పిట్టలని పరిశీలించే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా?
బీటుకొట్టడం, సైటుకొట్టడం, కలరింగెయ్యడం.. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అయినా మీకు కొత్తగా చెప్పాలా ఏమిటి?
అదికాదురా బుర్రతక్కువ వెధవా. పిట్టలంటే పక్షులు.
ఓ అవా? కోడీ, కాకీ, గుడ్లగూబా, కొంగా, రాబందూ...
ఒరే ఒరే ఆపరా బాబూ. ఇవే కాకుండా ఇంకా అందమైన పక్షులు కూడా ఉంటాయి. రామచిలకా, నెమలీ, పావురం, కోయిలా...
నల్లగా ఉండే కోయిలకూడా అందమైనదేనా, గురూగారు?
అన్వేషణ సినిమాలో భానుప్రియ చూడు.. పక్షి కూతలు రికార్డుచేసే సరంజామా అంతా పట్టుకొని, తనుకూడా పక్షిలా కూస్తూ, పాడుకొంటూ అడవులవెంట వెళుతుందికదా? చూడటానికే కాదురా, వినడానికి కూడా అందమైన పక్షులు ఉంటాయి.
ఓ అర్ధమైందండి. అందంగా ఉన్న అమ్మాయిలు హీరోయిన్లయిపోతే, గొంతుబాగున్నవాళ్ళు ప్లేబ్యాక్ సింగర్లయినట్టు.
అబ్బా నీకు చాలా జనరల్ నాలెడ్జ్ ఉందిరా!
మరేమిటనుకొన్నారు మనమంటే?
అదిసరేకానీ నేనడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసా?
పిట్టల శాస్త్రం...పిట్టల శాస్త్రం...హూం...చిన్న క్లూ...ప్లీజ్!
సలీం ఆలీ అని ఒకాయన పక్షుల గురించి జీవితమంతా పరిశోధనచేసి చాలా పుస్తకాలు రాశాడు. ఈయన్ని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు.
పాస్...
పాసేంటిరా, పాస్?
తెలియదండీ బాబో!
ఆర్నితోలజీ.
ఆర్నీ, ఇదా! ఇది తెలియకపోవడం ఏమిటి గురువుగారు? నాలిక చివర ఆడింది కానీ, బయటకు రాలేదు. ఇంకొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా సరయిన సమాధానం చెప్పేవాడ్నండీ! సర్లెండి, దాన్ని అలా ఉంచండి. మీకు పక్షులగురించి బాగా తెలిసినట్టే ఉంది. మొన్న కోరుకొండ వెళ్ళినప్పుడు అక్కడేదో పిట్ట కనిపిస్తే ఓ ఫోటో పీకాను. చూశారా నేనుకూడా ఆర్నితోలజిస్టునే! ఈ పిట్టపేరేమిటో ఖచ్చితంగా చెప్పాలి మీరు(ఎవరైనా సరే). అదీ సంగతి!
ఈ పిట్ట పేరేమిటి? |
© Dantuluri Kishore Varma
Gorinka
ReplyDeleteనాకయితే ఖచ్చితంగా తెలియదండీ!
Delete