సృష్ఠికి మూలం తల్లి. ఈ భావననే దేవతగా కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపల్లెకీ దేవతలు ఉంటారు. వీరిని గ్రామదేవతలు అంటారు. సత్తెమ్మతల్లి, నూకాలమ్మతల్లి, గంగమ్మతల్లి, మరిడమతల్లి.. అని గ్రామగ్రామానికీ ఒక్కో పేరుతో వ్యవహరించినా, ఆదిపరాశక్తి ఒక్కటే! గ్రామదేవత శతృవులనుంచి, దుష్టశక్తులనుంచి, రోగాలనుంచి రక్షిస్తుందనీ; చెడ్డవాళ్ళను శిక్షిస్తుందనీ గ్రామస్తులు నమ్ముతారు. ప్రతిసంవత్సరం గ్రామదేవత పేరుమీద జాతరలు చేస్తారు. రోడ్ల ప్రక్కన ఒక చెట్టుకిందో, చిన్న గుడిలోనో నిలిపిన దేవతని ఆ రోడ్డు వెంట వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా వాహనాలు నిలిపి, దణ్ణం పెట్టుకొని ప్రయాణం సక్రమంగా జరగాలని కోరుకొంటారు.
ఈ ఫోటోలో ఉన్న గుడి ఏ ఊరిలోదో ఖచ్చితంగా చెప్పలేనుగానీ - కాకినాడనుంచి రాజమండ్రీ వెళ్ళే కెనాల్ రోడ్డులో ద్వారపూడికీ, కడియానికి మధ్యలో (కేశవరం) ఉంటుంది.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment