`ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ అంతిమంగా సముద్రాన్ని చేరినట్టు, రకరకాల మార్గాలని అనుసరించే మానవులందరూ నన్నేచేరతారు. ఉద్దేశ్యాలు ఏమయినా దారులన్నీ నాలో కలుస్తాయి,` అని భగవధ్గీతలో శ్లోకాలని ఉదహరిస్తూ సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో వాల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామీ వివేకానంద చేసిన ఉపన్యాసం ఆలోచనలని రేకెత్తించేదిగా ఉంటుంది.
ప్రపంచానికి సహనం, సౌభ్రాతృత్వం గురించి చెప్పిన దేశం మనదని సోదాహరణంగా చెప్పినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మనుషులు పరస్పర వైరుద్యాలతో, మత మౌడ్యంతో రక్తపాతాన్ని సృష్టించుకోకుండా ఉండి ఉంటే మానవ నాగరికత ఇంకా ముందుకు వెళ్ళిఉండేదని చారిత్రక తప్పిదాలని ఎత్తి చూపిస్తాడు.
దారులు వేరైనా ఒకే గమ్యం కోసం ప్రయాణిస్తున్న మనుష్యుల మధ్య వైరుధ్య భావనలకి అప్పటి సభలు చరమగీతం కావాలని అభిలషిస్తాడు.
విశాల దృక్పదంతో చూస్తే వివేకానందుని మాటల్లో సత్యం, విచక్షణ అవగతమౌతాయి.
1995లో ఒక స్నేహితుడు రాజమండ్రీ వెళుతుంటే అతని చేతికి నూటడబ్బై అయిదు రూపాయలు ఇచ్చి రామకృష్ణా మఠం నుంచి `ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామీ వివేకానంద` అనే ఎనిమిది వాల్యూముల సెట్‌ని తెప్పించుకొన్నాను. అప్పుడప్పుడూ ఒక్కో పుస్తకం తీసుకొని ఒకటో, రెండో చాప్టర్లు చదవడం, ఆ పుస్తకాన్ని ప్రక్కన పెట్టడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అక్కడక్కడా కొంచెం, కొంచెంగా చదవడం తప్పించి పూర్తి చెయ్యలేక పోయాను.
ఆన్ లైన్‌లో ఉన్న స్వామీ వివేకానంద కంప్లీట్ వర్క్స్ యొక్క లింక్ ఇదిగో.
ఎప్పటినుంచో నాకు అర్థమైన స్వామీవివేకానంద భోదనల గురించి వ్రాయాలని అనుకొంటూ ఉన్నాను. నెలకి ఒకటో రెండో పోస్టులు ఆరకంగా రాయాలని ఒక ప్రణాళిక చేసుకొంటే చదవాలనే నిబద్ధత కలుగుతుంది. అది ఒక ఉపయోగం. చదవడం కోసం చదవడం కాదు కనుక, దాని గురించి రాయాలనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక అధ్యాయనంలాగ జరుగుతుంది. దీనివల్ల నాకున్న చాలా సందేహాలలో కొన్నింటికి సమాదానం దొరకవచ్చు. నేను చెయ్యాలనుకొనేది ఆయన రచనలకి, గీతమీద వ్యాఖ్యానాలకీ అనువాదాలు కాదు. ఒక రివ్యూ లాంటి నా స్పందన మాత్రమే.
నా బ్లాగ్‌ని చదివేవారిలో పెద్దవారు, విజ్ఞులు ఉన్నారు. ఎప్పుడయినా వారి విజ్ఞాన సంపద నాకు ఉపయోగ పడుతుందని వారు భావిస్తే, వ్యాఖ్యల రూపంలో అందిస్తారని అనుకొంటున్నాను.
© Dantuluri Kishore Varma
His quote
ReplyDelete"If I want to be a robber, I rob the King's treasury. If I want to be a hunter I hunt the Rhino. What is the use of hunting ants and robbing beggars? So if you want to love, love God........... Swami Vivekananda"
అస్తు
ReplyDeleteThanks DG garu for the quote above. And if we want to get inspired we should read Vivekananda`s works, shouldn`t we?
ReplyDeleteధన్యవాదాలు శర్మగారు.
ReplyDeleteవివెకానంద స్వామి గురించిన మీ పోస్ట్ ని చూసి ఇది రాయకుండా వుండలేకపోతున్నాను.ముందుగా మీకు నా శుభాబినందనలు.అసలు అనేకసార్లు ఆయన గూర్చి రాయాలనుకుని ఎందుకో విరమించుకున్నాను.ఆయన గురించి రాయాలనుకుని కూర్చుంటే ఎక్కడనుంచి మొదలు పెట్టాలో ..యే సంఘటనలు వదిలివేయాలో..యేది చెప్పాలో ...అర్ధం కాక ...ముప్పిరిగొన్న భావనలు అంటారే అలాగన్న మాట..!
ReplyDeleteవివేకానందుని వుపన్యాసాలు...వుత్తరాలు....సంభాషణలు...ఇంకా ఆయనపైన వారి ప్రత్యక్ష శిష్యులు రాసినవి అన్ని చదివినాక నేను గొప్ప ఆశ్చ్యర్యానికి లోనయ్యి ఇంకా తేరుకోలేదు. తేరుకోలేనేమో కూడా..!ఎందుకంటే ఇప్పటికి ఆయన లోని అనేక పార్ష్వాల్ని మన దేశం అర్ధం చేసుకోలేదు.ఆయన భారతీయత లోని గొప్ప లక్షణాలని ఎంత ప్రేమించాడో అదే విధంగా పాశ్చ్యాత్యులలోని గొప్ప లక్షణాలని ప్రేమించాడు.అంతకు మించి వేదాంతం అంటే అదేదో అరణ్యాల్లో వుండే తాపసులకి మాత్రమే సంభందించింది అనే బ్ర్హాంతి నుంచి ఆయన బయటికి తెచ్చారని నిస్సందేహంగా చెప్పాలి.
"Be fearless" (అభిహి) వేదాంతంలోని "essence" ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే..! బలహీనులు చేసిన వ్యాఖ్యానాలు దేఅశాన్ని బలహీనం గాక యేమి చేస్తాయి..?వుపనిషత్తుల సారాన్ని సామాన్యుడికి అందించడంలో మనం విఫలమయ్యాము ..అందుకే ప్రపంచంలోని ప్రతి పనికిరాని జాతికి ఆర్యపుత్రులమైన మనం బానిసలమైనాము.ఇంత సాహసోపేతమైన మాటలు యెవరు చెప్పగలరు ఆయన తప్ప..!
కేవలం మాటల్లోనే కాదు ..చేతల్లో కూడా ఆయన యేది చెప్పారో అదే చేసేవారు.ప్ర్రతి రోజూ dumbels తో వ్యాయామం చేసేవారు...మల్ల యుద్ధం చేసే వారు.ఒకానొక సందర్భంలో స్వామిజి అమెరికన్ మిత్రులతో కలిసి beef కూడా తినడం జరిగింది.మాంస భక్షణ చేయడం గుర్చి ఒక శిష్యుడు అడిగినప్పుడు ఇలా అంటారు....నువ్వు జీవిత సమరంలో యోధునిగా వుండదలచుకుంటే మాంస భక్షణ చేయవలసిందే.. శాఖాహారులైన యే జాతి ఇంతవరకు ప్రపంచ విజేతలుగా నిలువలేదు అని సమాధానమిస్తారు..!ఇలాంటి ఎన్నో వుదాహరణలు ఆయన జీవితంలో వున్నాయి.
స్వామిజీ ఆంగ్లం చాలా unique గా వుంటుంది..ఆయన మాటల్లోనుంచి ఒక్క పదం తొలగించినా ఇది వివేకానందుని వాక్యం కాదు అని గుర్తించవచ్చు.ఆయనలో ఒక మార్మికుడు,తపస్వి,కవి,దేశ మరియు ప్రపంచ మానవుడు ఇలా ఎన్నో కోణాలు వున్నాయి...అవి చెప్పాలంటే...నాతరం కాదు. కొన్ని ఆయన జీవితంలోని సంఘటనలని పరిశీలిస్తే అనేక సిద్దులని వశపరచుకున్న మహా పురుషునిగా నాకు అనిపించింది.అయితే వాటిని ఆయన యెక్కువగా ఎవరితోనూ పాలుపంచుకోలేదు..పైపెచ్చు ప్రోత్సహించలేదని చెప్పాలి.
అమెరికా లోని సత్రం(lodge) లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న కి సమాధానమిస్తూ తాను "క్షత్రియుడి" నని చెబుతారు.అయితే అనేక పుస్తకాల్లో స్వామిజీ ని విప్రుని గా సంభావించడం చూశాను.వారు జన్మించిన కాయస్థ కులం మనదగ్గర నియోగులకి దగ్గరగా వుండే వర్గం గా చెప్పాలి.మన పిచ్చి గాని అలాంటి ఆ మహా యుగ పురుషుణ్ణి కులంలో బందించాలని అనుకుంటే అంతకంటే వెర్రితనం ఇంకొకటి వుండదు.
My heartfelt salute to you varma garu..!
చాలా బాగుంది సర్. ఒక చిన్న అనుమానం. ఇక్కడ Lodge అంటే సత్రమేనా???
Deleteమూర్తిగారూ, మీ వ్యాఖ్య చదువుతుంటే వివేకానందుని గురించి మీరు ఎంత ఎక్కువగా చదివారో అర్థమౌతుంది. మీ విద్వత్తుముంది నేను చదివిన నాలుగు ముక్కలూ సూర్యుడి ముందు దివిటీలా వెల వెలబోతాయని పిస్తుంది. కానీ, ఇంకొక ధైర్యం కూడా కలుగుతుంది. మిమ్మల్ని, ఇక్కడ మరొక కామెంటు రాసిన డీజీ గారిని నా సందేహ నివృత్తి కోసం సంప్రదించవచ్చు కదా? మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteవర్మ గారు...మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు...!
ReplyDeleteVarma garu, chala rojula taruvatha oka manchi blog chusanu ane feeling kalipincharu. we respect you sir.
ReplyDeleteరాజ్‌కుమార్ గారు, మీ ప్రశంసాపూర్వక వ్యాఖ్య చూసి చాలా ఆనందంగా ఉంది. మీకు నా బ్లాగ్‌కి హృదయపూర్వక స్వాగతం.
ReplyDelete