సన్నిహితులకి ఎలాంటి బహుమతులు ఇవ్వాలనేది ఎవరైనా నాకు చెబితే బాగుణ్ణు. పుట్టినరోజో, పెళ్ళిరోజో, గృహప్రవేశమో, పెళ్ళో, మరింకేదయినా శుభకార్యమో జరిగినప్పుడు వాళ్ళకి ఏమివ్వాలి? `ప్రేమా, అభిమానం, హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తే చాలవా, అవి ఎంతటి వెలకట్టలేని విషయాలు?` అని క్లాసు పీక్కండి. `నువ్వంటే నాకు చాలా ఇష్టంరా కన్నా,` అని తల్లి, పిల్లోడిని ముద్దుచేస్తే దానికంటే మించింది లేదు. కానీ, దానితో పాటు ఒక చాక్లేట్ ఇస్తే ఆ కుర్రోడికి అమ్మప్రేమ ఇంకా బాగా అర్థమౌతుంది.
చాక్లేట్లకే ఆనంద పడిపోయే చిన్నవయసు పిల్లలకి గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా సులభం. ఇక్కడ సులభం అనే మాట బహుమతికి ఖర్చు పెట్టే డబ్బులకి సంబంధించినది కాదు. తీసుకొనేవాళ్ళ కళ్ళల్లో కనిపించే మెరుపుకి సంబంధించింది. వయసుపెరిగే కొలదీ పిల్లలమీద ప్రపంచం చూపించే ఆకర్షణల ప్రభావం పెరుగుతుంది. విష్‌లిష్ట్‌లో చెప్పలేనన్ని వస్తువులు ఉంటాయి. రోజురోజుకీ ఇష్టాలు మారతాయి. పాత వస్తువులు పోయి, లిస్టులోనికి కొత్తవి వచ్చి చేరతాయి. వాళ్ళకి ఏమికావాలో తెలుసుకోలేం, వాళ్ళు చెప్పలేరు. చెప్పినా చాలామటుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనం ఎంతో ఉపయోగకరమైనదని భావించి ఏదో బహుమతి వాళ్ళకిస్తే, తీసుకొన్నవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్‌కీ చేరుకోలేక నిరుత్సాహం కలిగించవచ్చు. అప్పుడు, కళ్ళల్లో మెరుపులుండవు. ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్‌కి వాళ్ళనాన్న ఒక సైకిల్ కొనిపెట్టాడట. అదిచూసి ఫోర్డ్‌కి చాలా అనందం అయిపోయింది. పిల్లోడి కళ్ళల్లో మెరుపు చూసి తండ్రికి పరమానందం అయ్యింది. ఇచ్చినవాళ్ళకీ, పుచ్చుకొన్నవాళ్ళకీ తృప్తి కలిగించేదే అసలైన బహుమతి. ఒకాయన అంటాడు, `నువ్వు ఏమిటనేది దేవుడు నీకిచ్చిన బహుమతి, నువ్వు ఏమి అవుతావు అనేది నువ్వు దేవుడికి ఇచ్చే బహుమతి,` అని అలాంటివి జీవితకాలంలో కొన్నిసార్లే ఇవ్వగలమేమో, లేదా తీసుకోగలమేమో!
ఫాధర్స్‌డేకి, టీచర్స్‌డేకి, పుట్టిన రోజుకి, పెళ్ళిరోజుకి... ఇలా ప్రతీ ముఖ్యమైన సందర్భంలోనూ మా చిన్న అమ్మాయి సుమిత్ర వర్షిత రఫ్‌నోట్‌బుక్ లోనుంచి చింపిన కాగితమ్మీద పెన్సిల్‌తోనో, పెన్‌తోనో, వాటర్‌కలర్స్‌తోనో తనకి నచ్చిన బొమ్మ గీసి, శుభాకాంక్షలతోపాటూ `ఐ లవ్ యూ డాడీ` అని రాసి ఇస్తుంది. ఇల్లు, కొండలు, చోటాభీం, ఫిష్, కార్.. ఇలా బొమ్మ ఏదయినా కావచ్చు, కాగితం అంచులు సరిగా ఉండక పోవచ్చు, రాసిన శుభాకాంక్షల్లో తప్పులుండవచ్చు.. కానీ, నా ఉద్దేశంలో అవన్నీ చాలా విలువైనవి. మనం తిరిగి ఇవ్వగలిగినవి ఏదయినా ఉందీ అంటే అది ఇచ్చినవాటిని సరిగ్గా తీసుకోవడమే! కళ్ళల్లో మెరుపులు దాచుకోకూడదు.
రేపు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రోజు సరైన బహుమతికోసం వెతకడం మొదలు పెడతాం. లేదా ఒక్కోసారి అదేరోజు ఊరిమీద పడతాం. ఆలోచించే అంత సమయం దొరకదు. ఏదికొందామన్నా తృప్తి ఉండదు. సరిగ్గా అప్పుడు అనిపిస్తుంది, `ఎలాంటి బహుమతులు ఇవ్వాలనేది ఎవరైనా నాకు చెబితే బాగుణ్ణు` అని.
రేపు మా పెద్ద అమ్మాయి శ్రావ్యపూర్ణిమ బర్త్‌డే. ఊరంతా తిరిగాం మంచి గిఫ్ట్‌కోసం. ఇంటికి తిరిగి వచ్చాకా, `అమ్మా, బావజ్జీ(డాడీ) ఏమి కొన్నారు?` అని ఆతృతగా అడిగింది. `మంచివేమీ దొరకలేదు. హెయిర్ బ్యాండ్స్, నెయిల్ ఆర్ట్, చాకోలేట్స్.. లాంటివి అడిగావుకదా? ఇవిగో తెచ్చాం. కేకు ఆర్డర్ చేశాం. వాటితో సరిపెట్టుకో. సరేనా?` అన్నాం. మొహం చిన్నబోయింది. అంతలోనే సర్దుకొంది. `చాలా బాగున్నాయి,` అంది. రెండుచేతులకీ హెన్నా డిజైన్స్ పెట్టించుకొని మా అమ్మాయిలు నిద్రకి ఉపక్రమించిన తరువాత కారు డిక్కీలో వదిలేసిన గిఫ్ట్‌ప్యాక్ చేసి ఉన్న బాక్స్‌ని ఇంటిలోకి తీసుకొనివచ్చి పెట్టాం. బహుమతి చూసి శ్రావ్య ఏమంటుందో!
ఎవరో అంటారు, `గిఫ్ట్‌బాక్స్‌లో ఏముందో నాకుతెలియదు. కానీ అదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓపెన్ చెయ్యని వాటిల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది,` అని.
రేపు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రోజు సరైన బహుమతికోసం వెతకడం మొదలు పెడతాం. లేదా ఒక్కోసారి అదేరోజు ఊరిమీద పడతాం. ఆలోచించే అంత సమయం దొరకదు. ఏదికొందామన్నా తృప్తి ఉండదు. సరిగ్గా అప్పుడు అనిపిస్తుంది, `ఎలాంటి బహుమతులు ఇవ్వాలనేది ఎవరైనా నాకు చెబితే బాగుణ్ణు` అని.
రేపు మా పెద్ద అమ్మాయి శ్రావ్యపూర్ణిమ బర్త్‌డే. ఊరంతా తిరిగాం మంచి గిఫ్ట్‌కోసం. ఇంటికి తిరిగి వచ్చాకా, `అమ్మా, బావజ్జీ(డాడీ) ఏమి కొన్నారు?` అని ఆతృతగా అడిగింది. `మంచివేమీ దొరకలేదు. హెయిర్ బ్యాండ్స్, నెయిల్ ఆర్ట్, చాకోలేట్స్.. లాంటివి అడిగావుకదా? ఇవిగో తెచ్చాం. కేకు ఆర్డర్ చేశాం. వాటితో సరిపెట్టుకో. సరేనా?` అన్నాం. మొహం చిన్నబోయింది. అంతలోనే సర్దుకొంది. `చాలా బాగున్నాయి,` అంది. రెండుచేతులకీ హెన్నా డిజైన్స్ పెట్టించుకొని మా అమ్మాయిలు నిద్రకి ఉపక్రమించిన తరువాత కారు డిక్కీలో వదిలేసిన గిఫ్ట్‌ప్యాక్ చేసి ఉన్న బాక్స్‌ని ఇంటిలోకి తీసుకొనివచ్చి పెట్టాం. బహుమతి చూసి శ్రావ్య ఏమంటుందో!
© Dantuluri Kishore Varma
ఎవరికి ఏది బహుమతి గా ఇవ్వాలో సెలెక్ట్ చేయడం ఒక్కోసారి చాలా కష్టమైన పనే వర్మ గారు..! అందునా ఆడపిల్లల కైతే మరీను..మొత్తానికి మీకూ ఇద్దరు అమ్మాయిలేనన్న మాట మా లాగా! అన్నట్టు మా చిన్న అమ్మాయి పేరు వర్ష ..!
ReplyDeleteకోఇన్సిడెన్స్ మూర్తిగారు!
Deleteమంచి నాన్న మీరు.ఎంతైనా టీచరుగారు కదా!పూర్ణిమ కు పుట్టినరోజు శుభాకాంక్షలు .
ReplyDeleteనిజమేనేమో అని ఆనందపడిపోతున్నాను. ధన్యవాదాలు నాగరాణిగారు.
DeleteIntaki em gift ichaaru? Em ledu,,telskunte naku future lo use avutundi... :)...naa kooturiki Inka 2 yrs e lendi....aina,,shop ki teskelli,vaalaaki nachindi konivachu,Leda pillala frnds ni maatallo petti vaalla istaalu telsukovachu..of course,,u need to work on that well in advance...
ReplyDeleteమీరు ఇచ్చిన ఐడియాలు చాలా బాగున్నాయి. వాళ్ళని షాపుకి తీసుకొనివెళితే క్యూరియాసిటీ పోతుంది..అందుకే!
DeleteEnti Sir, ee ratri nannu padukonichela leru... Okadanini minchi maroka post. Ee post lo konni linelu chaduvutunte edupochindi...
ReplyDeleteBhaskar.
ధన్యవాదాలు భాస్కర్‌గారు.
Delete