఎగ్జాం సెంటర్ కోలంక హైస్కూల్ లో ఉండేది. పిల్లంక హైస్కూల్ లో గాంధీ మేస్టారు ఉండేవారు. అయన హిందీ చెప్పేవారు. తొక్క తీసేవారు. ఆయన భయంతో నైనా బాగుపడతానని మా బావాజ్జీ నన్ను రామచంద్రపురం నుంచి తెచ్చి మరీ పిల్లంక హైస్కూల్లో పడెసారు. ఆరోజుల్లో బస్సులే కాదు కరంటు కూడా ఉండేది కాదు. పిల్లంక హైస్కూల్లో సూర్యనారాయణమూర్తి మేస్టారు కూడా ఉండేవారు. అప్పట్లో హెడ్మాస్టర్ పేరు ఆంజనేయులుగారు. అప్పట్లో కోలంకలో ' క్రాంతీ అనే సినిమా షూటింగ్ జరిగింది. ఈ హెడ్మాష్టర్ అందులో నటించినట్లు గుర్తు. అ సినిమా రిలీజ్ అవ్వలేదనుకుంటా. అప్పట్లొ మ క్లాస్ మేట్స్ పేర్లు ప్రక్కి వెంకటెశ్వర్లు,మండ సత్యన్నారాయణ మూర్తి, ఆచార్యులు గారని ఓ ఆర్ .యం.పి.డాక్టర్ ఉండేవారు. వాళ్లబ్బాయి. మణి గాడు అని స్కూల్ ప్రక్క ఇంట్లొ ఉండేవాడు. వాళ్ల కజిన్ గోపులంక నించి వచ్చేవాడు. ఇప్పుడు అ స్కూల్ ఉందా? ఎలా ఉంది? మీరు అదే స్కూల్లో చదివారా? పాతికేళ్ళు వెనక్కి తీసుకు పోయారు మీ పోస్ట్ తో.శుభగారికి ధన్యవాదాలు
వర్మ
జిల్లా ఇన్ చార్జ్
టివి.9
పొన్ : 95502 97789.
vaarmaa@yaahoo.co.in
గోదావరికి, వేణుగోపాలస్వామికి, పిల్లంకయూత్‌కి, ఫేస్‌బుక్‌గ్రూపుకి, హోల్‌మొత్తంగా పిల్లంకకి జై! బాగుందండి. స్పూర్తిదాయకమైన టపా.
ReplyDelete