ఒకసారి బ్యానర్లు కట్టించడానికి వెదురు బద్దలు కావలసి వచ్చాయి. వెదురు బుట్టలు, నిచ్చెనలూ తయారు చేసేవాళ్ళ దగ్గరకి వెళితే పది అడుగులుకూడాలేని చిన్న గెడకి రెండువందల రూపాయలు అడిగాడు. ఏజన్సీ ప్రాంతంలో వెదురు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. కానీ, మిగిలినచోట్ల ఒక్క గెడ కొనాలంటే రేట్లకి కళ్ళు తిరుగుతాయి. కేవలం గెడలే కాదు వెదురు బొమ్మలు, ఫర్నీచర్.. దీనితో చేసిన ఏదయినా మహా రేటే, వెదురు బొంగుల్లో మషాళాతో కలిపి కూరి మంటమీద కాల్చి తయారు చేసే బొంగులో చికెన్ కూడా!
ఎత్తయిన మిద్దెలమీదకి ఎక్కడానికి నిచ్చెనలు వెదురుతోనే ఎందుకు తయారు చేస్తారో తెలుసా? మొత్తమ్మీద వంద అడుగుల ఎత్తువరకూ కూడా వెదురు ఎదుగుతుంది. పొడవుగా, దృఢంగా ఉండే బొంగులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగే మొక్కల్లో ఒకటి. అనుకూలమైన వాతావరణం, నేల ఉంటే ఒక్కరోజులో 100 సెంటీమీటర్లు పెరుగుతుంది.
బై ద వే... పొడవైన గెడల్ని సైకిళ్ళకి కట్టుకొని ఎలా నడిపించుకొని వెళుతున్నారో చూడండి. వెదురుతో ఎదురొచ్చారు వీళ్ళు. ఆంధ్రాశబరిమలై వెళుతున్నప్పుడు తీసిన ఫోటోలు ఇవి.
© Dantuluri Kishore Varma
అవునండీ! మా ఊరికి సమీపంలో అడవి ఉండేది . ఆ అడవిలో ఎక్కడ చూసినా వెదురు పొదలు కనబడతాయి . ఆ వెదురు బద్దలతో తయారు చేసిన బుట్టలు లాంటివాటిని కొనాలంటే తలలు తిరిర్గిపోయే రెట్లు చెప్పేవారు . :) వెదురు బియ్యం చూసారా ..? మీరు నేను చూసాను.
ReplyDeleteవెదురు బియ్యం గురించి విన్నానండి. కానీ, చూడలేదు ఎప్పుడూ. అన్నం వండుకొంటారట వాటితో.
Delete