ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములకంటే కూడా స్నేహితులుగా కలిసిమెలిసి ఉండే రకం వాళ్ళు. చదువులు పూర్తయిన తరువాత వేరే, వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకరిని ఒకరు బాగా మిస్సవుతున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ఆయనకి కొంచం మందు సరదా ఉంది. రోజూ సాయంత్రం బారుకెళ్ళి మూడు పెగ్గులు ఒకేసారి ఆర్డరిచ్చి, చక్కగా చీర్స్ చెప్పేసుకొని మూడూ గొంతులో పోసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. `ఏమండీ, మూడు ఒకేసారి ఏమిటి?` అని ఎవరయినా కుతూహలం కొద్దీ అడిగితే, `దూరంగా ఉన్న ఇద్దరు సోదరులతో కలసి పుచ్చుకోవడం కుదరదు కనుక, వాళ్ళ బదులు కూడా నేనే లాగించేస్తున్నా. ఇదిగో ఈ పెగ్గు మా అన్నయ్యది, ఇది మా తమ్ముడిది, ఈ మూడోది నాది,` అని చెప్పేవాడు. రోజూ చూసేవాళ్ళకి అది అలవాటయిపోయింది. కొన్నిరోజులు అలా గడిచిన తరువాత ఒకసారి ఆ పెద్దమనిషి పది రోజులు పాటు బారుకి రావడం మానేసాడు.
తిరిగి వస్తూనే కొంచం నీరసంగా కనిపించాడు. గెడ్డం మాసిపోయి ఉంది. రెండు పెగ్గులకే ఆర్డరిచ్చాడు. చూస్తున్నవాళ్ళకి గుండె పట్టేసినట్టు అయ్యింది. ఉత్సాహంగా చీర్స్ చెప్పుకొనే ఆయన కళ్ళల్లో ఆరోజు ఎందుకో విషాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమయ్యి ఉంటుందో సులభంగానే ఊహించగలిగారు. నెమ్మదిగా లేచి అతని దగ్గరకి వెళ్ళారు. భుజం మీద ఓదార్పుగా చేతులు వేసి, `బాధపడకండి, మీ సోదరుడికి అకస్మాత్తుగా అలా అవ్వడం చాలా విచారించవలసిన విషయం,` అని ముక్త కంఠంతో సంతాపాన్ని తెలియజేసారు.
వింటున్నాయన ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు, `భలే మనుషులండీ మీరు. మావాళ్ళ కేమీ అవ్వలేదు. కష్టమంతా నాదే! ఇప్పుడే ఫోనులో మాట్లాడి వస్తున్నాను. ప్రొద్దుట, మద్యాహ్నం, సాయంత్రం సుబ్బరంగా లాగించారట. నేనే ఉపవాసం ఈ రోజు. సాంప్రదాయాలని గౌరవించాలి కదా? అందుకే నాది మానేసి, వాళ్ళ మటుకే రెండు తెప్పించుకొన్నాను,` అన్నాడు తాపీగా.
(ఎవరో చెప్పారు దీనిని. కొంచం కథనం జోడించి సరదాకి ఇలా...)
© Dantuluri Kishore Varma
ha ha......... bagundi..... :)
ReplyDeleteకృస్ణ చైతన్య, చాలా కాలానికి వచ్చారు. థాంక్స్!
ReplyDelete:)
ReplyDeleteశిశిర గారు :) .
ReplyDelete:) Nice..
ReplyDeleteధన్యవాదాలండి!
Deleteచక్కని హాస్యం. కార్తీక మాసం .ఉపవాసాలకు ప్రాముఖ్యత నిచ్చే మాసం!!!
ReplyDeleteమీరు మెచ్చినందుకు సంతోషం ఇందిరగారు. అప్పుడప్పుడు ఇలాంటి హాస్యం కూడా ఉండాలి కదండీ!
Deletelol
ReplyDelete:)
Delete