Pages

Tuesday, 25 February 2014

దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి ప్రసంగం 1954

కాకినాడలో సరస్వతి గాన సభ స్వర్ణోత్సవాల సంధర్భంగా దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు ప్రసంగించారు. ఆ రికార్డు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. అప్పటికి దేవులపల్లి వారికి 57 ఏళ్ళు ఉండి ఉంటాయి. ఈ గాన సభ 1903లో ఏర్పాటు అయినట్లుగా, 1929లో ఆంధ్రపత్రికలో వచ్చిన గాన సభ కార్యక్రమాల వివరాల ద్వారా అనిపిస్తోంది. మూగబోక ముందు శాస్త్రి గారి స్వరం ఎంత మధురంగా ఉందో ఆస్వాదించండి. 
-సౌజన్యం పి.వి.రమణగారు, శోభనాచల బ్లాగ్.



Dantuluri Kishore Varma

12 comments:

  1. మంచి పరిచయము. అభినందన.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రసాదరావుగారు.

      Delete
  2. చాలా అరుదైన ప్రసంగం వినే అవకాశం కలగజేశారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. నిన్ననోమొన్ననో శ్రీ వంకాయలవారు స్మృతిపారిజాతలనే పేజీలో దేవులపల్లిగారి గురించివ్రాసారు.దానికి నేను స్పందిస్తూ"ఆకులోఆకుయై ఆకురాలుకాలంలో రాలిన పికకుమారుని కంఠం వినడానికి వసంతము వచ్చేదాకా అంజలి ఘటించి వేచియుంటాన"నిరాసేను.ఎంత నవనీతహృదయుడీ కలికిపాటలకోయిలకుల సంభవుడు,కృష్ణశాస్త్రిగారు వెంటనే కరుణించి మూడూరోజులలోనే వినిపించారు తను కూసిందే మల్లెలవేళయని ముందే కోకిలకూజితాన్ని తొందరపడి వినిపించేరు.దిగిరండి,దిగిరండి దివినుండిభువికి అని వారికి నా వినతి .చాలా చక్కని రికార్డింగు భద్రపరచిన,ఆకాశవాణికి,శ్రీ రమణగారికి,శ్రీవర్మగారికి అభినందనలు-గంటి

    ReplyDelete
    Replies
    1. కలికిపాటలకోయిలకుల సంభవుడు.... చక్కని వ్యాఖ్యతో ఈ టపాకే అందం తెచ్చారు. ధన్యవాదాలు.

      Delete
  4. దేవులపలి వెంకట కృష్ణ శాస్త్రిగారి స్వరంలో ఆయన ఆలోచనలూ, సంస్కారం, ఆయన వ్యక్తిత్వం, తెలుసుకోగలిగాం. ఎంత చక్కని ఆలోచనా ఎంత లోతు ... ఎంత విచక్షణ, ఎంత చక్కని భాషా సంస్కారం .. చాలా చాలా సంతోషం కలిగించారు ఆ మహాకవి ప్రసంగాన్ని మీ సైట్లో పెట్టి మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు - గౌతమ్ కశ్యప్, సినీ రైటర్, Gautham Kashyap Film Writer

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చడం చాలా సంతోషం. మీ కామెంటుకి ధన్యవాదాలు కాశ్యప్‌గారు.

      Delete
  5. నాకు కాకినాడ అంటే అభిమానం... మా ఊరు కాకినాడ....
    మా నాన్నగారి పేరున బులుసు సంభామూర్తి గారి వికలంగా స్చూలో ఒక హలు ను కట్టించాం...
    యంగ్ మాన్ హ్యాపీ హాలు కు మేకప్ రూమ్ కూడా మా అమ్మా గారి పేరున కట్టించాం..
    దంటు సుర్యరాగారిద్వారా...

    ReplyDelete
    Replies
    1. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి పనులు చెయ్యడం అభినందనీయం అప్పారావుగారు.

      Delete
  6. ఈ లింకు పని చేస్తున్నదా ప్రయత్తిస్తే రావటం లేదు

    ReplyDelete
    Replies
    1. అవునండి పనిచెయ్యడం లేదు. రీస్టోర్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఆలశ్యంగా జవాబు ఇస్తున్నందుకు మన్నించాలి.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!