కాకినాడకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురంలో పాండవుల మెట్ట ఉంది. మెట్ట అంటే ఒక చిన్నికొండ. పాండవులు మాయా జ్యూదంలో ఓడిన తరువాత, అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ కొండమీద కొన్నిరోజులు ఉన్నారని చెపుతారు.
కొండపైకి సుమారు వంద మెట్లు ఉన్నాయి. వాహనాలమీద వెళ్ళేవారు కొంత ఎత్త్తు వరకూ కొండపైకి వేసిన కంకర రోడ్డు ద్వారా వెళ్ళ వచ్చు. అక్కడినుంచి కేవలం ఇరవై, ముప్పై మెట్లు ఎక్కి పైకి చేరుకోవచ్చు.
కొండమీద ప్రధానమైన ఆకర్షణ సహజంగా ఏర్పడ్డ గుహ. ఇక్కడినుంచి రాజమండ్రీ గోదావరి నది వరకూ సొరంగ మార్గం ఉందని చెపుతారు. రోజూ పాండవులు ఈ మార్గంద్వారానే నదీ స్నానానికి వెళ్ళేవారట! అన్నట్టు, పెద్దాపురం నుంచి రాజమండ్రీ 45కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహనిండా గబ్బిలాల వాసన. కొన్ని అడుగులు దాటి ముందుకు పోలేం ఇప్పుడు మనం.
1952లో నిర్మించిన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో దీనితోపాటు శివాలయం, విష్ణాలయం, చంద్రాలయం లాంటి మరికొన్ని ఉపదేవాలయాలు ఉన్నయి.
దేవాలయానికి వెనుకవైపు ఒక రాయి పైన భీముని పాదాలు, గధ ముద్రలు ఉన్నాయి.
పాండవులమెట్ట మీదనుంచు క్రిందికి చూస్తే అందమైన ప్రకృతి దృశ్యాలు, కొండదారులు, బొమ్మల్లా కదిలిపోయే సమీపంలో రోడ్డుమీద మనుష్యులు, వాహనాలు, కనువిందు చేస్తాయి.
© Dantuluri Kishore Varma
వర్మ గారు,
ReplyDeleteఎప్పుడు మెట్ట ముందునుంచి వెళిపోవడమే తప్పించి పైకి ఎక్కలేదు, ఆ కొరత తీర్చారు.
vaadrevu chinaveerabhadrudu gaaru oka kavita kooda raasaaru deenipai.
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం శర్మగారు. ఈ సారి ఇటువైపు వచ్చినప్పుడు చూడండి.
ReplyDeleteనాయుడు గారు నా బ్లాగుకి మీకు స్వాగతం. ఆయన రాసిన కవిత ఏమిటో తెలియజేయండి అవకాశం ఉంటే.
ReplyDeleteidi maa college daggare undi.......... inko bheemudi paadam maa college venakala konda meeda undi........... adi chaala mandiki teliyadu........... :)
ReplyDeleteఅవునా? ఆ విషయం నిజంగానే ఎవరికీ తెలియదు.
ReplyDelete