ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని కూల్‌డ్రింకుల కంటే ముందే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తయారీ మొదలైన ఆర్టోస్ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి కూల్‌డ్రింక్. తొంభై సంవత్సరాలకి పూర్వం భారతదేశంలో ఏడు సంస్థలు మాత్రమే సాఫ్ట్‌డ్రింకులని ఉత్పత్తి చేసేవట. వాటిలో ఆర్టోస్ ఒకటి. ప్రస్తుతం మిగిలినవన్నీ ఉత్పత్తి ఆపేసినా, నిరంతరాయంగా జనాదరణతో కొనసాగుతున్న ఒకేఒక్క డ్రింకు ఆర్టోస్. మార్కెట్‌లో ఉన్నవాటిల్లో భారతదేశం మొత్తంమీద అత్యంత ప్రాచీనమైనది కూడా ఇదే. సరిగ్గా గుర్తింపు రాలేదుకాని చారిత్రకంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
1912లో అడ్డూరి రామచంద్రరాజు అనే ఆయన కార్బొనేటేడ్ వాటర్ని సరఫరా చేస్తూ ఉండేవారట. అప్పట్లో సోడాలు త్రాగడానికి జనాలు చాలా భయపడే వారు. ఒక్కసారి రుచిచూడండి అని అడిగినా ఆరోగ్యానికి ఎక్కడ హానిచేస్తుందో అని సందేహించేవారు. సరిగ్గా అప్పుడే 1914లో మొదటిప్రపంచ యుద్దం రామచంద్రపురం సోడాలకి బాగా కలసి వచ్చింది. కొంతమంది సైనికులు ఈ ఊరికి వచ్చి ఉండడం జరిగింది. వాళ్ళు సోడాలు త్రాగడం గమనించిన ప్రజలు కూడా మెల్ల మెల్లగా వాటికి అలవాటు పడ్డారట. 1919 వచ్చేసరకి రామచంద్రరాజుగారు తమ్ముడు జగన్నాథరాజుని కూడా చేర్చుకొని లండన్ నుంచి సాఫ్ట్‌డ్రింకుల ఉత్పత్తి, సరఫరాకి కావలసిన సరంజామా దిగుమతి చేసుకొని ఆర్టోస్‌ని ప్రారంభించారు. ఆర్టోస్ గురించి ఇంకొక విషయం చెపుతారు. ఉభయగోదావరి జిల్లాలని రైస్‌బౌల్‌గా మార్చిన సర్ఆర్థర్ కాటన్ దవళేశ్వరం నుంచి లండన్‌కు వెళ్ళిపోతూ తనదగ్గర ఉన్న సోడా మెషీన్‌ని వదిలేసి వెళ్ళాడట. దానితోనే ప్రాధమికంగా ఆర్టోస్ ప్రస్థానం మొదలయ్యిందని అంటారు.
ఈ సాఫ్ట్‌డ్రింక్ రుచి చాలా బాగుంటుంది. బహుశా అందుకే ఇప్పటికీ భహుళజాతి కంపెనీల పోటీని తట్టుకొని నిలబడి ఉంది. మీరు ఆర్టోస్‌ని తాగాలంటే అన్నిచోట్లా దొరకక పోవచ్చు. ఎందుకంటే, దీని డిస్ట్రిబ్యూషన్ ఉభయగోదావరిజిల్లాల్లోనీ, విశాఖపట్నంలోనీ మాత్రమే ఉంది.
© Dantuluri Kishore Varma
avunu, nenu sankhavaram lopalaki routhalapudi velite(akkada ma pinni untaaru ), akkada okappudu idi thappa inkokati undedi kaadu, ippudu anni dorukutunnaayi.
ReplyDeleteచిల్డ్‌గా తాగితే చాలా బాగుండేది. పోటీకి తట్టుకొని ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన డ్రింక్‌గా ఉండడం నిజంగా ఆశ్చర్యం.
Deleteఎప్పుడూ వినలేదు ఈ డ్రింక్ గురించి. అభినందనలు.
ReplyDeleteతూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో తప్పించి బయట ఎక్కడా ఇది దొరికే అవకాశం తక్కువ. కాబట్టి మీరు విని ఉండకపోవడంలో ఆశ్చర్యంలేదు. చదివి స్పందించినందుకు ధన్యవాదాలు మెరాజ్ గారు.
Deleteనేను ఈ డ్రింక్ గురించి వినటం ఇదే మొదటిసారి. ఈ కోకో కోలాలు వగైరాలు మన కోస్తా జిల్లల్లో లోకల్ గా తయారుచేసే నిమ్మకాయ సోడా,ఐసులో పెట్టి ఇచ్చేది, ధాటికి తట్టుకోక్లేక పారిపొయ్యారని నా అభిప్రాయం. ఆందులో ఈ ఆర్టొస్ కూడా ఉందన్న మాట. గుడ్
ReplyDelete`కలకత్తా నుంచి బెహరాన్ కంపెనీ , మద్రాస్ నుంచి స్పెన్సర్స్ కంపెనీ , ముంబాయ్ నుంచి డ్యూకో కంపెనీ , డిల్లీ నుంచి రోజర్స్ కంపెనీ , హైదరాబాద్ నుంచి అల్లాఉద్దీన్ కంపెనీ , మధురై నుంచి విన్సెంట్ కంపెనీ , రామచంద్రపురం నుంచి ఎ.ఆర్.రాజు కంపెనీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి,` అని ఒకసారి న్యూస్‌పేపర్లో రాశారు దీని గురించి. ఇంకొకవిషయం శివరామప్రసాద్ గారు. ఇది పోటీని తట్టుకొని నిలబడింది. ఇప్పుడుకూడా ఉంది. మీ కామెంటు చూసి చిల్డ్ ఆర్టోస్ తాగినంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
Deleteఈ రోజుకీ ఆ దేశవాళీ డ్రింక్ నిలిచి ఉండటం దాని యొక్క నాణ్యతని తెలియజేస్తోంది.ఏమైనా ఈ సారి అటువేపు వచ్చినపుడు ఈ ఆర్టోస్ ని ఓసారి రుచి చూడాలి.అన్నట్టు మీ బ్లాగు 'మాస్త్ హెడ్'బావుంది ..ఫోటో ఏ వూరిలో తీశారు వర్మ గారు..?
ReplyDeleteగ్రేప్‌ఫ్లేవర్, పూర్తి కూలింగ్‌తో తాగండి మూర్తిగారు.
Deleteయానాం దాటినతరువాత గోదావరి గట్టుని చేర్చి మా ఇన్లాస్ ఊరు వుంది. పచ్చపచ్చని పొలాలు, గోదావరి గలగలలు, పిల్లకాలువలు, కొబ్బరిచెట్లతో భలేగా ఉంటుంది. మీకు కళ్ళకి గంతలు కట్టి, అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తే అది మనప్రాంతమో, కేరళానో తెలియక ఖచ్చితంగా తికమక పడతారు. అక్కడ తీసినదే ఆ ఫోటో. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంకా మరికొన్నిఫొటోలతో ఒక టపా పెడతానులెండి తొందరలోనే!
Thanks Mr. Varma to recollect..........
ReplyDeleteIt`s my pleasure Jagadish garu.
Deleteఅర్టోస్ ఇంకా ఉందా? నా చిన్నప్పుడు తాగినట్టు గుర్తు. కాని దాని వెనుక ఇంత కథ ఉందని తెలియదు. 1914లో మొదటి ప్రపంచ యుధ్ధం వర్మ గారు, రెండోది కాదు.
ReplyDeleteఅయినా కోనసీమలో చక్కగా కొబ్బరి బొండాలు దొరుకుతుంటే ఈ సాఫ్ట్ డ్రింకులెందుకండి?
నేను రెండేళ్ళక్రితం కేరళలోని అల్లెప్పీకి ఆఫీసు పని మీద వెళ్ళాను. (టూరిస్టుగా కాదు) నాకైతే మన కోనసీమ కేరళకంటే బాగుందనిపించింది.
ధన్యవాదాలు బోనగిరిగారు. మీరన్నది నిజమే. కొబ్బరిబొండాలకి సాటిరాగల డ్రింక్ ఏముంటుంది?
Delete