Pages

Thursday 12 September 2013

హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part I

దెయ్యాలు ఉన్నాయా!?

ఉన్నాయో, లేదో చెప్పాడానికి ముందు, మీకొక రెండు కథలు చెప్పాలి - ఇద్దరు చెప్పిన కథలు. కథలు అంటే కథలు కాదు. వాళ్ళు కళ్ళారా చూసిన నిజాలు. 

ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ? నా పేరు షణ్ముగం. నా చిన్నప్పుడే తమిళనాడునుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మా నాన్నకి బేకరీ ఉండేది. మూతబడిపోయింది. ఎందుకంటే - ప్రతీ వ్యాపారంలోలాగే పోటీ. రొట్టెలు చెయ్యడంలో, కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టడంలో మా నాన్నకి సహాయంచేస్తూ గడిపేశాను. బడికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. మా బేకరీ మూతబడడంతో, ఉద్యోగం వెతుక్కోవలసిన అవసరం పడింది. కానీ, పొట్టకోస్తే అక్షరం ముక్కరాని నాలాంటి వాడికి ఎవరు పనిస్తారు? 

రియల్ ఎస్టేట్ వ్యాపారం నా దృష్టిని ఆకర్షించింది. మధ్యవర్తిగా ఉండి సైట్లు అమ్మిపెడితే కమీషన్ వస్తుంది. కానీ, దీనిలో ఉన్న చిక్కేమిటంటే చాలాకాలానికి గానీ ఒకసైటు  అమ్మలేం. అందుకే దీనికి అనుబంధంగా అద్దెఇళ్ళ బ్రోకర్‌గా కూడా ఉండడం మొదలు పెట్టాను. ఇళ్ళ యజమాని దగ్గరనుంచీ, అద్దెకి వచ్చేవాళ్ళ దగ్గరనుంఛీ ఒక్కోనెల అద్దెని కమీషన్‌గా లాగొచ్చు - చాలా లాభసాటి వ్యవహారం. ఏమైనా లొసుగులున్న ఇళ్ళు అద్దెకు ఇప్పిస్తే ఓనర్నుంచి రెండు, మూడు నెలల అద్దె కమీషన్‌గా వస్తుంది. అలాంటీ డీల్ ఒక్కటి చేస్తే చాలు, జేబులు నిండిపోతాయి.  
ప్రమీలానగర్ మూడవ వీధిలో నాలుగంటే నాలుగే ఇళ్ళు ఉంటాయి. మెయిన్‌రోడ్‌నుంచి ప్రమీలానగర్లోనికి తిరిగి రెండువందలమీటర్లు ముందుకు వెళితే రోడ్డు చివరికి వస్తాం. అక్కడినుంచి ఎడమవైపుకి మలుపుతిరిగితే మూడవవీధి. జనాలుపెద్దగా తిరిగే వీధికాదు. నేను చెప్పిన ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. వాటికి ఎదురుగా పోరంబోకు స్థలం ఉంటుంది. దానికి చేర్చి కెమికల్ ఫేక్టరీగోడ. తలుపులూ, ద్వారబందాలు తీసేసిన కప్పులేని పాడుపడిన ఇల్లు మొదటిది. దానితరువాత స్టీలు బార్జీల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన కుమారస్వామి మేడ. ముగ్గురికొడుకులకి పెద్ద పెద్ద బంగళాలు కట్టి ఇచ్చేసి, కూతురి కోసం ఈ ఇల్లు కట్టాడు. మేనల్లుడికి ఇచ్చిపెళ్ళిచేసి అందులో కాపరానికి ఉంచాడు. దురదృష్టవశాత్తూ పెళ్ళయిన సంవత్సరంలోనే కుమారస్వామి కూతురూ, అల్లుడూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆతరువాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. మీకుతెలియంది ఏముంది? ఇలాంటి ఇళ్ళగురించి చాలా కథలు వింటుంటాం కదా? కానీ నేను అలాంటివి పట్టించుకొనే రకంకాదు. పైపెచ్చు, దీనిని అద్దెకు ఇప్పిస్తే పెద్ద ఎత్తున కమీషన్ ముడుతుంది నాకు.  కుమారస్వామి ఇంటి ప్రక్కన బ్యాంకులో పనిచేసే సాంబయ్యగారి రెండుపోర్షన్ల ఇల్లు. ఒకపోర్షన్లో ఓర్ అండ్ మాస్ట్  షిప్పింగ్ కంపెనీవాళ్ళ ఆఫీసు ఉంటుంది. ఇంకొకభాగం ఈమధ్యనే ఖాళీ అయ్యింది.  
ఆ రోజు పొద్దున్న అద్దెఇళ్ళ కోసం నాకు రెండు కాల్స్ వచ్చాయి. చేసినవాళ్ళలో ఒకడు శేషగిరి, రెండవవాడు తేజ. ప్రమీలా వీధిలో ఉన్న రెండు ఖాళీ ఇళ్ళనీ వాళ్ళిద్దరికీ ఇప్పించాను. కొన్నిరోజులతరువాత వాళ్ళిద్దరూ విడివిడిగా నాకు చెప్పిన కథలు, వాళ్ళమాటల్లోనే మీకు తిరిగి చెపుతాను.

తరువాతి భాగం లింకు ఈ క్రింద ఉంది చూడండి:

13 comments:

  1. ఇంటరెస్టింగ్ గా మొదలెట్టి ఇలా అపేసారేంటండీ...

    ReplyDelete
    Replies
    1. ఒకే పోస్టుగా అయితే పెద్దది అయిపోతుందని ఆపాల్సి వచ్చింది స్ఫురితగారు.

      Delete
  2. Interesting...twaraga raayandi plz

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నీరూగారు.

      Delete
  3. అబ్బా, మాంచి సస్పెన్స్ లో పెట్టి ఆపారు సుమీ :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. తరువాతి పోస్టులు తొందరలోనే వచ్చేస్తాయి

      Delete
  4. bhagunde sir kani madyalo apasaru amiti

    ReplyDelete
    Replies
    1. ఇది మూడు పార్టులుగా ఉండే కథ. రెండవపార్ట్ కూడా పోస్ట్ చేసాను చూడండి చైతన్యగారు.

      Delete
    2. పాఠకుల సౌకర్యార్థం రెండు పోస్టులుగా చేశాను గమనించగలరు.

      Delete
  5. wer is the second post ...please share the link

    ReplyDelete
    Replies
    1. పోస్టుకి క్రిందన లింక్ ఇచ్చాను చూడండి. హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part II అని ఉంది

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!