పొలాలనుంచి ధాన్యాన్ని గాదె దగ్గరకి చేర్చడానికి ఎడ్లబళ్ళను విరివిగా వాడేవారు. ట్రాక్టర్లూ, లారీలూ వచ్చిన తరువాత ఎడ్లబండి స్థానాన్ని చాలామటుకు అవి ఆక్రమించినా, ఇప్పటికీ పల్లెల్లో ఎడ్లబళ్ళు కనిపిస్తున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా మిగిలిన సరుకుల రవాణాకి కూడా వీటిని వాడేవారు. ముఖ్యంగా కాకినాడనుంచి పల్లెటూర్లకి సరుకులు తీసుకెళ్ళడానికి ఇవే ఆధారం. స్వాతంత్ర్యానికి ముందు కాకినాడలో రెండువందలకి పైగా ఒంటెద్దు బళ్ళు ఉండేవట. బండివాళ్ళూ, సరుకులు ఎక్కించీ దింపే కార్మికులూ వందలకొద్దీ ఉండేవారట. వీళ్ళందరికీ కలిపి ఒక సంఘంవుండేది - ఒంటెద్దుబండి కార్మిక సంఘం అని. కాకినాడలో మొట్టమొదటి కార్మిక సంఘం అదే. క్రమంగా ఒంటెద్దుబళ్ళ స్థానంలో జోడెద్దుబళ్ళు వచ్చాయి.
ఇంకా బళ్ళు ఉన్నాయి. లారీలు, ట్రాక్టర్లనుంచి పోటీని తట్టుకొని తమ అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నాయి. గోల్డ్ మార్కెట్ సెంటర్ నుంచి దేవాలయం వీధికి వెళ్ళే దారిలో మీరు లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకొంటున్న బళ్ళని చూడవచ్చు.
© Dantuluri Kishore Varma
ఇలాంటి రవాణా ఇంకా కొనసాగటానికి కారణం ఆ వ్యక్తుల నిజాయితీ. మీ బ్లూగ్ దర్శిస్తే కాకినాడ వెళ్లినట్లే, మీ శైలి చదవాలనిపిస్తుంది.
ReplyDeleteఅంతరించి పోతున్న వ్యాపకాల్లో గూడుబండి తోలడం ఒకటి. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇలాంటివి ఉండేవని చరిత్రలోనే చదువుకోవాలి. మీ కామెంటుకి ధన్యవాదాలు.
Delete